దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. పెరుగుతున్న చమురు ధరలు, యూఎస్ వడ్డీ రేట్ల పెరుగుదల గురించి ఆందోళన కారణంగా నిఫ్టీ 50, సెన్సెక్స్ పడిపోయాయి.
ఉదయం 9:50 గంటల సమయానికి సెన్సెక్స్ 367.60 పాయింట్లు లేదా 0.48 శాతం క్షీణించి 76,896.91 వద్ద, నిఫ్టీ 50 148.85 పాయింట్లు లేదా 0.62 శాతం క్షీణించి 24,026.80 వద్ద ట్రేడవుతున్నాయి.
హిందాల్కో ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్ ప్రైజెస్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.53 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 73 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ సిమెంట్, నిఫ్టీ మీడియా తక్కువ పనితీరు కనబరిచాయి.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.70
బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 89.31 డాలర్లు
యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.73 శాతానికి చేరాయి.
గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.25 శాతం నష్టపోయింది.
నాస్‌డాక్ 0.52 శాతం నష్టపోయింది.
Today Nifty position 28-08-2026(time: 10:00 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


