‘ఇరాన్‌పై యుద్ధం ఆగదు.. మా టార్గెట్‌ అదే’ దాడులపై ట్రంప్‌ కీలక ప్రకటన | Trump says Iran conflict could last 4 weeks | Sakshi
Sakshi News home page

‘ఇరాన్‌పై యుద్ధం ఆగదు.. మా టార్గెట్‌ అదే’ దాడులపై ట్రంప్‌ కీలక ప్రకటన

Mar 2 2026 7:45 AM | Updated on Mar 2 2026 8:31 AM

Trump says Iran conflict could last 4 weeks

వాషింగ్టన్‌: దశాబ్దాల పాటు తిరుగులేని రీతిలో ఇరాన్‌ను శాసించిన సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఖమేనీ మరణంతో దాడులు ఆగుతాయని అందరూ భావించారు. కానీ ఆ దాడులు ఆగవని, నాలుగు వారాల పాటు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు.  

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు నాలుగు వారాలు కొనసాగుతాయి. ఇరాన్‌ పెద్ద దేశం. ఈ దాడులు నాలుగు వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజుల సమయం పడుతుందని మేం భావిస్తున్నాం’అని ట్రంప్‌ తన మార్ ఎ లాగో రిసార్ట్ నుండి ఫోన్ ఇంటర్వ్యూలో తెలిపారు. 

అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన సంయుక్తంగా జరిపిన భీకర దాడిలో సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ,వారి కుటుంబ సభ్యులు, ఇతర కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వారి మరణాలను ట్రంప్‌ ధృవీకరించారు. అమెరికా సైనిక చర్య ప్రణాళిక బద్ధంగా జరుగుతుందన్న ట్రంప్‌.. ఊహించని దాని కంటే చాలా ఎక్కువ మొత్తంలో ఇరాన్‌ నాయకత్వాన్ని అంతమొందించాం. ఆ మొత్తం 48 మంది ఉన్నట్లు కనిపిస్తోంది. 

అయినప్పటికీ ఇరాన్‌పై మా యుద్ధ కార్యకలాపాలు కొనసాగుతాయి. ఇప్పట్లో ఆగవు. పెద్ద దేశం కాబట్టి వారాల సమయం పట్టొచ్చు. ఇరాన్‌లో మాకు చాలా బలమైన లక్ష్యాలు ఉన్నాయి. తాము నిర్ధేశించిన లక్ష్యాలను నాశనం చేసేందుకు వరకు ఉపేక్షించం. అమెరికా తన మొత్తం ఫోర్స్‌ను రంగంలోకి దింపిందని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా ఓ వైపు దాడులు చేస్తూనే ఇరాన్‌తో దౌత్యానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్‌ స్పష్టం చేశారు. అందుకు.. త్వరలో మీరు ఇరాన్‌తో చర్చలు జరుపుతారా? అని మీడియా ప్రశ్నించగా.. వాళ్లు మాతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఆ పనేది గత వారం చేయాల్సి ఉంది. ఈ వారం కాదని పునరుద్ఘాటించారు.  

ఇరాన్‌ జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వారి మరణంపై డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారికంగా స్పందించారు. వాళ్ళు గొప్ప వ్యక్తులు. దురదృష్టవశాత్తూ  ఇలా జరుగుతుందని మేం ముందే ఊహించాం. మరి కొంతమంది  అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

బంకర్‌ బస్టర్‌ బాంబులతో
ఇరాన్‌లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం. ఖమేనీ ప్రతీ వారం ప్రారంభం రోజున(శనివారం) తన అధికారిక నివాసంలో కీలక ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. ఈ సారి ఖమేనీ తన అధికారిక నివాసంలో కాకుండా ఓ స్కూల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంపై నిఘా పెట్టిన అమెరికా, ఇజ్రాయెల్‌ 30కి పైగా శక్తివంతమైన బంకర్‌ బస్టర్‌ బాంబులను ప్రయోగించాయి. ఖమేనీ ప్రాణాలు తీశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement