
ఫిన్‌టెక్ సంస్థ క్లియర్‌ట్యాక్స్ తాజాగా ఐటీ రిటర్నులను ఫైలింగ్ చేసేందుకు సంబంధించి తెలుగు తదితర 7 భాషల్లో సహాయం పొందే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. బహు భాషల్లో పని చేసే కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత క్లియర్‌ట్యాక్స్ ఏఐ అసిస్టెంట్‌ను ఆవిష్కరించింది. దీనితో వాట్సాప్, స్లాక్ తదితర మాధ్యమాల ద్వారా తమకు కావాల్సిన భాషలో చాటింగ్ చేస్తూ, మూడు నిమిషాల వ్యవధిలోనే ఫైలింగ్ చేయొచ్చని సంస్థ వివరించింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ఫైల్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. దీనితో కొత్తగా 1 కోటి మంది ట్యాక్స్ ఫైలర్లను వ్యవస్థ పరిధిలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్‌కార్పెట్
ఐటీఆర్ కొత్త నిబంధనలు..
కఠినమైన జరిమానాలు: తప్పుదారి పట్టించే లేదా తప్పుడు ఐటీఆర్ దాఖలు చేసిన వారికి 200 శాతం జరిమానా, 24 శాతం వార్షిక వడ్డీ, సెక్షన్ 276సి ప్రకారం శిక్ష కూడా విధిస్తారు.
పన్ను చెల్లింపుదారుల బాధ్యత: సీఏ లేదా కన్సల్టెంట్ పొరపాటు చేసినా కూడా పన్ను చెల్లింపుదారుడే బాధ్యత వహించాలి.
అందరికీ వర్తింపు: ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారులు, ప్రొఫెషనల్స్ అందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.
సాధారణ తప్పులు: తప్పు ఐటీఆర్ ఫారమ్ ఎంపిక, తప్పుడు మినహాయింపులు, ఆదాయాన్ని ప్రకటించకపోవడం జరిమానాలకు దారి తీస్తాయి.
రివైజ్డ్ రిటర్న్‌తోనూ లాభం లేదు: ఇచ్చిన సమాచారం తప్పుగా ఉందని పన్ను శాఖ గుర్తిస్తే, రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేసినా జరిమానా తప్పదు.
సరైన ఐటీఆర్ ఫారమ్ ఎంపిక: ITR-1 (సాధారణ ఆదాయం), ITR-3 (వ్యాపార ఆదాయం) వంటి వివిధ ఫారమ్‌లు ఆదాయ రకాన్ని బట్టి ఎంచుకోవాలి.
తప్పు క్లెయిమ్‌లు చేయొద్దు: వ్యాపార ఖర్చులుగా వ్యక్తిగత ఖర్చులను చూపడం, తప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ క్లెయిమ్‌లు జరిమానాలకు దారి తీస్తాయి.
పన్ను చెల్లింపుదారులకు జాగ్రత్తలు: వార్షిక సమాచార ప్రకటనలోని వివరాలతో సరిపోల్చుకోవడం, సరైన రికార్డులు నిర్వహించడం, పన్ను నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా జరిమానాలను నివారించవచ్చు.