భారత్‌ కారణంగా పుతిన్‌ రెచ్చిపోతున్నారు.. రుబియో సంచలన వ్యాఖ్యలు | Marco Rubio Says India Buying Russian Oil Is Big Problem, Check Out Post Inside | Sakshi
Sakshi News home page

భారత్‌ కారణంగా పుతిన్‌ రెచ్చిపోతున్నారు.. రుబియో సంచలన వ్యాఖ్యలు

Aug 1 2025 9:46 AM | Updated on Aug 1 2025 1:49 PM

Marco Rubio Says India buying Russian oil Is Big Problem

వాషింగ్టన్‌: భారత్‌, రష్యా చమురు కొనుగోలు విషయమై అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర భారత్‌ కొంటున్న చమురుతోనే పుతిన్‌.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే భారత్‌తో చర్చల్లో తమను ఇబ్బందిపెట్టే అంశమని వ్యాఖ్యలు చేశారు.

అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో గురువారం ఫాక్స్‌ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అన్ని దేశాల్లాగే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు చమురు, బొగ్గు, గ్యాస్‌ కొనగలిగే శక్తి భారత్‌కు ఉంది. అయితే, భారత్‌.. తమ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. భారత్‌కు భారీగా ఇంధన అవసరాలున్నాయి. రష్యాపై పలు దేశాల ఆంక్షల వల్ల అక్కడ భారత్‌కు చమురు చౌకగా లభిస్తోంది. దురదృష్టవశాత్తూ భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే రష్యాలను నిధులు సమకూరుతున్నాయి. వాటిని రష్యా.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేయడంలో వాడుకుంటోంది. అదే యుద్ధంలో మనగలగడానికి రష్యాకు ఉపయోగపడుతోందన్నారు. అలాగే, ఇదే భారత్‌తో చర్చల్లో అమెరికాను ఇబ్బందిపెట్టే అంశం. ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ వాటాదారు. వ్యూహాత్మక భాగస్వామి. అయితే అన్ని అంశాల్లో మాదిరిగా విదేశాంగ విధానంలోని ప్రతి విషయంలో 100 శాతం సమయం కేటాయించడం సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు.

ఇక, అంతకుముందు.. భారత్, రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడ్డారు. తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టారు. ఇద్దరూ వారి మృత ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకోనీయండని, కలిసి మునగనీయండని వ్యాఖ్యానించారు. బుధవారం భారత్‌పై 25 శాతం సుంకాలతోపాటు పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్‌ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమని, వారిద్దరూ మునిగిపోతుంటే మాకెందుకని, మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని స్పష్టం చేశారు. ‘మనకు భారత్‌ స్నేహితురాలే అయినా ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయి. ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే.. భారత్‌ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement