
జెద్దా: మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.
అమెరికా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ విషయమై సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా చర్చించారు. ఈ క్రమంలో అమెరికా (USA) ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో, సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి తక్షణమే ఉక్రెయిన్‌పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇక ఖనిజాల తవ్వకానికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి వచ్చేందుకు రెండు దేశాలు నిర్ణయానికి వచ్చాయి.
ఈ సందర్బంగా అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు ఓకే చెప్పింది. ఇది యుద్దం ముగింపునకు కీలక పరిణామం. ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు కూడా తెలియజేస్తాం. ఇప్పుడు బంతి పుతిన్ చేతిలో ఉంది. రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి’ అని చెప్పుకొచ్చారు. ఇక, ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి రష్యాతో అమెరికా మాట్లాడనుంది.
🚨 BREAKING: Ukraine has agreed to a US proposal for a 30-day ceasefire, contingent on Russia’s acceptance.
The US will also resume military aid to Ukraine and lift the pause on intelligence-sharing as part of the agreement.#VMNews pic.twitter.com/FN8QlYlE7C— Virgin Media News (@VirginMediaNews) March 11, 2025
రష్యాపైకి ఉక్రెయిన్ డ్రోన్లు..
మరోవైపు.. ఉక్రెయిన్ మంగళవారం రష్యాపైకి అతిపెద్ద డ్రోన్ల దాడికి దిగింది. రష్యాలోని 10 ప్రాంతాలపైకి దూసుకొచ్చిన 337 డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా మిలటరీ తెలిపింది. డ్రోన్ల దాడిలో ఒకరు చనిపోగా పదుల సంఖ్యల జనం గాయపడినట్లు రష్యా తెలిపింది. యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో ఉక్రెయిన్–అమెరికా మధ్య సౌదీ అరేబియాలోని జెడ్డాలో మంగళవారం చర్చలు మొదలవడానికి కొద్ది గంటల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తాజా దాడిపై ఉక్రెయిన్ స్పందించలేదు. అత్యధికంగా సరిహద్దుల్లోని కస్క్ ప్రాంతంలోకి వచ్చిన 126 డ్రోన్లను కూల్చినట్లు రష్యా మిలటరీ తెలిపింది. రాజధాని మాస్కో దిశగా వచ్చిన మరో 91 డ్రోన్లను ధ్వంసం చేశామంది. ఇంకా, సరిహద్దులకు సమీపంలోని బెల్గొరోడ్, బ్రయాన్‌స్‌్క, వొరొనెజ్‌తోపాటు సుదూర ప్రాంతాలైన కలుగ, లిప్‌ట్‌స్‌్క, నిజ్నీ నొవ్‌గొరోడ్, ఒరియోల్, రైజాన్‌లపైకి కూడా ఇవి వచ్చాయని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment