ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. యువతితో మస్క్‌పై పుతిన్‌ కుట్ర? | Russian Spies Targeted Elon Musk Russian Spies After War In Ukraine Began | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. యువతితో మస్క్‌పై పుతిన్‌ కుట్ర?

May 18 2025 8:44 AM | Updated on May 18 2025 10:54 AM

Russian Spies Targeted Elon Musk Russian Spies After War In Ukraine Began

వాషింగ్టన్‌: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం ప్రారంభంలో రహస్యాల్ని తెలుసుకునేందుకు అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon musk)పై రష్యా యువతితో వలపు వల విసిరినట్లు మాజీ ఎఫ్‌బీఐ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ స్పెషల్‌ ఏజెంట్‌ జోనాథన్ బౌమా సంచలన వ్యాఖ్యలు చేశారు.

జర్మన్‌ బ్రాడ్‌కాస్టర్‌ జెడ్‌డీఎఫ్‌ తీసిన డాక్యుమెంటరీలో జోనాథ్‌ బౌమా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ యుద్ధానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా రష్యా ఇంటెలిజెన్స్‌ సాయంతో ఎలాన్‌ మస్క్‌, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్‌పై ఓ యువతి ప్రయోగించారు. మస్క్‌కు ఉన్న జూదం,మత్తు పదార్ధాల వినియోగంలాంటి వీక్నెస్‌ను అడ్డం పెట్టుకుని యుద్ధం సమాచారం సేకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు.  

పుతిన్‌కు ఆపరేషన్ గురించి తెలుసా?
ఇక మస్క్‌, పీటర్‌ థీల్‌పై జరిగిన ఈ సీక్రెట్‌ ఆపరేషన్‌ పుతిన్‌ కనుసన్నల్లోనే జరిగింది. పుతిన్‌ అనుమతి లేకుండా స్పై చేయరు కదా? అని జోనాథన్ బౌమా అన్నారు. అయితే, రష్యా జరిపిన సీక్రెట్‌ ఆపరేషన్‌లో మస్క్‌, పీటర్‌ థీల్‌ చిక్కుకున్నారా? లేదా? అనే విషయాల్ని వెల్లడించేందుకు జోనాథన్ బౌమా విముఖత వ్యక్తం చేశారు.

కాగా, ఎఫ్‌బీఐలో 16 ఏళ్లు పని చేసిన జోనాథ్‌ బౌమా ఓ మీడియా సంస్థకు రహస్య సమాచారాన్ని అందించారు. దీంతో అమెరికా ప్రభుత్వం జోనాథ్‌ బౌమాను అరెస్ట్‌ చేసింది. చివరకు లక్షడాలర్ల పూచికత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement