
గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. అసెస్‌మెంట్ సంవత్సరం (ఏవై) 2025–26కు సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్‌లు) దాఖలు గడువును జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) మంగళవారం ప్రకటించింది. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), ఆడిటింగ్ అవసరం లేని సంస్థలు ఏటా పన్ను రిటర్నుల దాఖ లుకు జూలై 31 తుది గడువుగా ఉంటోంది.
సాంకేతిక సమస్యలు, ఇతరత్రా ప్రతికూల పరిస్థితుల్లో ఈ గడువును ఆదాయపన్ను శాఖ పొడిగిస్తుంటుంది. ఈ ఏడాది ఐటీఆర్‌లో మార్పులు చేయడంతో.. ఇందుకు సంబంధించి ఐటీ శాఖ వ్యవస్థలను సిద్ధం చేసేందుకు, ఐటీఆర్ యుటిలిటీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీబీటీ తెలిపింది.