ప్రీమియం రిటర్న్‌ ఇండియాఫస్ట్‌ లైఫ్‌ గోల్డ్‌ టర్మ్‌ ప్లాన్‌ | IndiaFirst Life Launches Gold Term Plan With Premium Return, Spouse Cover And Health Benefits, Check Details Inside | Sakshi
Sakshi News home page

ప్రీమియం రిటర్న్‌ ఇండియాఫస్ట్‌ లైఫ్‌ గోల్డ్‌ టర్మ్‌ ప్లాన్‌

Aug 31 2026 11:52 AM | Updated on Aug 31 2026 12:54 PM

IndiaFirst Life Gold Term Plan Premium return Spouse Cover Health Benefits

జీవిత బీమా సంస్థ ఇండియాఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సమగ్ర బీమా రక్షణ కల్పించే దిశగా గోల్డ్‌ టర్మ్‌ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రీమియం వాపసు వచ్చే లైఫ్‌ కవరేజీని కూడా ఎంచుకునే ఆప్షన్‌ ఉంటుంది. పాలసీదారు మరణించిన పక్షంలో జీవిత భాగస్వామికి అదనపు లైఫ్‌ కవరేజీ వర్తించేలా సోల్‌మేట్‌ బెనిఫిట్, నిర్దిష్ట వ్యవధిలోపల పాలసీని నిలిపివేస్తే అప్పటివరకు చెల్లించిన 100 శాతం ప్రీమియంలు వెనక్కి వచ్చేలా స్మార్ట్‌ ఎగ్జిట్‌ ఫీచరు ఉంది.

పాలసీదారులకు ఏటా దాదాపు రూ. 75,000 విలువ చేసే హెల్త్‌ చెకప్‌లు, స్పెషలిస్ట్‌ కన్సల్టేషన్‌ తదితర హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సరీ్వసులు లభిస్తాయి. మహిళా కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. వచ్చే 12 నెలల్లో ఈ ప్లాన్‌తో తమ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ వ్యాపారం రెట్టింపు అవుతుందని భావిస్తున్నట్లు సంస్థ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ సుమీత్‌ సాహ్ని తెలిపారు.

మెట్రోలు, ప్రథమ..ద్వితీయ శ్రేణి నగరాల్లోని కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ పాలసీకి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర మార్కెట్లలో డిమాండ్‌ ఉంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement