వీడియోలు తీసి.. బ్లాక్‌మెయిల్‌ చేసి.. | Honey Trap on Instagram In Karimnagar | Sakshi
Sakshi News home page

వీడియోలు తీసి.. బ్లాక్‌మెయిల్‌ చేసి..

Jan 15 2026 9:16 AM | Updated on Jan 15 2026 9:20 AM

Honey Trap on Instagram In Karimnagar

యువకులకు దంపతుల వలపు వల

ఇన్‌స్టాగ్రాంలో భార్య ఫొటోలతో ఎర 

కరీంనగర్‌రూరల్‌: వ్యాపారంలో నష్టం.. ఆర్థిక ఇబ్బందులు.. ఆపై ఈజీ మనీకోసం అలవాటు పడిన ఆ దంపతులు అడ్డదార్లు తొక్కారు. ఇందుకు సోషల్‌ మీడియాను వేదికగా మార్చుకున్నారు. ఇన్‌స్టాగ్రాంలో తన భార్య ఫొటోలు షేర్‌ చేస్తూ యువకులకు వలపు గాలం వేశాడో భర్త. ఆపై ఇంటికి పిలిచించి.. భార్యతో వారు ఏకాంతంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. బ్లాక్‌మెయిల్‌ చేస్తూ.. అందినకాడికి దండుకున్నారు. ఇలా రూ.లక్షల్లో మోసపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కరీంనగర్‌ రూర ల్‌ పోలీసులు విచారణ చేసి ఆ డర్టీ కపుల్స్‌ను అరెస్టు చేశారు. సీఐ నిరంజన్‌రెడ్డి కథనం ప్రకారం.. 

మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తి కరీంనగర్‌ వచ్చి మార్బుల్‌ వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో అదే జిల్లాకు చెందిన యువతి పరిచయం కావడంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లుగా ఆరెపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఇంటీరియల్‌ డెకరేషన్‌ ప్రారంభించి, బ్యాంకులో లోన్‌ తీసుకున్నాడు. అందులోనూ నష్టం రావడంతో ఈఎంఐలు ఇబ్బందిగా మారాయి. దీంతో ఇన్‌స్టాగ్రాంలో తన భార్య ఫొటో, సెల్‌నంబరు పెట్టి వలపువల వేశాడు. దాదాపు 100 మందికిపైగా యువకులు పలుమార్లు ఫ్లాట్‌కు వచ్చి భార్యతో గడిపి వెళ్లేవారు. అలా వచ్చినవారి ఫొటోలు, వీడియోలు చిత్రీకరించేవారు. ఆపై బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. 

ఏడాది క్రితం కరీంనగర్‌కు చెందిన ఓ వ్యాపారిని ఇలానే బెదిరించి ఫ్లాట్, కారు ఈఎంఐలు కట్టించారు. కొన్ని రోజుల నుంచి సదరు వ్యాపారి తమ వద్దకు రాకపోవడంతో రూ.5 లక్షలు ఇవ్వకుంటే నగ్న ఫొటోలు, వీడియోలు కుటుంబసభ్యులు పంపిస్తామని బెదిరించారు. భయపడి రూ.లక్ష ఇచ్చాడు. ఇలా రూ.14 లక్షలు ఇచ్చానని, వీడియోలు తొలగించాలని వ్యాపారి కోరగా మరో రూ.4 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. దీంతో సదరు వ్యాపారి మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఏసీపీ విజయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు సీఐ నిరంజన్‌రెడ్డి బుధవారం బైపాస్‌రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపర్చారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement