తాలిబన్ల దెబ్బ అదుర్స్‌.. దాడుల్లో పాకిస్తాన్‌కు కొత్త కష్టాలు! | Taliban Attacks Pakistan Nur Khan Air Base | Sakshi
Sakshi News home page

తాలిబన్ల దెబ్బ అదుర్స్‌.. దాడుల్లో పాకిస్తాన్‌కు కొత్త కష్టాలు!

Mar 2 2026 10:46 AM | Updated on Mar 2 2026 11:42 AM

Taliban Attacks Pakistan Nur Khan Air Base

ఇస్లామాబాద్‌: ప్రపంచమంతా ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అటు ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు చేస్తుండగా.. ఇరాన్‌ సైతం ఇజ్రాయెల్‌, దుబాయ్‌, బహ్రెయిన్‌ వంటి పలు దేశాలపై విరుచుకుపడుతోంది. మరోవైపు.. పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య యుద్ధం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా ఆప్ఘన్‌ సైన్యం.. పాకిస్తాన్‌లోని నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది. దాడి సంబంధించిన వీడియోలను రిలీజ్‌ చేసింది.

పాకిస్తాన్‌పై ఆప్ఘనిస్తాన్‌ సైన్యం విరుచుకుపడుతోంది. తాజాగా పాకిస్తాన్‌లోని రావల్పిండి, పాక్‌ కీలక ఎయిన్‌బేస్‌ నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌పై డ్రోన్‌ దాడి చేసింది. ఈ మేరకు ఆప్ఘనిస్తాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ట్విట్టర్‌ వేదికగా..‘ఆప్ఘనిస్తాన్‌ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ వైమానిక దళం పాకిస్తాన్‌లోని కీలకమైన సైనిక స్థావరాలపై ఖచ్చితమైన, సమన్వయంతో కూడిన వైమానిక దాడులను నిర్వహించింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, క్వెట్టా (బలూచిస్తాన్)లోని 12వ డివిజన్ ప్రధాన కార్యాలయం దాడి జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మొహమ్మద్ ఏజెన్సీలోని ఖ్వాజాయ్ క్యాంప్, అలాగే అనేక ఇతర ముఖ్యమైన పాకిస్తాన్ సైనిక స్థావరాలు, కమాండ్ సెంటర్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి’ అని తెలిపింది. ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను విడుదల చేసింది.

ఇదిలా ఉండగా.. రెండు దేశాల మధ్య పెద్ద ఎత్తున సరిహద్దు ఘర్షణల మధ్య ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు, తూర్పు ఆఫ్ఘన్ నగరమైన జలాలాబాద్‌లో పాకిస్తాన్ ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు తాలిబాన్ అధికారులు పేర్కొన్నారు. విమానం నుండి పారాచూట్ చేసిన తర్వాత పైలట్‌ను సజీవంగా పట్టుకున్నట్లు వార్తా సంస్థ AFP నివేదించింది. పైలట్ దిగిన కొద్దిసేపటికే అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక నివాసితులు AFPకి తెలిపారు.

ఇక, పాకిస్తాన్‌ శుక్రవారం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్, తాలిబాన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుండ్జాదా కేంద్రంగా ఉన్న దక్షిణ నగరం కాందహార్‌పై వైమానిక దాడులు ప్రారంభించింది. 133 మంది తాలిబాన్ యోధులు మరణించారని, 200 మందికి పైగా గాయపడ్డారని, అనేక పోస్టులు ధ్వంసమయ్యాయని పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, పాక్‌ దాడులకు ప్రతిస్పందనగా సరిహద్దు దాడులను తాము నిర్వహించామని తాలిబాన్ అధికారులు పేర్కొన్నారు. కనీసం 55 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు చెప్పుకొచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement