
భారత్‌తో రష్యా సంబంధాలపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్యం విషయంలో ట్రంప్ ప్రభుత్వ ఒత్తిళ్లపై భారత్(India On US Sanctions) ఏనాటికీ తలవంచబోదని అన్నారు. ఈ క్రమంలో అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే.. భారతదేశం ఎప్పటికీ అవమానాన్ని అంగీకరించబోదని అన్నారాయన.
అక్టోబర్ 2న దక్షిణ రష్యాలోని సోచీలో జరిగిన అంతర్జాతీయ వాల్దాయ్ చర్చా వేదికలో ఆయన ప్రసంగించారు. భారత్ సహా 140 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు తగ్గించమని భారత్‌పై అమెరికా ఒత్తిళ్లు చేయడం పట్ల పుతిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టాన్ని కలిగిస్తాయని అన్నారాయన.
భారత్‌కు మద్దతుగా..
భారతదేశం ఎప్పటికీ అవమానాన్ని అంగీకరించదు. ఒకవేళ రష్యా చమురు(India Russia Oil) కొనుగోలు ఆపితే 9 నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు ఆ దేశానికి నష్టాలు తప్పవు. మోదీ నా స్నేహితుడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు. భారత ప్రజలు తమ నాయకత్వ నిర్ణయాలను గమనిస్తారు. వారు ఎప్పటికీ ఇతరుల ముందు అవమానాన్ని సహించరు అని అన్నారు.
#BREAKING: Russian President Putin at Valdai Club in Sochi on Trump Tariffs, says, “Indian people will look at what decisions are made by their political leadership. Indian people will never accept any humiliation. I know PM Modi, he will never take any steps of the kind.” pic.twitter.com/2GYqoVK1PO
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 2, 2025
ఇలాంటి ఒత్తిడులు అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టాన్ని కలిగిస్తాయని ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘ఇలాంటి నిర్ణయాలతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తుంది. దీని వల్ల అమెరికా ఆర్థిక వృద్ధే మందగిస్తుంది’’ అని పుతిన్ హెచ్చరించారు.
డిసెంబర్‌లో పర్యటన..
ప్రధాని మోదీతో నాకున్న సంబంధం ఆత్మీయత, నమ్మకంతో నిండినది. భారత్‌తో వ్యాపార అసమతుల్యత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం. భారతదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు ఎక్కువగా కొనుగోలు చేయాలని రష్యా యోచిస్తోంది. ఇందుకోసం డిసెంబర్‌లో భారత్‌లో పర్యటించబోతున్నా అని ప్రకటించారాయన.
అమెరికాపై ఫైర్
అమెరికా న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తిలో రష్యా యురేనియంపై ఆధారపడుతోంది. మేము అమెరికా మార్కెట్‌కు రెండవ అతిపెద్ద యురేనియం సరఫరాదారులం” అని పుతిన్ గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలపై చమురు కొనుగోళ్ల విషయంలో ఒత్తిడి చేయడం అమెరికా ద్వంద్వ వైఖరికి ఉదాహరణ అని పుతిన్ విమర్శించారు.
ఇదీ చదవండి: పాక్ పరువు.. మళ్లీ పాయే!