భారీగా పెరిగిన ట్యాక్స్‌ పేయర్లు! రికార్డు స్థాయిలో ఐటీఆర్‌లు

Finance Ministry says Record 8 18 crore ITRs filed so far in AY 2023 24 - Sakshi

దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2023-24 కు సంబంధించి 2023 డిసెంబరు 31 నాటికి రికార్డు స్థాయిలో​ 8.18 కోట్ల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ (ITR) దాఖలయ‍్యాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 7.51 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ డేటాను ఉటంకిస్తూ పేర్కొంది.

అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2022-23 కి దాఖలు చేసిన మొత్తం ఐటీఆర్‌ల కంటే ఇది 9 శాతం ఎక్కువని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అసెస్‌మెంట్ ఇయర్ అనేది గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయాన్ని, ఖజానాకు వచ్చిన ఆదాయాన్ని ప్రతిబింబిస్తుంది.

ఇదీ చదవండి: ఇంకా ఉన్నాయా..? రూ.2000 నోట్లపై ఆర్బీఐ ప్రకటన

ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. ఇక ఇదే కాలంలో దాఖలు చేసిన మొత్తం ఆడిట్ రిపోర్టులు, ఇతర ఫారాల సంఖ్య 1.6 కోట్లుగా ఉంది, గత సంవత్సరం ఇదే కాలంలో 1.43 కోట్ల ఆడిట్ నివేదికలు, ఫారాలు దాఖలయ్యాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top