మోదీ నాకు మాటిచ్చారు.. పుతిన్‌ ఆటకు చెక్‌: ట్రంప్‌ | Trump Claims PM Modi Has Assured Him Over Russia Oil | Sakshi
Sakshi News home page

మోదీ నాకు మాటిచ్చారు.. పుతిన్‌ ఆటకు చెక్‌: ట్రంప్‌

Oct 16 2025 7:26 AM | Updated on Oct 16 2025 7:30 AM

Trump Claims PM Modi Has Assured Him Over Russia Oil

వాషింగ్టన్‌: భారత్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో రష్యా నుంచి భారత్‌(India) చమురు కొనుగోలుచేయదని ప్రధాని మోదీ(PM Modi) తనకు కీలక హామీ ఇచ్చారని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి రష్యాను ఒంటరి చేయడంలో ఇదొక కీలక అడుగుగా ట్రంప్‌ అభివర్ణించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రష్యా(Oil Buy From Russia) నుంచి చమురు కొనుగోలు విషయంలో నేను భారత్‌తో మాట్లాడాను. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. ఇలా చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు లాభం కలుగుతోంది. పుతిన్‌ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. మాస్కో నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను అని చెప్పినట్టు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ఈరోజు తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్‌ పేర్కొన్నారు. దీంతో, నిజంగానే మోదీ హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ ధ్రువీకరించలేదు.

మరోవైపు.. రష్యా, చైనా అంశంపై కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ సందర్బంగా చైనా సైతం రష్యా ఆయిల్‌ను కొనకుండా చేస్తానని ఇక ఇదే మిగిలి ఉందన్నారు. భారత్‌, చైనా.. అమెరికాతో కలిసి వస్తే పుతిన్‌ చేస్తున్న యుద్ధానికి చెక్‌ పెట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఇంధన విధానంపై భారత్‌, అమెరికాల మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ యూఎస్‌కు భారత్‌ సన్నిహిత భాగస్వామి అని ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తనకు స్నేహితుడని చెప్పుకొచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement