నటి త్రిషకు ఊరట

Tax case against actor Trisha Krishnan dismissed - Sakshi

చెన్నై: జరిమానా చెల్లించాలన్న ఆదాయ పన్ను(ఐటీ) నోటీసుల నుంచి సినీ నటి త్రిషకు ఊరట లభించింది. 2010–11 కాలంలో వెల్లడించని ఆదాయంపై రూ.1.11 కోట్లు అపరాధ రుసుము చెల్లించాలంటూ ఐటీ శాఖ ఆమెకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆమె మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. చీఫ్‌ జస్టిస్‌ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని బెంచ్‌ ఆమె పిటిషన్‌పై శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా బెంచ్‌... ఆదాయం వివరాలను త్రిష ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టలేదని, ఐటీ చట్టం ప్రకారం ఆమెకు జరిమానా విధించనవసరం లేదని పేర్కొంది. త్రిష జరిమానా చెల్లించాలన్న ఐటీ వినతిని తోసిపుచ్చింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top