దక్షిణకొరియాలో భారీ సైబర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. 1,20,000 సీసీ కెమెరాలు హ్యాక్ చేసి వాటి ద్వారా రహస్య సమాచారం సేకరిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ద్యారా ప్రజలు వ్యక్తిగత వీడియోలను నిందితులు సేకరించేవారని వాటిని అమ్మి పెద్ద మెుత్తంలో డబ్బు సంపాదించేవారని తెలిపారు.
దక్షిణ కొరియాలో భారీ స్కామ్ బయిటపడింది. నివాస ప్రాంతాలతో పాటు పలు వ్యక్తిగత ప్రదేశాలలో భద్రత కోసం ఏర్పరుచుకున్న సీసీ కెమెరాలను సైబర్ ముఠా హ్యాక్ చేశారు. అనంతరం ఆ కెమెరాల ద్వారా బాధితుల వ్యక్తిగత వీడియోలను సేకరించి ప్రైవేట్ వెబ్‌సైట్ లకు అమ్మేవారు. దీనికోసం నిందితులు, నివాస గృహాలు, ఆసుపత్రులు, లాడ్జ్ లు ఇతర ప్రాంతాలలో అమర్చిన సీసీ కెమెరాలనే టార్గెట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా ఈ ఘటనపై సౌత్ కొరియా పోలీసులు ప్రకటన విడుదల చేశారు. నిందితులని అదుపులోకి తీసుకున్నామని వారిలో ఒకరు 63 వేల కెమెరాలను హ్యాక్ చేశాడని పోలీసులు తెలిపారు. దాని ద్వారా 545 వ్యక్తిగత వీడియోలను సేకరించి వివిధ వెబ్‌సైట్ లకు అమ్మాడన్నారు. దాని ద్వారా 35 మిలియన్లు సంపాదించారని తెలిపారు. మరోక వ్యక్తి 70 వేల కెమెరాలను హ్యాక్ చేసి 648 ప్రైవేట్ వీడియోలను అమ్మినట్లు తెలిపారు. ఇలా చేయడం ద్వారా నిందితులిద్దరూ పెద్ద మెుత్తంలో డబ్బు సంపాదించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే అరెస్టైన నలుగురికి ఎటువంటి పరిచయం లేదన్నారు.
ప్రజల వ్యక్తిగత విషయాలకు సంబంధించిన వీడియోలు అప్ లోడ్ చేసిన వెబ్‌సైట్ లపై నిఘా ఉంచామని త్వరలోనే దానిలోని కంటెంట్ తొలగిస్తామని పోలీసులు తెలిపారు. వాటిని గుర్తించడానికి ఫారెన్ ఏజెన్సీల సహాయం తీసుకుంటున్నామన్నారు. నిందితులు సీసీ కెమెరాలు హ్యాక్ చేసిన ప్రదేశాలలో వారి కెమెరాలు హ్యాక్ అయినట్లు సమాచారమిచ్చామని పోలీసులు పేర్కొన్నారు. బాధితులకు కెమెరా హ్యాక్ కాకుండా ఏలా జాగ్రత్త పడాలి, పాస్ వర్డ్ ఎలా మార్చుకోవాలి అనే విషయాలపై అవగాహాన కల్పించినట్లు పేర్కొన్నారు.


