రిటర్నుల ఈ–అసెస్‌మెంట్‌ను నోటిఫై చేసిన కేంద్రం | Government Notify Income tax Returns e assessment | Sakshi
Sakshi News home page

రిటర్నుల ఈ–అసెస్‌మెంట్‌ను నోటిఫై చేసిన కేంద్రం

Sep 14 2019 11:24 AM | Updated on Sep 14 2019 11:24 AM

Government Notify Income tax Returns e assessment - Sakshi

న్యూఢిల్లీ: దసరా (అక్టోబర్‌ 8) నుంచి ఎల్రక్టానిక్‌ రూపంలోనే రిటర్నుల పరిశీలన (ఈ–అసెస్‌మెంట్‌)ను ప్రారంభించేందుకు వీలుగా కేంద్ర ఆరి్థక శాఖ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో జాతీయ స్థాయిలో ఈ–అసెస్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు పడుతుంది. ఈ అసెస్‌మెంట్‌కు సంబంధించి వ్యక్తులు వ్యక్తిగతంగా లేదా అధికార ప్రతినిధి ద్వారా ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు హాజరవ్వాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్‌ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా హాజరై ఏవైనా తెలియజేయదలిస్తే, అందుకు అనుమతిస్తామని పేర్కొంది. పన్ను రిటర్నుల మదింపునకు సంబంధించి ఈ అసెస్‌మెంట్‌ కేంద్రం నోటీసులు జారీ చేస్తే, దీనికి సంబంధించి 15 రోజుల్లోపు స్పందన తెలియజేసిన కేసులను అసెసింగ్‌ అధికారికి ఆటోమేటిగ్గా బదిలీ చేయడం జరుగుతుందని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement