IT Returns: అందుబాటులోకి ఐటీఆర్‌-ఫారమ్‌లు.. గడువు తేదీ గుర్తుందిగా!

Income Tax Return IT department releases ITR 1 and ITR 4 forms - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో ఈ ఫైలింగ్‌ పోర్టల్‌పై ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు (ఐటీఆర్‌) 1, 4 లను ఆదాయపు పన్ను శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వ్యక్తులు, చిన్న వ్యాపారులు, వృత్తి నిపుణులు వీటిని దాఖలు చేస్తుంటారు. ఇతర ఐటీఆర్‌ పత్రాలను సైతం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్‌ల దాఖలు గడువు జూలై 31గా ఉంది. ఐటీఆర్‌ 1ను వ్యక్తులు, వేతన జీవులు, వృద్ధులు దాఖలు చేస్తుంటారు. ఐటీఆర్‌4ను వ్యాపారులు, వృత్తి నిపుణులు దాఖలు చేస్తుంటారు. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్‌, అందంగా సల్మాన్‌ ఖాన్‌)

ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో ఐటీఆర్‌ ఫారమ్‌లతోపాటు ఫారమ్-16 జీతం వివరాలు, పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ ఆదాయాలకు సంబంధించిన సమాచారంతో కూడిన ఎక్సెల్‌ యుటిలిటీ షీట్‌ వస్తుంది. దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని అవసరమైన సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత తిరిగి ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: ట్యాక్స్‌ పేయర్స్‌కు అలర్ట్‌: ఆలస్యమైతే రూ. 5 వేలు కట్టాలి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top