పుతిన్‌.. నీకు 50 రోజుల సమయం ఇస్తున్నా: ట్రంప్‌ | If No Ukraine Deal Trump Warns Russia | Sakshi
Sakshi News home page

పుతిన్‌.. నీకు 50 రోజుల సమయం ఇస్తున్నా: ట్రంప్‌

Jul 14 2025 10:03 PM | Updated on Jul 14 2025 10:05 PM

 If No Ukraine Deal Trump Warns Russia

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..  వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మరో అడుగు ముందుకేశారు.  ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వార్నింగ్‌ ఇచ్చారు ట్రంప్‌. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.  రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.  

‘ పుతిన్‌ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి.  యుద్ధంపై 50 రోజుల్లో డీల్‌కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్‌లు చవిచూస్తుంది. ఆ టారిఫ్‌లు కూడా వంద శాతం దాటే ఉంటాయి.  రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే  పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు.  వైట్‌ హౌస్‌లో నాటో చీఫ్‌ మార్క్‌ రూట్‌ను కలిసిన నేపథ్యంలో ట్రంప్‌ కాస్త ఘాటుగా స్పందించారు

 ఇదీ చదవండి:

ట్రంప్‌- పుతిన్ బ్రొమాన్స్‌ ముగిసిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement