వాష్టింగన్: కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఆపాలని, అందుకు సమయం వృదా చేయాల్సిన అవసరం లేదని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో జరిగిన భేటీలో ట్రంప్ పైవిధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశం ప్రధానంగా ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి శాంతి పరిష్కారం కనుగొనడంపై దృష్టి సారించింది. ట్రంప్ తన శైలిలో యుద్ధాన్ని త్వరగా ముగించగలమని నమ్మకం వ్యక్తం చేయగా.. జెలెన్ స్కీ అమెరికా మద్దతు ఉక్రెయిన్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
ఈ చర్చల్లో సైనిక సహాయం, ఆర్థిక మద్దతు, రాజకీయ వ్యూహాలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. జెలెన్ స్కీ ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించి, అమెరికా సహాయం కొనసాగాలని కోరారు. ట్రంప్, తన పదవీకాలంలో ప్రత్యేక శాంతి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది.
యూరోపియన్ నాయకులు, ట్రంప్- జెలెన్‌స్కీల మధ్య చర్చలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి కొత్త మార్గం చూపవచ్చని భావిస్తున్నారు. అయితే, విశ్లేషకులు ట్రంప్ ప్రతిపాదించే శాంతి ప్రణాళికలో రష్యా పాత్ర ఎలా ఉంటుందనే అంశంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, ఈ సమావేశం ఉక్రెయిన్ భవిష్యత్తుకు కీలక మలుపు కావచ్చు. ట్రంప్ త్వరిత పరిష్కారం వాగ్దానం చేస్తున్నప్పటికీ జెలెన్ స్కీ మాత్రం ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, భూభాగ సమగ్రతపై రాజీ పడరాదని స్పష్టం చేస్తున్నారు.


