75 ఏళ్లు దాటినవారికి ఐటీ రిటర్నుల మినహాయింపు

Exemption from filing tax returns for Senior Citizens aged 75 years - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఆరి్థక సంవత్సరం నుంచి 75 ఏళ్లు నిండిన వృద్ధులు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన పనిలేదు. ఇందుకు సంబంధించి ఐటీ రిటర్నుల మినహాయింపు డిక్లరేషన్‌ ఫారమ్‌ ‘12బీబీఏ’ (వెల్లడి పత్రాలు)ను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. 2021–22 ఆరి్థక సంవత్సరానికి (అసెస్‌మెంట్‌ సంవత్సరం 2022–23) సంబంధించి ఐటీ రిటర్నుల మినహాయింపులను పొందే వృద్ధులు ఈ డిక్లరేషన్‌ పత్రాన్ని బ్యాంకులకు సమరి్పంచాలి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021–22 బడ్జెట్‌లో చేసిన ప్రకటనకు అనుగుణంగా తాజా నిర్ణయం వెలువడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top