breaking news
	
		
	
  Russia oil field
- 
      
                   
                                                       మోదీ నాకు మాటిచ్చారు.. పుతిన్ ఆటకు చెక్: ట్రంప్వాషింగ్టన్: భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో రష్యా నుంచి భారత్(India) చమురు కొనుగోలుచేయదని ప్రధాని మోదీ(PM Modi) తనకు కీలక హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాను ఒంటరి చేయడంలో ఇదొక కీలక అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రష్యా(Oil Buy From Russia) నుంచి చమురు కొనుగోలు విషయంలో నేను భారత్‌తో మాట్లాడాను. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. ఇలా చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు లాభం కలుగుతోంది. పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను అని చెప్పినట్టు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ఈరోజు తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, నిజంగానే మోదీ హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ ధ్రువీకరించలేదు.మరోవైపు.. రష్యా, చైనా అంశంపై కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ సందర్బంగా చైనా సైతం రష్యా ఆయిల్‌ను కొనకుండా చేస్తానని ఇక ఇదే మిగిలి ఉందన్నారు. భారత్, చైనా.. అమెరికాతో కలిసి వస్తే పుతిన్ చేస్తున్న యుద్ధానికి చెక్ పెట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఇంధన విధానంపై భారత్, అమెరికాల మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ యూఎస్‌కు భారత్ సన్నిహిత భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తనకు స్నేహితుడని చెప్పుకొచ్చారు. #WATCH | "Yeah, sure. He's (PM Narendra Modi) a friend of mine. We have a great relationship...I was not happy that India was buying oil. And he assured me today that they will not be buying oil from Russia. That's a big stop. Now we've got to get China to do the same thing..."… pic.twitter.com/xNehCBGomR— ANI (@ANI) October 15, 2025
- 
      
                   
                                                       'నేను చెప్పినట్లు చేయండి.. లేకుంటే': ట్రంప్ పోస్ట్ వైరల్డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా.. నాటో దేశాలు రష్యా చమురు కొనుగోలును ఆపివేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుందని అన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో రష్యా నుంచి పెట్రోలియం కొనుగోలు చేసినందుకు చైనాపై 50-100 శాతం సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు.అన్ని నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపివేసినప్పుడు.. నేను రష్యాపై ప్రధాన ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నాను. నాటో సభ్యులు రష్యా చమురు కొనుగోలు చేయడం షాకింగ్‌గా ఉంది. యుద్ధంలో గెలవడానికి వారి నిబద్ధత 100% కంటే చాలా తక్కువగా ఉందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో వెల్లడించారు.రష్యా ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశం చైనా, తర్వాత స్థానంలో భారతదేశం ఉంది. నాటో సభ్యదేశమైన టర్కీ మూడవ స్థానంలో ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే 32 దేశాల కూటమిలో హంగరీ, స్లోవేకియా కూడా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.రష్యా చమురుపై నాటో నిషేధం, చైనాపై సుంకాలు ఇవన్నీ కూడా యుద్ధాన్ని ముగించడంలో గొప్ప సహాయకారిగా ఉంటాయి. చైనాకు రష్యాపై బలమైన నియంత్రణ, పట్టు ఉన్నాయి. తానూ విధిస్తున్న సుంకాలు ఆ పట్టును విచ్ఛిన్నం చేస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం జరగడానికి కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అని అన్నారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికజో బైడెన్ అధ్యక్షుదిగా ఉన్న సమయంలో.. నేను అధ్యక్షుడినై ఉండి ఉంటే, ఈ యుద్ధమే ప్రారంభమయ్యేది కాదు. ఇది బైడెన్, జెలెన్స్కీల యుద్ధం అని ట్రంప్ అన్నారు. నేను చెప్పినట్లుగా చేస్తే.. యుద్ధం త్వరగా ముగుస్తుంది, ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే.. మీరు నా సమయాన్ని, దేశ సమయాన్ని, శక్తిని, డబ్బును వృధా చేస్తున్నవారు అవుతారని ఆయన స్పష్టం చేశారు.
- 
      
