ఐటీ రిఫండ్స్‌ రూ.43,991 కోట్లు

Income Tax Refund Alert From Cbdt For Taxpayers   - Sakshi

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) రిఫండ్స్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) జూలై 26 వరకూ రూ.43,991 కోట్లని ఆ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో వ్యక్తిగత ఆదాయపు పన్ను రిఫండ్స్‌ రూ.13,341 కోట్లని , కార్పొరేట్‌ పన్ను రిఫండ్స్‌ రూ.30,650 కోట్లని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

 ఏప్రిల్‌ 1 నుంచి జూలై 26 మధ్య 21.03 లక్షల మందికి ఈ రిఫండ్స్‌ జరిగినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌ (సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది. వీరిలో వ్యక్తిగత ఆదాయపు పన్ను విభాగంలో 19,89,912 మంది ఉండగా, కార్పొరేట్‌ కేసులు 1,12,567 ఉన్నాయని తెలిపింది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top