Income Tax Returns: గడువులోగా ఫైల్ చేయలేదా?.. ఫైన్‌ మాత్రమే కాదు.. ఇవన్ని కోల్పోతారు!

Income Tax Returns: What Happens If We Miss Itr Filing Before Deadline July 31 - Sakshi

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్‌ గుడువు ఆదివారంతో (జూలై 31) ముగిసింది. ఆఖరి రోజు పన్ను చెల్లింపుదారులు ఉరుకులు పరుగులు మీద ఐటీఆర్‌ దాఖలు చేశారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇటీవల వారాల్లో ఐటీఆర్‌ ఫైల్‌ చేసేటప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ మరో వైపు గడువు తేది పొడిగించే ఆలోచన లేదంటూ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

దీంతో చివరి రోజైన ఆదివారం రాత్రి 11గంటల వరకు మొత్తం 67,97,067 మంది ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయగా.. చివరి గంటలో 4,50,013 ఐటీఆర్‌ దాఖలు చేశారని ఐటీ శాఖ ట్వీట్‌ చేసింది.  దీంతో ఈ సంఖ్య మొత్తంగా ఐదున్నర కోట్లకు పైనే చేరుకుంది. ఒకవేళ మీరు జూలై 31 లోపు ఐటీఆర్‌ ఫైల్ చేయడంలో విఫలమైన పరిస్థితి ఏమిటని అనుకుంటున్నారా? ప్రస్తుతం ఫైల్‌ చేయడం కుదరని వాళ్లు డిసెంబర్ 31, 2022లోపు రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. అయితే  అందుకు కొంత పెనాల్టీ చెల్లించక తప్పదు. దీంతో పాటు కొన్ని ఆర్ధిక ప్రయోజనాలకు కోల్పోతారని నిపుణులు చెపుతున్నారు.

డెడ్‌లైన్‌లోపు ఫైల్‌ చేయకపోతే:
►డెడ్‌లైన్‌ తర్వాత ఐటీ రిటర్న్‌ దాఖలు చేసేవారు.. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు రూ.5000, అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు రూ. 1000 జరిమానాగా చెల్లించాలి.
►పన్ను చెల్లింపుదారుల వైపు నుంచి ఏమైనా బకాయిలు ఉంటే ఐటీఆర్ ఫైలింగ్ చేయటానికి గడువు తేదీ నుంచి దానిపై 1 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
► ఐటీర్‌ ఆలస్యంగా పైల్ చేసిన పన్ను చెల్లింపుదారులు.. వారి మూలధనరాబడి వంటి వాటిని నష్టాలతో భర్తీ చేసుకునే అవకాశం ఉండదు. ఇంటి ఆస్తిని అమ్మినప్పుడు వచ్చిన నష్టాన్ని మాత్రమే సర్దుబాటు చేసుకోగలరు.
► ఐటీ రిటర్న్‌ సకాలంలో దాఖలు చేసి, ధృవీకరించుకున్న తర్వాతే రీఫండ్ అనేది వస్తుంది. కాకపోతే దాఖలు చేయడం అలస్యమయ్యే కొద్దీ రీఫండ్ కూడా అదే తరహాలో ఆలస్యం అవుతుంది.
►2022 డిసెంబర్ 31 తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఐటీశాఖ నుంచి నోటీసులు అందుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కొన్ని ఆర్థికపరమైన ప్రయోజనాలు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

 

చదవండి: LPG Cylinder Price: బిగ్‌ రిలీఫ్‌.. భారీగా తగ్గిన కమర్షియల్‌ సిలిండర్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top