ఇన్వెస్టర్స్‌.. ఇవిగో న్యూ ఫండ్‌ ఆఫర్స్‌ | New Fund Offers ICICI Pru Momentum-Value Fund Quantum Flexi Cap Fund | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్స్‌.. ఇవిగో న్యూ ఫండ్‌ ఆఫర్స్‌

Aug 24 2026 2:26 PM | Updated on Aug 24 2026 2:31 PM

New Fund Offers ICICI Pru Momentum-Value Fund Quantum Flexi Cap Fund

నిర్దిష్ట యులిప్స్‌ ద్వారా దీర్ఘకాలికంగా పెట్టుబడుల అవకాశాలను అందించేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా బీఎస్‌ఈ 500 మొమెంటం వేల్యూ 50 ఇండెక్స్‌ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఇది ఆకర్షణీయమైన వేల్యూయేషన్స్‌తో పాటు సానుకూల మొమెంటం కూడా ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. మారే మార్కెట్‌ వేల్యుయేషన్స్, ట్రెండ్స్‌ని బట్టి ప్రతి మూడు నెలలకోసారి దీన్ని సమీక్షించి, పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేర్పులు చేస్తారు.

తద్వారా పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పాటిస్తూనే దీర్ఘకాలికంగా ఈక్విటీల వృద్ధి ప్రయోజనాలను కూడా పొందేందుకు ఇన్వెస్టర్లకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ మనీష్‌ కుమార్‌ తెలిపారు. బీఎస్‌ఈ 500లోని 50 వైవిధ్యమైన కంపెనీలను నిర్దిష్ట రూల్స్‌కి లోబడి ఈ ఫండ్‌ ఎంచుకుని ఇన్వెస్ట్‌ చేస్తుంది. దీన్ని ఐసీఐసీఐ ప్రూ స్మార్ట్‌కిడ్‌ అష్యూర్, సిగ్నేచర్‌ అష్యూర్, సిగ్నేచర్‌ ఆన్‌లైన్‌ తదితర యులిప్స్‌ పథకాలతో తీసుకోవచ్చు. 2026 జూన్‌ 30 నాటికి కంపెనీ నిర్వహణలో రూ. 3.34 లక్షల కోట్ల అసెట్స్‌ ఉన్నాయి.

క్వాంటమ్‌ ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌

వివిధ మార్కెట్‌ క్యాప్‌లవ్యాప్తంగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ను క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్‌ 4 వరకు అందుబాటులో ఉంటుంది. బాటమ్‌–అప్‌ సెలెక్షన్‌ పద్ధతిలో ఎంపిక చేసిన లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడేలా ఈ ఫండ్‌ ఉంటుంది. వ్యాపార నాణ్యత, మేనేజ్‌మెంట్‌ సామర్థ్యాలు, నిలకడగా ఆదాయార్జన అవకాశాలు, కార్పొరేట్‌ గవర్నెన్స్‌లాంటి అంశాలను ఇందుకు ప్రాతిపదికగా ఉంటాయి. సముచితమైన ధరకు లభిస్తూ, వృద్ధి చెందే అవకాశాలు ఉన్న స్టాక్స్‌పై ఇది దృష్టి పెడుతుంది. సీఐవో చిరాగ్‌ మెహతా, ఫండ్‌ మేనేజర్‌ కేతన్‌ గుజరాతీ దీన్ని నిర్వహిస్తారు. కనీసం రూ. 500 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement