దేశ రాజధాని నగరం ఢిల్లీ సరిహద్దు సమీపంలో హర్యానాలో పట్టపగలే నడిరోడ్డుపై దారుణం చోటు చేసుకుంది. ప్రేమను తిరస్కరించిందనే అక్కసుతో కోచింగ్‌నుంచి తిరిగి వస్తున్న అమ్మాయిపై కాల్పులు జరిపాడో యువకుడు. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది. దీని ఆధారంగా నిందితుడిని జతిన్ మంగ్లాగా గుర్తించారు పోలీసులు.
హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలోని బల్లభ్‌గఢ్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. ప్రేమను తిరస్కరించడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తు ద్వారా తెలుస్తోంది. జతిన్ మంగ్లాగా గత కొన్ని రోజులగా ఈ అమ్మాయిని వేధిస్తున్నాడు. దీనిపై కాల్పులకు ఒకరోజు ముందు తమ తల్లి దండ్రులు వేధిస్తున్నాడని నింధితుడి తల్లికి ఫిర్యాదు చేసిందనీ, ఆ మర్నాడే ఈ దురాగతానికి పాల్పడ్డాడని బాధితురాలి సోదరి వాపోయింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే అతడి తల్లి వేడుకుందని అందుకే ఊరుకున్నామని తెలిపింది.
ఒక బుల్లెట్ భుజంపైకి,మరొక బుల్లెట్ ఆమె పొత్తికడుపులోకి దూసుకెళ్లింది. ఆమె నొప్పితో విలవిల్లాడుతూ కేకలు వేస్తుండగా, నిందితుడు తన బ్యాగ్ తీసుకొని అక్కడినుంచి ఉడాయించాడు. ఆ తరువాత స్నేహితులు తిరిగి ఆమె వద్దకు వచ్చి స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, బాలిక నిందితుడిని గుర్తించిందని పోలీసులు తెలిపారు. తన సోదరి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతోందని, రోజూ అదే మార్గంలో కోచింగ్ నుండి ఇంటికి తిరిగి రావడం గమనించి, జతిన్ కొన్ని రోజులుగా తనను వెంబడించి, దాడి చేశాడని బాధితురాలి సోదరి తెలిపిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రస్తుతం నింధితుడి కోసం గాలిస్తున్నా మన్నారు.
చదవండి: బెంగళూరు డాక్టర్ కేసులో ట్విస్ట్ : ప్రియురాలికి షాకింగ్ మెసేజ్


