ITR Filing Deadline: మేమేమైనా మెషిన్లమా? మొత్తుకుంటున్న నెటిజన్లు

ITR Deadline: Extend Due Date Immediately Trends On Twitter - Sakshi

 మరికొన్ని రోజుల్లో ముగియనున్న ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు

ట్రెండింగ్‌లో #Extend_Due_Date_Immediately   

సాక్షి, ముంబై: ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి  చివరి తేదీని పొడిగించే ఆలోచన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే నెటిజన్లు మాత్రం గడువునే వెంటనే పొడిగించాలని డిమాండ్ చేశారు. జూలై 31వ  తేదీ లోపు ఫైల్ చేయడం సాధ్యం కాదు. దయచేసి ఆగస్ట్ 31 వరకు పొడిగించండి అని ట్విటర్‌ ద్వారా కోరుతున్నారు. అలాగే ఇన్‌కంటాక్స్‌ పోర్టల్‌ పని తీరుపై   విమర్శలు గుప్పిస్తున్నారు.

డెడ్‌లైన్‌ పొడిగింపులేదని ప్రకటించిన తరువాత పొడిగింపు కోసం ఎదురుచూస్తున్న పన్ను చెల్లింపు దారులు ట్విటర్‌లో గగ్గోలు పెడుతున్నారు. గడువుపెంచండి మహాప్రభో అని మొత్తుకుంటున్నారు.  గడువు తేదీని పొడిగించాల్సిందిగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో #Extend_Due_Date ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. టాక్స్‌ అఫీషియల్స్ ఏమైనా మెషీన్లా.. కాదు కదా.. తీవ్రమైన ఒత్తిడి, టెన్షన్‌తో వారు పనిచేస్తున్నారు. ఆగస్టు 31 వరకు గడువు పెంచాల్సిందే అని కొంతమంది కమెంట్‌ చేస్తున్నారు. పోర్టల్‌ పనిచేయడం లేదని మరికొంతమంది, ఫన్నీ కమెంట్స్‌,  రకరకాల మీమ్స్‌తో ట్విటర్‌లో హల్‌చల్‌ చేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top