మెగాస్టార్ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర్ వరప్రసాద్‌గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత వేగంగా రూ.300 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ప్రాంతీయ సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది.
ఈ విషయాన్ని నిర్మాత సుస్మిత కొణిదెల ట్విటర్ వేదికగా షేర్ చేసింది. మనశంకర వరప్రసాద్‌గారు బాక్సాఫీస్ బద్దలైపోయింది అంటూ ట్వీట్ చేసింది. మెగాస్టార్ తన స్వాగ్, స్టైల్‌తో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది. మెగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. రెండో వారంలోనూ మెగా విధ్వంసం ప్రారంభమైందంటూ సుస్మిత తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. కేవలం రిలీజైన ఎనిమిది రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది.
కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించి అభిమానులను మెప్పించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు.
బాక్సాఫీస్ బద్దలైపోయింది💥💥💥
Megastar @KChiruTweets garu is breaking box office records with his SWAG and STYLE 😎🔥#ManaShankaraVaraPrasadGaru grosses ₹300+ crores worldwide and becomes an ALL-TIME INDUSTRY RECORD as the FASTEST regional film ❤️🔥… pic.twitter.com/9wmeDz9lKR— Sushmita Konidela (@sushkonidela) January 19, 2026


