గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని మద్దతు లభించింది. ఇప్పటివరకూ అమెరికా- గ్రీన్‌లాండ్ అంశంపై రష్యా వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉందని అంతా భావించినా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మాత్రం.. యూఎస్‌కే దాదాపు మద్దతు తెలిపాడు.
జాతీయ భద్రతా మండలిలో పుతిన్ మాట్లాడుతూ.. ‘ గ్రీన్‌లాండ్ అంశం మాకు సంబంధం లేదు. అది యూఎస్-నాటోలు చూసుకుంటాయి. గ్రీన్‌లాండ్ మా జోక్యం ఉండదు. అది అసలు రష్యాకు సంబంధం లేని అంశం. ఆ విషయాన్ని నాటో ఆర్గనైజేషన్-అమెరికాలు చూసుకుంటాయి. గ్రీన్‌లాండ్‌పై మధ్యలో మేము దూరాల్సిన అవసరం లేదు.
గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ ఎప్పుడూ కాలనీగా చూస్తుంది. గ్రీన్‌లాండ్‌పై క్రూరత్వం ప్రదర్శించకపోయినా.. దానిపై డెన్మార్క్ కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా.. ఏం జరిగినా గ్రీన్‌లాండ్ ఎపిసోడ్ అనేది మాకు అనవసరం. వాళ్ల వాళ్లు చూసుకుంటారు. మాకైతే సంబంధమే లేదు. 1917లో వర్జిన్ దీవుల్ని అమెరికాకు డెన్మార్క్ అమ్మేసింది. మేం కూడా అలస్కా(ప్రస్తుతం యూఎస్‌లో ఉన్న 49వ రాష్ట్రం) ను యూఎస్‌కు అమ్మేసాం. 1867లో సుమారు 7.2 మిలియన్ డాలర్లకు అలస్కాను అమ్మేశాం’ అని పుతిన్ గతాన్ని గుర్తు చేసుకున్నారు.