                   
                                                       రష్యా చమురు కొనుగోళ్లు ఆపలేదుఅమెరికా టారిఫ్‌ల బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ ఏఎస్ సాహ్ని తెలిపారు. ఆర్థిక ప్రయోజనాల ప్రాతిపదికనే ఐవోసీలాంటి రిఫైనింగ్ సంస్థలు కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. టారిఫ్‌ల నేపథ్యంలో కొనుగోళ్లను తగ్గించాలని గానీ లేదా మరింతగా పెంచాలని గానీ తమకు ఎలాంటి సూచనలు రాలేదని సాహ్ని చెప్పారు.రష్యా చమురుపై ఎలాంటి ఆంక్షలు లేవని, వాటికి విరుద్ధమైనవేమీ భారత్ చేయలేదని పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరికి ముందు భారత చమురు దిగుమతుల్లో 1 శాతం కన్నా తక్కువగా రష్యా వాటా ఉండేది. కానీ ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ఇంధనంపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత నుంచి ఇది 30 శాతానికి పెరిగింది. ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానంఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఐవోసీ రిఫైనరీలు ప్రాసెస్ చేసిన క్రూడాయిల్లో 22–23 శాతం వాటా రష్యా దిగుమతులది ఉంటోంది. అటు బీపీసీఎల్ క్రూడాయిల్ రిఫైనింగ్‌లో 34 శాతంగా నమోదైంది. మరోవైపు రష్యా చమురుపై డిస్కౌంట్లు, బ్యారెల్‌పై 1.5 డాలర్లకు తగ్గడంతో గత నెల దిగుమతులు కొంత తగ్గినట్లు బీపీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) వెత్సా రామకృష్ణ గుప్తా తెలిపారు.
- 
      
                   
                                 రష్యా చమురు క్షేత్రంలో ఓఎన్జీసీ విదేశ్కు 15% వాటా
 ► నేడు మోదీ, పుతిన్‌ల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు
 ► డీల్ విలువ 1.268 బిలియన్ డాలర్లు...
 న్యూఢిల్లీ: రష్యాలోని రెండో అతిపెద్ద చమురు క్షేత్రం ‘వాంకోర్’లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్(ఓవీఎల్) 15 శాతం వాటా కొనుగోలు కార్యరూపం దాల్చుతోంది. ఈ డీల్ విలువ 1.286 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.8,300 కోట్లు). ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా గురువారం ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి.
 
 ఓఎన్జీసీకి చెందిన విదేశీ పెట్టుబడుల అనుబంధ సంస్థ ఓవీఎల్.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీనికి సంబంధించి ప్రాథమిక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వాంకోర్ చమురు, గ్యాస్ క్షేత్రం డెవలపర్ అయిన రాస్‌నెఫ్ట్ అనుబంధ కంపెనీ వాంకోర్నెఫ్ట్తో షేర్ల కొనుగోలు, వాటాదారుల ఒప్పందంపై ఓవీఎల్ సంతకాలు కూడా చేసింది. దీని ప్రకారం అవసరమైతే అక్టోబర్ 31లోపు ఓవీఎల్‌కు ఈ డీల్ నుంచి వైదొలిగే అవకాశం కల్పించారు. అయితే, ఈ ఒప్పందానికి కట్టుబడేందుకు ఓవీఎల్ నిర్ణయించింది.
 
 ఇప్పుడు మోదీ పర్యటన సందర్భంగా ఈ ఫేజ్-1 డీల్ పూర్తయ్యే విధంగా సంతకాలు జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక చమురు పీఎస్‌యూ చేపడుతున్న తొలి విదేశీ కొనుగోలు ఒప్పందం ఇదే కావడం గమనార్హం.
 
 వాంకోర్ క్షేత్రంలో 2.5 బిలియన్ బ్యారెళ్ల ముడిచమురు నిల్వలు ఉన్నట్లు అంచనా. తాజా ఒప్పందం ప్రకారం ఓవీఎల్‌కు ఈ క్షేత్రాల నుంచి వార్షికంగా 3.3 మిలియన్ టన్నుల చమురు ఉత్పత్తికి అవకాశం లభిస్తుంది. కాగా, విదేశాల్లో ఓవీఎల్‌కు ఇది నాలుగో అతిపెద్ద కొనుగోలు ఒప్పందంగా నిలవనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో 36 ప్రాజెక్టులను ఓవీఎల్ నిర్వహిస్తోంది.


