breaking news
B-2 Bomber
-
వీడియో: ట్రంప్ ఓవరాక్షన్ ప్లాన్.. పుతిన్‌నే భయపెట్టే ప్రయత్నం!
అలాస్కా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసిన వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఎంత బలమైన దేశమో.. చెప్పేందుకు పుతిన్‌కు చూపించాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ పెద్ద ప్లానే చేశారు. పుతిన్‌ను ట్రంప్ ఆహ్వానిస్తున్న సమయంలో స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్స్ విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా విమానం దిగిన పుతిన్‌కు ట్రంప్ ఘన స్వాగతం పలికారు. అయితే, వారిద్దరూ ముందుకు సాగుతున్న సమయంలో అనూహ్యంగా స్టెల్త్ బాంబర్లు, F-22, F-35 ఫైటర్ జెట్లువిమానాలు గాల్లో దర్శనమిచ్చాయి. ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. దీంతో, ట్రంప్ చప్పట్లు కొడుతూ.. పుతిన్‌తో ఏదో మాట్లాడారు. మరోవైపు.. పుతిన్ మాత్రం వాటిని చూస్తూ ముందుకు కదిలారు.Trump flies a B-2 over Putin’s head in a show of strength, look at the Trump’s body language, it’s all about dominance pic.twitter.com/cleGOmuedF— Prayag (@theprayagtiwari) August 15, 2025ఇక, ట్రంప్-పుతిన్ సమావేశం జరుగుతున్నంత సేపూ కూడా అవి గాల్లోనే చక్కర్లు కొడుతూ కనిపించాయి. దీని ద్వారా పుతిన్ అమెరికా సైనిక శక్తిని గ్రహించాలని ట్రంప్ భావించారు. గత నెలలో ఇరాన్ అణు కర్మాగారాలను ట్రంప్ సైన్యం ఇదే బీ-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించి నాశనం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. అందరి కంటే తానే బలవంతుడు, తన దేశమే బలమైన దేశం అని నిరూపించాలని ట్రంప్ ఇలా చేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పుతిన్‌ను హెచ్చరించేందుకే ట్రంప్ ఇలా చేశారని మరి కొందరు అంటున్నారు. 🔥 THIS is how you negotiate.Trump forced Putin and his motorcade to drive past a HUGE lineup of F-22s and attack helicopters on his way to the meeting…… Immediately after buzzing Putin’s head with a B-2 Stealth BomberIt’s pretty obvious who’s in the power position 🇺🇸 pic.twitter.com/0SF8sqDXQr— Nick Sortor (@nicksortor) August 15, 2025Trump made B-2 bombers fly over Putin in Alaska.What an insecure guy! Flexing military muscle for a guest he himself invited after failing to make any impact in Ukraine, like a scared kid trying to look tough with gimmicks. pic.twitter.com/29aFCTEvJD— THE SKIN DOCTOR (@theskindoctor13) August 15, 2025 -
ఆ అదృశ్య యుద్ధ విమానం వెనుక భారతీయ మేధావి!
వార్ టెక్నాలజీలో అత్యద్భుతం.. నార్త్రోప్ B-2 స్పిరిట్ బాంబర్. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా ప్రయోగించడంతో వీటి గురించి మరోసారి చర్చ నడుస్తోంది. అయితే ఈ యుద్ధ విమానాల రూపకల్పనలో భారతీయ మూలాలున్న మేధావి కూడా ఉన్నారు. కాలక్రమంలో.. గూఢచర్యం ఆరోపణలతో ఆయన జైలు పాలు కావడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగిన అంశం.నోషిర్ షెరియర్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia).. ముంబైలోని ఓ పార్శీ కుటుంబంలో 1944లో జన్మించారీయన. ఆపై 19 ఏళ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికాకు వలస వెళ్లి.. అక్కడ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. 1969లో ఆయనకు అమెరికా పౌరసత్వం లభించింది. ఇంజినీరింగ్ మేధావిగా నార్త్రోప్ గ్రుమ్మన్ కార్పొరేషన్లో B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌కు సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్‌ను రూపకల్పన చేయడంలో గోవాడియా కీలక పాత్ర పోషించారు. అయితే..దశాబ్దంన్నర తర్వాత.. అనారోగ్య కారణాలతో నార్త్రోప్ గ్రుమ్మన్ నుంచి తప్పుకున్న ఆయన న్యూమెక్సికోలో డిఫెన్స్ కన్సల్టింగ్ సంస్థ ప్రారంభించారు. అయితే 1997లో DARPAతో వివాదం కారణంగా ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దయింది. దీంతో.. చాలా కాలం ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు. 2005 అక్టోబర్ 15వ తేదీన హవాయ్‌లోని విల్లాపై దాడి చేసిన ఎఫ్‌బీఐ డబ్బుతో రహస్య సమాచారానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. చైనాతో రహస్య సంబంధాల నేపథ్యంలో ఆయన్ని అదే తేదీన అరెస్ట్ చేసింది. విచారణలో నివ్వెరపోయే విషయాలు అధికారులకు తెలిజేశారు. గోవాడియా చైనాలోని చెంగ్డూ, షెన్జెన్ వంటి నగరాలకు ఆరు సార్లు ప్రయాణించి, స్టెల్త్ మిసైల్ ఎగ్జాస్ట్ డిజైన్ చేయడంలో సహాయం చేశారని నిర్ధారించారు. బదులుగా చైనా నుంచి కనీసం $110,000 పొందారని తేలింది. మొత్తం 14 అభియోగాలలో ఆయన దోషిగా తేలడంతో 2011లో హోనోలులు కోర్టు ఆయనకు 32 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అలా ఒక మేధావి జీవితం.. గూఢచారిగా కటకటాల పాలైంది. కీలకంగా గోవాడియానే.. B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్‌ను అమెరికా డిఫెన్స్ కంపెనీ నార్త్రోప్ (ఇప్పటి నార్త్రోప్ గ్రుమన్) రూపొందించింది. ఈ ప్రాజెక్టులో అనేక మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పనిచేశారు. మరీ ముఖ్యంగా హాల్ మార్కేరియన్ (Hal Markarian),నోషిర్ షెరియర్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia) గురించి చెప్పుకోవాలి. మార్కేరియన్.. 1979లో B-2 బాంబర్‌కు సంబంధించిన తొలి డిజైన్ స్కెచ్‌లు రూపొందించారు. ఆయన ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. విమానం యొక్క ప్రాథమిక ఆకృతికి బీజం వేశారు. అయితే.. భారతీయ మూలాలున్న ఇంజినీర్ గోవాడియా B-2 బాంబర్‌లోని స్టెల్త్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, విమానం ఎగ్జాస్ట్‌ను రాడార్, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేయడంలో ఆయన టెక్నాలజీ కీలకమైంది. వీళ్లిద్దరితో పాటు ఇర్వ్ వాలాండ్, జాన్ కాషెన్, హాన్స్ గ్రెల్మాన్ వంటి స్టెల్త్ టెక్నాలజీ నిపుణులు కూడా భాగస్వాములయ్యారు.వియత్నాం, యోమ్ కిప్పూర్ యుద్ధాల సమయంలో అమెరికా ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించేందుకు నోషిర్ గోవాడియా నేతృత్వంలో.. ‘స్టెల్త్’ సాంకేతికతను అభివృద్ధి చేయడం ప్రారంభమైంది. ‘బ్లూబెర్రీ మిల్క్‌షేక్’ అనే కోడ్ నేమ్‌తో సాగిన గోప్యమైన ప్రాజెక్టులో గోవాడియా కీలకపాత్ర వహించారు. బాంబర్ ఇంజిన్ ఎగ్జాస్ట్‌ను రాడార్, హీట్ సెన్సర్లకు దృశ్యమవకుండా చేయడం ఆయన ప్రాథమిక లక్ష్యం. ఈ ప్రయత్నంలో ఆయన ఘన విజయం సాధించారు. B-2 బాంబర్ ప్రత్యేకతలుబీ2 బాంబర్.. దట్టమైన యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ డిఫెన్స్లలోకి చొచ్చుకుపోవడానికి తక్కువ-పరిశీలించదగిన స్టీల్త్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. అందుకే దీనిని స్టెల్త్ బాంబర్ అని పిలుస్తారు. స్టెల్త్ డిజైన్: ఇది ఫ్లయింగ్-వింగ్ ఆకృతిలో ఉండి, రాడార్‌కు కనిపించకుండా ఉండేలా రూపొందించబడింది. దీని రాడార్ క్రాస్ సెక్షన్ ఒక చిన్న పక్షి స్థాయిలో మాత్రమే ఉంటుంది.ఇన్ఫ్రారెడ్ & హీట్ సిగ్నేచర్ తగ్గింపు: ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా రూపొందించి, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేస్తుంది.అత్యధిక పరిధి: ఒకసారి మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్‌తో 10,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు.అత్యంత ఖచ్చితమైన దాడులు: 40,000 పౌండ్ల బాంబులు మోసే సామర్థ్యం ఉంది, అందులో న్యూక్లియర్ బాంబులు కూడా ఉంటాయి.క్రూ సౌకర్యాలు: దీన్ని “ఫ్లయింగ్ హోటల్” అని కూడా పిలుస్తారు—ఇందులో బెడ్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, టాయిలెట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని మిషన్లు 40 గంటలపాటు సాగుతాయి.తయారీ ఖర్చుబీ2 బాంబర్ ఖర్చు: సుమారు $2.1 నుండి $2.2 బిలియన్ (2025 నాటికి ₹17,000 కోట్లకు పైగా).మొత్తం ప్రోగ్రాం వ్యయం: అభివృద్ధి, పరీక్షలు, ఉత్పత్తి కలిపి $79 బిలియన్ ఖర్చయింది.ప్రతి మిషన్ ఖర్చు: ఒక B-2 మిషన్‌కు సగటున $3–4 మిలియన్ ఖర్చవుతుంది. ఎందుకంటే ఒక్క గంట ఫ్లైట్ ఖర్చే $150,000 ఉంటుంది.చైనా డ్రోన్ నిజంగా B-2ని పోలి ఉందా?అవును.. 2025 మేలో చైనాలోని మలాన్ టెస్ట్ బేస్ వద్ద శాటిలైట్ చిత్రాల్లో కనిపించిన స్టెల్త్ డ్రోన్ B-2 స్పిరిట్‌ను పోలి ఉంది. దీని వింగ్స్పాన్(సుమారు 52 మీటర్లు), టెయిల్‌లెస్ ఫ్లయింగ్-వింగ్ డిజైన్, ఇన్ఫ్రారెడ్-సిగ్నేచర్ తగ్గింపు లక్షణాలు.. ఇవి అన్నీ B-2 లక్షణాలను ప్రతిబింబిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది చైనా యొక్క H-20 ప్రాజెక్ట్ లేదా కొత్త హై-ఆల్టిట్యూడ్ స్టెల్త్ డ్రోన్ కావచ్చు. అయితే ఈ డ్రోన్ రూపకల్పనకు నోషిర్ గోవాడియా అందించిన గోప్య సమాచారం ప్రభావం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇరాన్ కంటే ముందు.. అమెరికా దీనిని ప్రయోగించిన సందర్భాలు🕊️ 1999 – కొసోవో యుద్ధం (Operation Allied Force)- B-2 బాంబర్లు తొలిసారిగా యుద్ధంలో పాల్గొన్న సందర్భం.- మిస్సోరీలోని వైట్మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి నేరుగా సెర్బియాకు వెళ్లి, కీలక లక్ష్యాలపై ఖచ్చితమైన బాంబింగ్ చేశారు.- ఒక్కో మిషన్ 30 గంటలకు పైగా సాగింది. 🏔️ 2001–2002 – ఆఫ్ఘానిస్తాన్ (Operation Enduring Freedom)- తాలిబాన్ స్థావరాలు, శిక్షణ శిబిరాలు, గుహలపై దాడులు.- అమెరికా నుంచి నేరుగా ఎగిరి, మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్‌తో లక్ష్యాలను చేరుకున్నారు. 🏜️ 2003 – ఇరాక్ యుద్ధం (Operation Iraqi Freedom)- ప్రారంభ దాడుల్లో భాగంగా సద్దాం హుస్సేన్‌కు చెందిన కమాండ్ సెంటర్లు, మిస్సైల్ సదుపాయాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి. 🌍 2011 – లిబియా (Operation Odyssey Dawn)- మూడు B-2 బాంబర్లు లిబియాలోని ఎయిర్‌ఫీల్డ్స్, ఫోర్టిఫైడ్ షెల్టర్లపై దాడి చేసి, నో-ఫ్లై జోన్ అమలు ప్రారంభానికి దోహదం చేశాయి. ⚔️ 2017 – సిరియా (అధికారికంగా నిర్ధారణ కాలేదు)- ఐసిస్ స్థావరాలపై B-2 బాంబర్లు GBU-57 బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయని నివేదికలు ఉన్నాయి. 🚀 2024 – యెమెన్- హౌతీ తిరుగుబాటుదారులపై దాడి. ఈ మిషన్ ద్వారా బీ-2 బాంబర్ సామర్థ్యాన్ని మళ్లీ ప్రపంచానికి చూపించారు. 🌑 2025 – ఇరాన్ (Operation Midnight Hammer)- 7 B-2 బాంబర్లు 37 గంటల పాటు ఎగిరి, ఇరాన్‌లోని Fordow, Natanz, Isfahan న్యూక్లియర్ కేంద్రాలపై 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయి.