చైనా విక్టరీ డే వేడుక.. అధునాతన భారీ ఆయుధ ప్రదర్శన | China Victory Day Military Parade 2025 In Beijing To Mark WW2 Anniversary, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

China Military Parade 2025: చైనా విక్టరీ డే వేడుకలు.. భారీ అధునాతన ఆయుధ ప్రదర్శన

Sep 3 2025 8:13 AM | Updated on Sep 3 2025 9:18 AM

china victory day parade 2025 Video Viral

బీజింగ్‌: డ్రాగన్‌ దేశం చైనాలో ప్రతి ఏటా జరిగే విక్టరీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విక్టరీ డే సందర్భంగా చైనా.. తొలిసారి అధునాతన ఆయుధాలను ప్రదర్శించింది. ఇక, ఈ ప్రదర్శనను రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తిలకించారు. చైనా విక్టరీ డే వేడుకల్లో పలు దేశాల నేతలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయానికి గుర్తుగా చైనా ఏటా విక్టరీ డే వేడుకలు జరుపుకుంటోంది. చైనాలోని తియానన్‌మెన్‌ స్వ్కేర్‌ విక్టరీ వేడుకలు జరుగుతున్నాయి. ఇక, 80వ వార్షికోత్సవానికి 26 దేశాలకు చెందిన అధినేతలు విచ్చేశారు. భారీ భద్రత నడుమ నిర్వహిస్తున్న విక్టరీ డే వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వీక్షించేందుకు దాదాపు 50వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా తొలిసారి అధునాతన ఆయుధాలను చైనా ప్రదర్శించింది. యుద్ధ విమానాలు, క్షిపణులు, ఎలక్ట్రానిక్‌ యుద్ధ సామగ్రి ప్రద‍ర్శించింది.
 

అత్యాధునిక ఆయుధాలు..
ఈ క్రమంలో ప్రపంచానికి తన బలాన్ని చూపించేందుకు.. తొలిసారిగా హైప్రొఫైల్‌ ఆయుధాలను చైనా ప్రదర్శించింది. నాల్గోతరం ప్రధాన యుద్ధ ట్యాంకర్‌ తొలి నమునాను ఇక్కడ ఆవిష్కరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అధునాతన ఆయుధాలు, అత్యాధునిక మానవరహిత పరికరాలు, హైపర్‌సోనిక్‌ వంటి క్షిపణులను ప్రదర్శించిన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ దేశీయంగా తయారైనవేనని, ఇప్పటికే వినియోగంలో ఉన్నట్లు చైనా సైనిక వర్గాలు వెల్లడించాయి. గగనతల రక్షణ వ్యవస్థలు, వ్యూహాత్మక క్షిపణులు కూడా ప్రదర్శనలో ఉంచనున్నట్లు సమాచారం. తద్వారా ప్రపంచానికి తన సైనిక శక్తిని చాటే ప్రయత్నాలు డ్రాగన్‌ చేస్తున్నట్లు తెలుసింది.

మరోవైపు, ఈ భారీ సైనిక కవాతు చైనా-జపాన్‌ల మధ్య వివాదంగా మారింది. ఈ వేడుకలో పాల్గొనొద్దని ప్రపంచ నాయకులను టోక్యో కోరింది. జపాన్‌ చేసిన ఈ అభ్యర్థనపై చైనా దౌత్యపరమైన నిరసనను తెలియజేసింది. తియాన్‌జిన్‌లో జరిగిన ఎస్‌సీవో శిఖరాగ్ర సమావేశానికి వచ్చిన నేతలందరూ ఇందులో పాల్గొంటారని తెలిపింది. ఇక, 66 సంవత్సరాలలో చైనా విక్టరీ వేడుకలకు హాజరైన మొదటి ఉత్తర కొరియా అధ్యక్షుడిగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement