Union Budget 2023-24: కొత్త ఇన్‌కం టాక్స్‌ ప్రశ్నలేంటీ? సమాధానాలేంటీ?

Income Tax which is the best option after the Budget announcement FAQs and Answers - Sakshi

2023-24 బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఇన్‌కంటాక్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.7 లక్షల వరకు పన్ను లేదన్న ప్రకటన ఎంత వరకు మేలు చేస్తుందన్న దానిపై రకరకాల అంచనాలు వేస్తున్నారు నిపుణులు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినదాని ప్రకారం.. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు, ఆదాయం రూ.7లక్షలు దాటితే మాత్రం 5 శ్లాబుల్లో పన్ను ఉంటుంది.

0-3 లక్షల వరకు నిల్‌
3 - 6 లక్షల వరకు 5% పన్ను
6 - 9 లక్షల వరకు 10% పన్ను
9 -12 లక్షల వరకు 15% పన్ను
12- 15 లక్షల వరకు 20% పన్ను
రూ.15 లక్షల ఆదాయం దాటితే 30% పన్ను

ఇన్‌కంటాక్స్‌లో పాత, కొత్త రెండు టారిఫ్‌/రెజిమే ఆప్షన్లు ఉంటాయా?
ప్రస్తుతం ఆదాయపుపన్నులో రెండు ఆప్షన్లు ఉన్నాయి. పాత పద్ధతిలో టాక్స్‌ అసెస్‌మెంట్‌ చేసుకోవచ్చు లేదా కొత్త పద్ధతిని ఎంచుకోవచ్చు. ఎవరికి దేని వల్ల మేలు జరిగితే దాన్ని ఇప్పటివరకు ఎంచుకున్నారు. బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించిన కొత్త శ్లాబు విధానం వల్ల అందరికీ డిఫాల్ట్‌గా కొత్త విధానం అమల్లోకి వస్తుంది. అయితే కావాలనుకునే వాళ్లు పాత శ్లాబు సిస్టమ్‌ను కూడా ఎంచుకోవచ్చు.

పాత శ్లాబు సిస్టమ్‌ ఎవరికి మంచిది?
కొత్త పద్ధతిలో రూ.7 లక్షల వరకు టాక్స్‌ మినహాయింపు ఉన్నా.. ఇప్పటికీ కొందరికి పాత పద్ధతి మంచిదంటున్నారు నిపుణులు. సెక్షన్‌ 80సి కింద లక్షన్నర రుపాయలు ఇన్వెస్ట్‌ చేసేవారు, NPS కింద 50 వేల రుపాయలు పెట్టుబడి పెట్టిన వారు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఖర్చుల కింద రూ.25వేలతో బీమా తీసుకున్నవారు, సేవింగ్స్‌ కింద రూ.4.25 లక్షలు చూపించే వారికి ఇప్పటికీ పాత శ్లాబు సిస్టమే బెటరంటున్నారు. దీని వల్ల రూ.6.75 లక్షల ఆదాయం వరకు ఎలాంటి టాక్స్‌ కట్టనవసరం లేదంటున్నారు.

7 లక్షలు అన్న పరిమితిని ఎలా చూడవచ్చు?
కొత్త శ్లాబు పద్ధతిలో 7 లక్షల పరిమితి ఓ ఛాలెంజింగ్‌ విషయమే. ఉదాహారణకు మీ ఆదాయం రూ.7లక్షల వరకు ఉంటే మీరు లాభపడ్డట్టే. అయితే మీ ఆదాయం అనుకోకుండా రూ.7లక్షల పది వేలు అయిందనుకోండి. మీరు పన్నుల కింద రూ.26వేలు, దాంతో పాటు సర్‌ఛార్జీ, సెస్‌ కట్టాల్సి ఉంటుంది.

15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే ఏది ఎంచుకోవాలి?
ఇప్పటి నుంచి పాత శ్లాబు ఎంచుకుంటే ఏడాదికి 15 లక్షల ఆదాయం పొందుతున్న వారు రూ.82,500 పన్నుగా చెల్లించాలి. కొత్త శ్లాబు ఎంచుకుంటే అదే 15లక్షల ఆదాయానికి రూ.1,50,000 పన్నుగా చెల్లించాల్సి వస్తుంది. 

దీన్ని బట్టి మధ్యతరగతి వేతన జీవులకు మాత్రమే కొత్త బడ్జెట్‌లో మేలు జరిగినట్టుగా భావించాలంటున్నారు ఆర్థిక నిపుణులు.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

01-02-2023
Feb 01, 2023, 19:27 IST
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీపీ).. కోవిడ్‌ సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు వచ్చిన కోట్లాది మంది...
01-02-2023
Feb 01, 2023, 18:17 IST
న్యూఢిల్లీ: 2023-24 వార్షిక బడ్జెట్‌లో  కేంద్ర ఆర్థికమంత్రి  నిర్మలా సీతారామన్‌ వ్యవసాయానికి భారీ ప్రోత్సాహాకాలు ప్రకటించారు. అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌గా...
01-02-2023
Feb 01, 2023, 17:09 IST
వచ్చే ఏడాదిలో ఎన్నికలు. కాబట్టి, ఇదే చివరి బడ్జెట్‌. పేదమధ్యధనిక వర్గాలు ఎన్నో అంచనాలు.. 
01-02-2023
Feb 01, 2023, 17:04 IST
సాక్షి,ముంబై: యూనియన్ బడ్జెట్‌లో  వేతన జీవులకు, పన్ను చెల్లింపు దారులకు ఊరట కల్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన​ బీమా...
01-02-2023
Feb 01, 2023, 16:29 IST
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి.  ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా లాభ పడ్డాయి. ఆర్థికమంత్రి నిర్మలా...
01-02-2023
Feb 01, 2023, 16:15 IST
బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి.
01-02-2023
Feb 01, 2023, 15:38 IST
విభజన చట్టం హామీల విషయంలో నిరాశ కలిగించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఎంపీలు మీడియా సమావేశంలో మాట్లాడారు....
01-02-2023
Feb 01, 2023, 15:36 IST
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ 2023-24లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంచింది ప్రభుత్వం. గతేడాది రూ.5.25 లక్షల కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది దాన్ని...
01-02-2023
Feb 01, 2023, 15:32 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటుకు సమర్పించారు. ప్రధానంగా ఇందులో...
01-02-2023
Feb 01, 2023, 14:56 IST
న్యూఢిల్లీ:  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను  ఫిబ్రవరి 1న  ప్రెజెంటేషన్‌ సందర్భంగా ఆమె మరో రికార్డు క్రియేట్‌ చేశారు.  వరుసగా...
01-02-2023
Feb 01, 2023, 13:03 IST
ఎప్పుడెప్పుడా అని దేశమంతా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక...
01-02-2023
Feb 01, 2023, 12:58 IST
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గుడ్‌న్యూస్‌ అందించారు. బ‌డ్జెట్‌లో ఏడు అంశాల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నట్టు వెల్లడించిన...
01-02-2023
Feb 01, 2023, 12:36 IST
న్యూఢిల్లీ: ఆర్థిక  మంత్రి నిర్మలా సీతారామన్‌ వేతన జీవులకు ఊరట కల్పించారు. ఆదాయపన్ను పరిమితిని రూ.5 లక్షల నుంచి  7...
01-02-2023
Feb 01, 2023, 12:26 IST
దేశ బడ్జెట్‌లో మొట్టమొదటిసారిగా ఓ కొత్త ప్యాకేజీని ప్రవేశపెట్టింది.. 
01-02-2023
Feb 01, 2023, 12:12 IST
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24లో  రైల్వేలకు భారీ కేటాయింపులను చేస్తున్నట్టు ప్రకటించారు.  రైల్వేల కోసం...
01-02-2023
Feb 01, 2023, 12:08 IST
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెడుతున్నారు. ఈ బ‌డ్జెట్‌లో సొంతింట కలను సాకారం చేసుకోవాలనుకున్న...
01-02-2023
Feb 01, 2023, 11:52 IST
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెడుతున్నారు. ఈ బ‌డ్జెట్‌లో ఏడు అంశాల‌కు ప్రాధాన్య‌త...
01-02-2023
Feb 01, 2023, 11:23 IST
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‍ కేంద్ర బడ్జెట్‍ 2023-24 ను ప్రవేశపెట్టారు. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల...
01-02-2023
Feb 01, 2023, 11:19 IST
న్యూఢిల్లీ: యూనియన్‌ బడ్జెట్‌ 2023-24 ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న సందర్భంగా  కీలక  విషయాలను  ప్రకటించారు.  ఇది అమృత కాల  బడ్జెట్‌...
01-02-2023
Feb 01, 2023, 10:57 IST
న్యూఢిల్లీ:  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  మరికొద్ది క్షణాల్లో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి అధ్యక్షతన  సమావేశమైన  క్యాబినెట్‌...



 

Read also in:
Back to Top