
ఇస్తాంబుల్: తుర్కియే వేదికగా ఉక్రెయిన్‌తో జరిగే మొట్టమొదటిసారిగా జరిగే ప్రత్యక్ష శాంతి చర్చలకు అధ్యక్షుడు పుతిన్ హాజరుకావడం లేదని రష్యా తెలిపింది. అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు వ్లాదిమిర్ మెడిన్‌స్కీ సారథ్యంలోని బృందం గురువారం తుర్కియే రాజధాని అంకారా చేరుకుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు.
ముగ్గురు సభ్యులతో కూడిన సీనియర్ అధికారుల బృందానికి సాయంగా నలుగురితో కూడిన నిపుణుల బృందం కూడా ఉందన్నారు. ఉక్రెయిన్‌తో జరిగే చర్చలకు అధ్యక్షుడు పుతిన్ వెళ్లడం లేదన్నారు. మూడేళ్లుగా జరిగే యుద్ధానికి ముగింపు పలికేందుకు తుర్కియేలో జరిగే శాంతి చర్చలకు రావాలని పుతిన్‌కు జెలెన్‌స్కీ సవాల్ విసిరారు. తాజా పరిణామంపై తుర్కియేలోని అంటాల్యాలో జరుగుతున్న నాటో సమావేశానికి హాజరైన జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడుతూ.. కీలకమైన విధాన నిర్ణయాలను తీసుకునే అధికారం ఆ బృందంలోని వారెవరికీ లేదని వ్యాఖ్యానించారు.
అందుకే చర్చలకు తాను సైతం వెళ్లనని, రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్ సారథ్యంలో ప్రతినిధి బృందాన్ని పంపుతానని ప్రకటించారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో మాట్లాడాక చర్చల తేదీ, ప్రాంతం వెల్లడిస్తామన్నారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామన్న యూరప్ నేతల హెచ్చరికలు, ట్రంప్ ఒత్తిడితో పుతిన్ ఈ చర్చలకు హాజరయ్యే అవకాశముందని సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. చివరికి ఇరుదేశాల అధ్యక్షులకు బదులుగా ప్రతినిధి బృందాలను పంపడం నిరాశ కలిగించిందని పరిశీలకులు అంటున్నారు.
నేను వెళ్లనిదే పుతిన్ రారు
తుర్కియేలో జరిగే చర్చలకు పుతిన్ హాజ రు కాకపోవడంపై ఖతార్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయం తనకు ఆశ్చ ర్యం కలిగించలేదన్నారు. ‘నేను వెళ్లనిదే ఆ యన అక్కడికి రావడం అసాధ్యం’అంటూ పుతిన్ నిర్ణయాన్ని సమరి్ధస్తూ మాట్లాడారు.