ట్రంప్‌ ఎఫెక్ట్‌.. పుతిన్‌తో మోదీ చర్చలు: నాటో అధికారి కీలక వ్యాఖ్యలు | NATO chief Says Modi asking Putin to explain Ukraine strategy | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఎఫెక్ట్‌.. పుతిన్‌తో మోదీ చర్చలు: నాటో అధికారి కీలక వ్యాఖ్యలు

Sep 26 2025 10:55 AM | Updated on Sep 26 2025 11:46 AM

NATO chief Says Modi asking Putin to explain Ukraine strategy

వాష్టింగన్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Donald Trump) విధిస్తున్న టారిఫ్‌ల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్దం విషయమై పుతిన్‌తో భారత ప్రధాని మోదీ(Narendra Modi) చర్చలు జరిపారని నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుటె వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ విధించిన సుంకాల ఎఫెక్ట్‌ వల్లే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చారు.

న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నాటో(NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ..‘భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. పుతిన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్‌ విషయంలో రష్యా వ్యూహాన్ని వివరించాలని మోదీ కోరారు. రెండు దేశాల మధ్య యుద్ధం గురించి ఆరా తీశారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్‌పై సుంకాల భారం పడటంతో పుతిన్‌తో చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ వ్యూహాల గురించి అడిగి తెలుసుకున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే, ఆయన వ్యాఖ్యలపై భారత్‌ స్పందించలేదు. 

ఇదిలా ఉండగా.. డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించారు(Impose New Tariffs). బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ చర్యలు అమెరికాలో తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా ట్రంప్ పేర్కొన్నారు. అప్‌హోస్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. అలాగే బ్రాండెడ్‌ , పేటెంటెడ్‌ డ్రగ్స్‌పై(pharmaceutical products) ఏకంగా 100 శాతం విధిస్తామని స్పష్టం చేశారు. అయితే.. అమెరికాలో ప్లాంట్‌లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు సుంకాలు వర్తించదన్నారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ట్రూత్‌ సోషల్‌ మీడియా ద్వారా ట్రంప్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement