మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు శాంతి చర్చల వేళ అధ్యక్షుడు పుతిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య శాంతియుత మార్గం ద్వారా సమస్య పరిష్కారానికి ఉక్రెయిన్ ముందుకు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. లేని పక్షంలో సైనిక మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని పుతిన్ చెప్పుకొచ్చారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా ఆ దేశ మిలిటరీ కమాండ్ పోస్టును సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరిసిమోవ్, రష్యన్ దళాలతో పుతిన్ చర్చలు జరిపారు. అనంతరం పుతిన్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చలపై ఉక్రెయిన్ అధికారులకు పెద్దగా ఆసక్తి లేనట్లుగా ఉంది. సమస్య పరిష్కారానికి వాళ్లు తొందరపడటం లేదు. ఒక వేళ ఉక్రెయిన్ అధికారులు ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇష్టపడకపోతే.. ప్రత్యేక సైనిక చర్యతో మా లక్ష్యాలను సాధిస్తాం. రష్యా దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
రష్యా దాడులు..
మరోవైపు.. శాంతి చర్చల వేళ ఉక్రెయిన్‌పై రష్యా దళాలు విరుచుకుపడ్డాయి. కీవ్‌పై లాంగ్ రేంజ్ ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాలతో భారీ దాడి చేసింది. ఈ దాడులను జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ దౌత్యపరమైన మార్గాలకు కట్టుబడి ఉందని.. మాస్కోనే యుద్ధం పొడిగించాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌లో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అంతేకాకుండా భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలిసింది.
JUST IN:
🇷🇺 Putin in full military uniform:
" If Kiev does not want peace, Russia will achieve all Special Military Operation goals by MILITARY means" pic.twitter.com/CCMLzoA1GB— Megatron (@Megatron_ron) December 27, 2025


