పన్ను చెల్లింపుదారులకు రూ.1.19 లక్షల కోట్లు రీఫండ్‌..!

IT Refund of RS 119093 Crore issued so Far This FY 2021-22 - Sakshi

న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ తీపికబురు అందించింది. పన్ను చెల్లింపుదారులకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లించింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 15 మధ్య కాలంలో 1.02 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు 1.19 లక్షల కోట్ల రూపాయలను పైగా ఆదాయపు పన్ను రీఫండ్ చేసినట్లుచేసినట్లు ఐటీ విభాగం తెలిపింది. ఇందులో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 67.99 లక్షల రీఫండ్స్ ఉన్నాయి. 2021-22 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి ఇప్పటి వరకు మొత్తం రూ.13వేల 141 కోట్ల రీఫండ్‌ జారీ చేసినట్లు పేర్కొంది.

"సీబీడీటీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) 2021 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 15 వరకు 1.02 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులకు రూ.1,19,093 కోట్లకు పైగా రీఫండ్ జారీ చేస్తుంది. 1,00,42,619 కేసుల్లో రూ.38,034 కోట్ల ఆదాయపు పన్ను కేసులలో రీఫండ్లు జారీ చేసింది. 1,80,407 కేసుల్లో రూ.81,059 కోట్ల కార్పొరేట్ పన్ను రీఫండ్లు జారీ చేసినట్లు" అని ఆదాయపు పన్ను విభాగం ట్వీట్ చేసింది. 

(చదవండి: క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top