దురంధర్ దూకుడు.. బాహుబలి-2 రికార్డ్ బ్రేక్..! | Ranveer Singh Dhurandhar Beats Bahubali 2 Record | Sakshi
Sakshi News home page

Dhurandhar Movie: దురంధర్ జోరు.. బాహుబలి-2 రికార్డ్‌ బ్రేక్..!

Jan 14 2026 4:17 PM | Updated on Jan 14 2026 4:28 PM

Ranveer Singh Dhurandhar Beats Bahubali 2 Record

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ దురంధర్‌. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రిలీజైన కొద్ది రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ రిలీజై 39 రోజులైనా వసూళ్ల పరంగా ఇంకా దూసుకెళ్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా రూ.1300 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది.

ఈ క్రమంలోనే మరో క్రేజీ రికార్డును తన సొంతం చేసుకుంది. నార్త్‌ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఈ రికార్డు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-2 పేరిట ఉండేది. తాజాగా ఈ రికార్డ్‌ను ధురంధర్ తుడిచిపెట్టేసింది. ఈ మూవీ నార్త్ అమెరికాలో 21 మిలియన్ డాలర్ల కలెక్షన్‌ రాబట్టింది. అంతకుముందు బాహుబలి-2  20.7 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. గత తొమ్మిది ఏళ్లుగా పదిలంగా ఉన్న ఈ రికార్డును ధురంధర్ బ్రేక్ చేసింది.

కాగా.. ఇప్పటికే ఈ మూవీ భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచింది.  ఈ మూవీకి ఆదిత్య ధార్ ధర్శకత్వం వహించారు. పాకిస్తాన్‌ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement