AI-Generated Photos Of Bollywood Actors As Women Goes Viral - Sakshi
Sakshi News home page

వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్‌, అందంగా సల్మాన్‌ ఖాన్‌

May 23 2023 4:17 PM | Updated on May 23 2023 5:15 PM

AI Generated Photos Of Bollywood Actors As Women Goes Viral - Sakshi

సాక్షి,ముంబై: ఏఐ ఆర్టిస్ట్‌  సాహిద్‌ మరోసారి బాలీవుడ్‌  సూపర్‌ స్టార్లను వెరైటీగా చూపించారు. బాలీవుడ్ నటులు మహిళలుగా  చాలా అందమైన ఏఐ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. పెదవులపై లిప్‌స్టిక్, కొన్ని అందమైన ఆభరణాలతో ఈ సూపర్‌స్టార్లంతా మహిళలుగా గుర్తించలేని విధంగా మారిపోయారు. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్‌ ఫౌండర్‌ ఎంగేజ్‌మెంట్‌)

అంతేకాదు వారి పేర్లను కూడా మార్చేశాడు. అమితాబ్ బచ్చన్ కాస్తా అమితా బచ్చన్ అయ్యారు. షారూఖ్ ఖాన్ షాజాదీ ఖాన్‌గా, వరుణ్ ధావన్ వర్షా ధావన్‌గా, రాజ్‌పాల్ యాదవ్ రాజ్‌రాణి యాదవ్‌గా, అమీర్ ఖాన్ అమీరా ఖాన్, టైగర్ ష్రాఫ్ ఫిమేల్ వెర్షన్ టైగ్రెస్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ సల్మా ఖాన్, అక్షయ్ కుమార్ అక్షయ కుమారి, పంకజ్ త్రిపాఠి, షాహిద్ కపూర్ షాహిదా కపూర్ అయిపోవడం  విశేషంగా నిలిచింది. (ఫేస్‌బుక్‌ మెటాకు భారీ షాక్‌: ఏకంగా 10వేల కోట్ల జరిమానా)

దీంతో ఫ్యాన్స్‌ పలు కమెంట్లతో సందడి చేశారు. అమితాబ్‌ బచ్చన్‌ అచ్చం రేఖలా ఉన్నారని ఒకరు, సల్మాన్‌ ఖాన్‌ అయితే చిత్రాంగద సింగ్‌ లా కనిపిస్తున్నాడని మరొకరు కమెంట్‌ చేశారు. ఇక  షారూక్‌ ఖాన్‌ అయితే అచ్చం  ఆయన భార్యలా కనిపిస్తున్నారని  మరో యూజర్‌ వ్యాఖ్యానించారు.  ఏఐ కళాకారుడు సాహిద్ మిడ్‌జర్నీ అనే ఏఐ టూల్‌ ద్వారా విభిన్న కళారూపాలను రూపొందించి సోషల్‌మీడియా యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. (రిలయన్స్‌ షాక్‌: ఉద్యోగాలు ఫట్‌; రానున్న కాలంలో వేలాది కోతలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement