వీడియో: ట్రంప్‌ ఓవరాక్షన్‌ ప్లాన్‌.. పుతిన్‌నే భయపెట్టే ప్రయత్నం! | Video Viral B-2 Bomber Screeches Over Vladimir Putin Head During Meeting, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

వీడియో: ట్రంప్‌ ఓవరాక్షన్‌ ప్లాన్‌.. పుతిన్‌నే భయపెట్టే ప్రయత్నం!

Aug 16 2025 9:13 AM | Updated on Aug 16 2025 10:14 AM

Video Viral B-2 Bomber Screeches Over Putin Head

అలాస్కా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కలిసిన వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఎంత బలమైన దేశమో.. చెప్పేందుకు పుతిన్‌కు చూపించాలనే ఉద్దేశ్యంతో ట్రంప్‌ పెద్ద ప్లానే చేశారు. పుతిన్‌ను ట్రంప్‌ ఆహ్వానిస్తున్న సమయంలో స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్స్ విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా విమానం దిగిన పుతిన్‌కు ట్రంప్‌ ఘన స్వాగతం పలికారు. అయితే, వారిద్దరూ ముందుకు సాగుతున్న సమయంలో అనూహ్యంగా స్టెల్త్ బాంబర్లు, F-22, F-35 ఫైటర్ జెట్‌లువిమానాలు గాల్లో దర్శనమిచ్చాయి. ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. దీంతో, ట్రంప్‌ చప్పట్లు కొడుతూ.. పుతిన్‌తో ఏదో మాట్లాడారు. మరోవైపు.. పుతిన్‌ మాత్రం వాటిని చూస్తూ ముందుకు కదిలారు.

ఇక, ట్రంప్‌-పుతిన్‌ సమావేశం జరుగుతున్నంత సేపూ కూడా అవి గాల్లోనే చక్కర్లు కొడుతూ కనిపించాయి. దీని ద్వారా పుతిన్ అమెరికా సైనిక శక్తిని గ్రహించాలని ట్రంప్ భావించారు. గత నెలలో ఇరాన్ అణు కర్మాగారాలను ట్రంప్ సైన్యం ఇదే బీ-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించి నాశనం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. అందరి కంటే తానే బలవంతుడు, తన దేశమే బలమైన దేశం అని నిరూపించాలని ట్రంప్‌ ఇలా చేశారని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. పుతిన్‌ను హెచ్చరించేందుకే ట్రంప్‌ ఇలా చేశారని మరి కొందరు అంటున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement