సెబీ చెంతకు 6 కంపెనీలు | 6 Companies File IPO Papers with Sebi | Sakshi
Sakshi News home page

సెబీ చెంతకు 6 కంపెనీలు

Oct 2 2025 5:25 AM | Updated on Oct 2 2025 5:25 AM

6 Companies File IPO Papers with Sebi

ఐపీవో స్ట్రీట్‌

జాబితాలో విశ్వరాజ్‌ ఎన్విరాన్‌మెంట్‌ 

కామ్‌టెల్‌ నెట్‌వర్క్స్, శంకేష్‌ జ్యువెలర్స్‌ 

ప్రీమియర్‌ ఇండస్ట్రియల్, సీఎస్‌ఎం టెక్‌ 

గౌడియం ఐవీఎఫ్‌ అండ్‌ విమెన్‌ హెల్త్‌ 

కొత్త కేలండర్‌ ఏడాదిలో సెకండరీ మార్కెట్లను ఓవర్‌టేక్‌ చేస్తూ చెలరేగుతున్న ప్రైమరీ మార్కెట్లు ఈ నెల(అక్టోబర్‌)లోనూ మరింత దూకుడు చూపనున్నాయి. శుక్రవారం(3న) వియ్‌వర్క్‌ ఇండియా ఐపీవో ప్రారంభంకానుండగా.. వచ్చే వారం దిగ్గజాలు టాటా క్యాపిటల్, ఎల్‌జీఎల్రక్టానిక్స్‌ ఐపీవోలు ప్రారంభంకానున్నాయి. ఈ బాటలో మరో 6 కంపెనీలు నిధుల సమీకరణ బాట పట్టాయి. వివరాలు చూద్దాం..

న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా 6 కంపెనీలు ఐపీవోకు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. ఈ జాబితాలో విశ్వరాజ్‌ ఎన్విరాన్‌మెంట్, గౌడియం ఐవీఎఫ్‌ అండ్‌ విమెన్‌ హెల్త్, కామ్‌టెల్‌ నెట్‌వర్క్స్, శంకేష్‌ జ్యువెలర్స్, ప్రీమియర్‌ ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్, సీఎస్‌ఎం టెక్నాలజీస్‌ చేరాయి. 

రూ. 2,250 కోట్లపై దృష్టి 
నీటి వినియోగం, వృధా నీటి నిర్వహణ సంబంధ స ర్వీసులందించే విశ్వరాజ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఐపీవో ద్వారా రూ. 2,250 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్‌ సంస్థ ప్రీమియర్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ చేయనుంది. 

ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. మూడు కీలక ప్రాజెక్టులలో పెట్టుబడులకు వెచి్చంచనుంది. కంపెనీ ప్రధానంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగించేందుకు వీలుగా వృధా నీటిని శుద్ధి చేయడం తదితరాలను చేపడుతోంది. 2025 మార్చి31కల్లా రూ. 16,011 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 1,759 కోట్ల ఆదాయం, రూ. 266 కోట్ల నికర లాభం ఆర్జించింది. 

19 కొత్త కేంద్రాల ఏర్పాటు 
ఫెర్టిలిటీ సర్వీసులందించే గౌడియం ఐవీఎఫ్‌ అండ్‌ విమెన్‌ హెల్త్‌ ఐపీవోలో భాగంగా 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 95 లక్షల షేర్లను ప్రమోటర్‌ మనికా ఖన్నా విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 50 కోట్లు దేశవ్యాప్తంగా 19 ఐవీఎఫ్‌ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించనుంది. మరో రూ. 20 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. రీప్రొడక్టివ్‌ టెక్నాలజీస్‌లో కంపెనీ సేవలు విస్తరించింది. జనవరిలో కంపెనీ ప్రమోటర్లు ఐపీవో ద్వారా 25.31 లక్షల షేర్లు విక్రయించేందుకు ప్రతిపాదించారు. తద్వారా తాజాగా పరిమాణాన్ని పెంచారు. ఈక్విటీ జారీని 1.83 కోట్ల షేర్ల నుంచి తగ్గించారు. కంపెనీ గతేడాది(2024–25) రూ. 71 కోట్ల ఆదాయం, రూ. 19 కోట్ల నికర లాభం ఆర్జించింది. 

ఇంజినీరింగ్‌ సంస్థ 
ఐపీవోలో భాగంగా స్పెషలైజ్‌డ్‌ ఇంజినీరింగ్, టెక్నాలజీ కంపెనీ కామ్‌టెల్‌ నెట్‌వర్క్స్‌ రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 750 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ఆయిల్‌ అండ్‌ గ్యాస్, పవర్‌ తదితర రంగాలకు  కీలకమైన ఇంటెగ్రేటెడ్‌ టెలికమ్యూనికేషన్, సెక్యూరిటీ, సేఫ్టీ సిస్టమ్స్‌ డిజైనింగ్, బిల్డింగ్, ఇంప్లిమెంటింగ్‌ చేపడుతోంది.  

వైర్‌ తయారీ కేంద్రం 
ప్రీమియర్‌ ఇండ్రస్టియల్‌ కార్పొరేషన్‌ ఐపీవోలో భాగంగా 2.25 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 54 లక్షల షేర్లను ప్రమోటర్‌ విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మహారాష్ట్రలోని హోనడ్‌(ఖాలాపూర్, రాయ్‌గడ్‌) వద్ద వైర్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుతోపాటు.. వాడ(పాల్గర్‌) తయారీ యూనిట్‌ విస్తరణకు వెచి్చంచనుంది. కంపెనీ వెల్డింగ్‌ కన్జూమబుల్స్‌ పరిశ్రమలో వినియోగించే పౌడర్లు, వైర్ల తయారీలో ఉంది. 

రుణ చెల్లింపులకు 
బంగారు ఆభరణ వర్తక కంపెనీ శంకేష్‌ జ్యువెలర్స్‌ ఐపీవోలో భాగంగా 3 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో కోటి షేర్లను ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 158 కోట్లు రుణ చెల్లింపులకు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు రూ. 38 కోట్లు చొప్పున కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా క్లయింట్ల అవసరాలకు తగిన విధంగా బంగారు ఆభరణాల తయారీని చేపడుతోంది.  

ప్రభుత్వ సేవలు.. 
డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్, ప్రభుత్వ స ర్వీసులు(గోవ్‌టెక్‌), ఐటీ కన్సల్టింగ్‌ సర్వీసులందించే సీఎస్‌ఎం టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా 1.29 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా భువనేశ్వర్‌ కంపెనీ రూ. 150 కోట్లు సమీకరించనుంది. నిధులను వృద్ధి, టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పటిష్టత, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. 1998లో సైబర్‌టెక్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ మల్టిమీడియాగా ప్రారంభమైన కంపెనీ 2014లో సీఎస్‌ఎం టెక్నాలజీస్‌గా అవతరించింది. ప్రధానంగా ప్రభుత్వాలు, పీఎస్‌యూలకు స ర్వీసులు సమకూర్చే కంపెనీ పలు దేశాలలో అనుబంధ సంస్థలను నిర్వహిస్తోంది. గతేడాది(2024–25) రూ. 199 కోట్ల ఆదాయం, రూ. 14 కోట్ల నికర లాభం ఆర్జించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement