
అయకార్ భవన్‌లో ‘డయల్’ల్యాబ్ ఏర్పాటుచేసిన సీబీడీటీ
సీజ్ చేసిన పెన్‌డ్రైవ్స్, హార్డ్‌డిస్క్‌ల విశ్లేషణలో కీలకం
ఢిల్లీ, ముంబై తర్వాత హైదరాబాద్‌లోనే ఈ సౌకర్యం
సాక్షి, హైదరాబాద్: కంపెనీల జమాఖర్చులు, లెక్కలు ఒకప్పుడు పుస్తకాల్లో ఉండేవి. ఆదా యపు పన్ను శాఖ (ఐటీ) అధికారులకు అనుమా నం వస్తే వాటిని స్వాధీనం చేసుకుని సరిచూసే వాళ్లు. ప్రస్తుతం అన్నీ కంప్యూటర్లు, ల్యాప్‌టా ప్‌లు, పెన్‌డ్రైవ్స్, హార్డ్‌డిస్క్‌ల్లోకి మారిపోయా యి. పన్ను ఎగవేత కేసుల దర్యాప్తులో కీలకమైన వీటిని పరిరక్షించడం, విశ్లేషించడానికి డిజిటల్ ల్యాబ్స్ అవసరం.
కానీ, కొన్నాళ్ల క్రితం వరకు ఈ ల్యాబ్స్ ఢిల్లీ, ముంబైలో మాత్రమే ఉండేవి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) హైదరాబాద్‌లోనూ ఇటీవల డిజిటల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎనలటిక్స్ ల్యాబ్ (డీఐఏఎల్)ను ఏర్పాటు చేసింది. బషీర్‌బాగ్‌లోని అయకార్ భవన్‌లో ఇది పని చేస్తోంది. సీబీడీటీ అమలులోకి తెచ్చిన నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ పాలసీ–2024 అమలులో భాగంగా ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.
పన్నుల విశ్లేషణలో కీలకం: కంపెనీలు, వ్యక్తులకు చెందిన ఈ–మెయిల్స్, ఆన్‌లైన్‌లో ఉన్న ఆర్థిక లావా దేవీల రికార్డులు, ఇతర డిజిటల్ కార్యకలాపాలను విశ్లేషించి, దర్యాప్తు చేయడానికి ఈ డయల్ ఉపకరి స్తోంది. ఆదాయపు పన్ను ఎగవేత, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్ని ఐటీ అధికా రులు దర్యాప్తు చేస్తుంటారు. ఇందులో భాగంగా సంస్థలు, వ్యక్తుల స్థిరచరాస్తులకు సంబంధించిన క్రయ విక్రయాల వివరాలతో పాటు కార్పొరేట్ వ్యవహా రాల మంత్రిత్వ శాఖ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, జీఎస్టీ, బ్యాంకు ఖాతాలు తదితర లావా దేవీలు, రికార్డులను సేకరించి విశ్లేషించాల్సి ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో ఆయా వ్యక్తుల సోషల్ మీడియా పోస్టులను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా విదేశీ పర్యటనలు, భారీ ఖర్చులతో ఆడంబరంగా జరిగిన వివాహాలు, విలాసవంతమైన ఇళ్లు, జీవ శైలిలకు సంబంధించిన వివరాలను సేకరించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ బేరీజు వేస్తూ ఆయా వ్యక్తులు, సంస్థలు దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌లు, అడ్వాన్స్ ట్యాక్స్ తదితరాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేయాలి. డిజిటల్ ఫార్మాట్‌లో ఉండే ఈ రికార్డులను డయల్‌లో పొందుపరిస్తే చాలు.. పక్కా విశ్లేషణలను అధికారులకు అందిస్తుంది.
దశలవారీగా విశ్లేషించి నివేదికలు ఇవ్వడంతో పాటు ఆయా డేటాను అత్యంత భద్రంగా దాచే సాంకేతికత డయల్‌లో ఉందని అధికారులు చెప్తు న్నారు. దర్యాప్తు అధికారులు సైతం తమ కంప్యూటర్ల ద్వారానే ఈ డేటా మొత్తాన్ని చూసుకునే అవకాశం ఉంది. దాడుల సమయంలో అధికా రులు స్వాధీనం చేసుకున్న డిజిటల్ డేటాను ఈ ల్యాబ్ భద్రపరుస్తుంది.
ఈ డేటాను ట్యాంపర్ చేయడానికి, అనధికారికంగా యాక్సెస్ చేయడా నికి ఆస్కారం ఉండదు. హైదరాబాద్ ల్యాబ్‌కు అనుబంధంగా విజయ వాడ, విశాఖపట్నంలో అక్కడి అవసరాలకు తగ్గట్టు తక్కువ సామర్థ్యంతో ల్యాబ్‌లు ఏర్పాటు చేయడా నికి సీబీడీటీ సన్నాహాలు చేస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు.