ఐటీ పోర్టల్‌తో తప్పని తిప్పలు

Infosys Flags Irregular Traffic On Income Tax Returns Website - Sakshi

పరిష్కారంపై ఇన్ఫోసిస్‌ కసరత్తు

న్యూఢిల్లీ: ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించి ఆదాయపు పన్ను పోర్టల్‌లో సమస్యలతో ట్యాక్స్‌పేయర్ల కుస్తీ కొనసాగుతోంది. దీంతో లోపాల పరిష్కారానికి సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ క్రియాత్మక చర్యలు తీసుకుంటోందని ఐటీ విభాగం వెల్లడించింది.

‘ఐటీడీ ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌ను ఉపయోగించుకోవడంలో ట్యాక్స్‌పేయర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి మా దృష్టికి వచ్చింది. ఇన్ఫోసిస్‌ కూడా దీన్ని గుర్తించి, పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది‘ అని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేసింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూపొందించిన కొత్త ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌ 2021 జూన్‌ 7న అందుబాటులోకి వచ్చినప్పట్నుంచీ లోపాలపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top