మెరుగ్గా జీఎస్‌టీ వసూళ్లు  | India GST collections 1. 83 lakh crore in February 2026 | Sakshi
Sakshi News home page

మెరుగ్గా జీఎస్‌టీ వసూళ్లు 

Mar 2 2026 6:37 AM | Updated on Mar 2 2026 7:55 AM

India GST collections 1. 83 lakh crore in February 2026

ఫిబ్రవరిలో రూ.1.83 లక్షల కోట్లు 

8.1 శాతం అధిక ఆదాయం

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రూపంలో ఫిబ్రవరిలో రూ.1.83 లక్షల కోట్లు స్థూలంగా వసూలైంది. దేశీ విక్రయాలపై ఆదాయం 5.3 శాతం పెరిగి రూ.1.36 లక్షల కోట్లుగా ఉంటే, దిగుమతులపై జీఎస్‌టీ 17.2 శాతం పెరిగి రూ.47,837 కోట్లుగా నమోదైంది. రిఫండ్‌లు 10.2 శాతం పెరిగి రూ.22,595 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర పన్ను వసూళ్లు రూ.1.61 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఫిబ్రవరితో పోల్చితే 7.9 శాతం పెరిగాయి. 

సెస్సు రూపంలో ఆదాయం రూ.13,481 కోట్ల నుంచి రూ.5,063 కోట్లకు తగ్గింది. గతేడాది సెప్టెంబర్‌ 26 నుంచి జీఎస్‌టీలో కీలక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. 5, 12, 18, 28 శ్లాబులను విలీనం చేసి.. 5, 18, 40 శాతం (పొగాకు, విలాస ఉత్పత్తులు) ఖరారు చేశారు. దీంతో 375 ఉత్పత్తులపై పన్ను రేట్లు దిగొచ్చాయి. అనంతరం నవంబర్‌లో వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లుగా ఉంటే, డిసెంబర్‌లో రూ.1.74 లక్షల కోట్లు, 2026 జనవరిలో రూ.1.93 లక్షల కోట్లకు పెరిగింది. పొగాకు ఉత్పత్తులపై అంతకుముందు కాంపన్సేషన్‌ ఉండగా, దాన్ని తొలగించి అధిక పన్ను రేటు పరిధిలోకి చేర్చారు.

 దీంతో ఈ పన్ను ఆదాయం తగ్గుతూ వస్తోంది. వినియోగం పెరిగినట్టు జీఎస్‌టీ వసూళ్ల గణాంకాలు తెలియజేస్తున్నాయని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ ఎంఎస్‌ మణి పేర్కొన్నారు. తమిళనాడులో మైనస్‌ 6 శాతం, మధ్యప్రదేశ్‌లో మైనస్‌ 8 శాతం, రాజస్థాన్‌లో మైనస్‌ 1% చొప్పున ఆదాయం తగ్గిందని.. పశి్చమబెంగాల్‌లో ఒక శాతం, హరియాణాలో 2 శాతం, యూపీలో 5 శాతం, మహారాష్ట్రలో 6% చొప్పున ఆదాయం వచి్చనట్టు చెప్పారు. ఇది జాతీయ సగటు ఆదాయం 8 శాతం కంటే తక్కువని చెప్పారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement