సాక్షి, విజయవాడ: అమరావతికి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వ భూములు కాకుండా 16,666 ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. భూ సమీకరణ బాధ్యత సీఆర్‌డీఏ(CRDA) కమిషనర్‌కు అప్పగించింది. అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో, తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో భూ సమీకరణ చేయనుంది.


