షాంఘై సదస్సు.. పాక్‌ ప్రధానికి మోదీ ఝలక్‌ | PM Modi at SCO Summit in China: Ignores Pakistan PM, Shares Warm Exchange with Putin | Sakshi
Sakshi News home page

షాంఘై సదస్సు.. పాక్‌ ప్రధానికి మోదీ ఝలక్‌

Sep 1 2025 9:54 AM | Updated on Sep 1 2025 1:08 PM

PM Modi And Shehbaz Sharif keep their distance at China summit

బీజింగ్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనలో ఉన్నారు. చైనాలోని తియాన్‌జిన్‌ వేదికగా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) 25వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఎస్‌సీవో సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సుకు మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. ఈ 
ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

తియాన్‌జిన్‌ వేదికగా జరుగుతున్న సదస్సుల్లో పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ సైతం ఉన్నారు. అయితే, ప్రధాని మోదీ మాత్రం పాక్‌ ప్రధానిని పట్టించుకోలేదు. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ను పలకరించలేదు. షాంఘై సదస్సులో భారత్‌, పాక్‌ ప్రధానులు ఎదురుపడినప్పటికీ మోదీ మాత్రం పలకరించలేదు. అయితే, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత మొదటిసారిగా మోదీ, షరీఫ్‌  ఎదురుపడ్డారు.

మరోవైపు.. ఇదే వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాత్రం ప్రధాని మోదీ ఎంతో ఆత్మీయతతో ఉ‍న్నారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్‌ను ప్రధాని మోదీ ఆత్మీయంగా పలకించారు. షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’ అని రాసుకొచ్చారు. ఇక, జిన్‌పింగ్‌, పుతిన్‌తో మాట్లాడిన ఫొటోలను పోస్టు చేశారు. ఇదే సమయంలో తియాన్‌జిన్‌లో చర్చలు కొనసాగుతున్నాయి అని పేర్కొన్నారు.


మరోవైపు.. ఈ సదస్సు అనుబంధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ద్వైపాక్షికంగా సమావేశం కానున్నారు. రష్యా చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్‌పై ట్రంప్‌ అదనపు సుంకాలు, ఉక్రెయిన్‌పై మాస్కో యుద్ధం వంటి పరిణామాల వేళ వీరి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టారిఫ్‌ల అంశంపై వీరిద్దరూ చర్చించుకునే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement