
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై రెండు వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ వెల్లడించారు. ఇదే సమయంలో పుతిన్-జెలెన్‌స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టమైన పని అంటూ చెప్పుకొచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ముందుగా కలుస్తారో లేదో చూడాలనుకుంటున్నాను. పుతిన్-జెలెన్‌స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం.. నూనె వెనిగర్‌ను కలపడం లాంటి కష్టమైన ప్రక్రియ. వారిద్దరూ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది. ఒకవేళ సమావేశం జరగకపోతే, ఎందుకు సమావేశం కాలేదో అందుకు గల కారణాలను తెలుసుకుంటానని అన్నారు. శాంతి చర్చలకు రష్యా ఒప్పుకోని క్రమంలో మాస్కో మరోసారి భారీ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై రెండు వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటాను’ అని చెప్పుకొచ్చారు.
Q: “How long will you give Putin?”
Trump: “A couple of weeks. We’re going to figure this out. It takes two to tango… In the meantime, people continue to die.”
Trump is NEVER going to hold Putin accountable. Ever.pic.twitter.com/TusMVxEIXk— Republicans against Trump (@RpsAgainstTrump) August 22, 2025
అయితే ఇరు దేశాలూ యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రజలను చంపుకుంటూనే ఉన్నారు. ఇది చాలా మూర్ఖత్వం. యుద్ధం వల్ల వారానికి 7,000 మంది చనిపోతున్నారు. నేను ముందు 5,000 అన్నాను కానీ ఇప్పుడు 7,000 మంది వారానికి చనిపోతున్నారు. అందులో ఎక్కువ మంది సైనికులే ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. తాజాగా రష్యా క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్‌లో ఒక అమెరికన్ కర్మాగారం దెబ్బతిన్నట్టు వచ్చిన వార్తపై స్పందిస్తూ ట్రంప్ స్పందించారు. రష్యా దాడుల విషయంలో తాను సంతోషంగా లేనని చెప్పారు. తాను ఏడు యుద్ధాలను పరిష్కరించానని చెప్పారు. మొత్తం 10 యుద్ధాలు ఆపిన తాను ఉక్రెయిన్- రష్యా యుద్ధం విషయంలో అస్సలు సంతోషంగా లేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్- పాక్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఇండియా–పాకిస్థాన్ మధ్య అణు యుద్ధాన్ని తాను నివారించానని ట్రంప్ పేర్కొన్నారు.