breaking news
WeWork
-
వుయ్‌వర్క్ దివాలా!
న్యూయార్క్: ఆఫీస్ స్పేస్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అంతర్జాతీయ దిగ్గజం వుయ్‌వర్క్ దివాలా ప్రకటించింది. వ్యాపారాన్ని యథాప్రకారం కొనసాగిస్తూ, కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకునే దిశగా అమెరికాలో చాప్టర్ 11 దివాలా పిటిషన్ దాఖలు చేసింది. వ్యాపార పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. కమర్షియల్ ఆఫీస్ లీజుల పోర్ట్‌ఫోలియోను మరింత క్రమబద్దికరించుకోనున్నట్లు పేర్కొంది. రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే దిశగా పునర్వ్యవస్థీకరణ విషయంలో తోడ్పాటు అందించేలా సంబంధిత వాటాదారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. అమెరికా, కెనడా వెలుపలి దేశాల్లోని తమ కార్యకలాపాలపై ఈ పరిణామ ప్రభావం ఉండబోదని వుయ్‌వర్క్ వివరించింది. సమస్యలను పరిష్కరించుకుని, వ్యాపారాన్ని మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగడంపై దృష్టి పెడుతున్నట్లు సంస్థ సీఈవో డేవిడ్ టోలీ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ ఈ ఏడాది ప్రథమార్ధంలో 696 మిలియన్ డాలర్ల నష్టం నమోదు చేసింది. జూన్ 30 నాటికి వుయ్‌వర్క్‌కు 39 దేశాల్లో 777 చోట్ల కార్యకలాపాలు ఉన్నాయి. అప్పట్లో 50 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ .. గతంలో దాదాపు 50 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో వెలుగొందిన వుయ్‌వర్క్ దివాలా తీయడానికి అనేక కారణాలు ఉన్నాయి. అతి దూకుడుగా విస్తరించడం, వ్యవస్థాపకుడు ఆడమ్ న్యూమాన్ పోకడలు మొదలైనవి ఇందుకు దారితీశాయి. వాస్తవానికి కొన్నాళ్ల క్రితం నుంచే దివాలా సంకేతాలు కనిపించడం మొదలైంది. 2019లో తొలి పబ్లిక్ ఇష్యూ ప్రయత్నం ఘోరంగా విఫలం కాగా ఆ తర్వాత 2021లో ఐపీవోకి వచ్చినా వేల్యుయేషన్ అనేక రెట్లు తగ్గి 9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతకన్నా ముందే కంపెనీ, వ్యవస్థాపకుడి పనితీరుపై ఇన్వెస్టర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో.. న్యూమాన్ ఉద్వాసనకు గురయ్యారు. సంస్థలో మెజారిటీ వాటాలు తీసుకున్న జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్.. కంపెనీని నిలబెట్టేందుకు ప్రయత్నించింది. నిర్వహ ణ వ్యయాలను తగ్గించుకోవడం, ఆదాయాన్ని పెంచుకోవడం వంటి ప్రయత్నాలు జరిగినా పెద్దగా ఫలితం లేకపోయింది. వ్యాపారాన్ని కొనసాగించే సామర్థ్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటూ వుయ్‌వర్క్ ఆగస్టులోనే వెల్లడించింది. ఆ తర్వాత లీజులన్నింటినీ పునఃసమీక్షించుకునే యోచనలో ఉన్నట్లు సెప్టెంబర్‌లో ప్రకటించింది. నష్టాల్లో ఉన్న లొకేషన్ల నుంచి వైదొలగనున్నట్లు తెలిపింది. భారత్‌లో ప్రభావం ఉండదు.. వుయ్‌వర్క్ గ్లోబల్ దివాలా ప్రభావం భారత విభాగంపై ఉండదని వుయ్‌వర్క్ ఇండియా సీఈవో కరణ్ విర్వాణి స్పష్టం చేశారు. దివాలా ప్రక్రియలో భారత వ్యాపారం భాగంగా లేదని తెలిపారు. వుయ్‌వర్క్ ఇండియాలో రియల్ ఎస్టేట్ సంస్థ ఎంబసీ గ్రూప్‌నకు 73 శాతం, వుయ్‌వర్క్ గ్లోబల్‌కు 27 శాతం వాటాలు ఉన్నాయి. భారత్‌లో ఏడు నగరాల్లో వుయ్‌వర్క్ ఇండియాకు 50 కేంద్రాలు ఉన్నాయి. 2021 జూన్‌లో వుయ్‌వర్క్ ఇండియాలో వుయ్‌వర్క్ గ్లోబల్ 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. -
‘Wework’ : ఓ మతిలేని నిర్ణయంతో పాతాళానికి!
15,724 ఇవేవో అంకెలనుకుంటే పొరబడినట్లే. అమెరికాలో దివాళా తీసిన సంస్థల సంఖ్య. ఆ జాబితాలో తాజాగా వివర్క్ చేరింది. పైన పేర్కొన్న సంస్థలు ప్రాజెక్ట్‌ల కొరత, ఆర్ధిక మాంద్యం కారణంగా అప్పులు పాలైతే.. వివర్క్ మాత్రం అలా కాదు. ఆ కంపెనీ కో-ఫౌండర్, మాజీ సీఈఓ ఆడమ్ న్యూమాన్ 4 ఏళ్ల క్రితం తీసుకున్న మతిలేని నిర్ణయం వల్ల లక్షల కోట్ల కంపెనీ కాస్త అప్పుల కుప్పగా మారింది. ఇంతకి వివర్క్లో ఏం జరిగింది? ఆ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం పదండి. అమెరికాకు చెందిన ప్రముఖ కోవర్కింగ్ స్టార్టప్ 'వివర్క్' అమెరికాలో దివాలా పిటిషన్ దాఖలు చేసింది న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివర్క్ ఒకానొక దశలో రూ. 3. 91 లక్షల కోట్లు (47 బిలియన్ల) విలువైన స్టార్టప్‌గా అవతరించింది. కానీ ఇప్పుడు ఆ సంస్థ విలువ భారీగా పడిపోవడంతో చేసేది లేక ఉన్న అప్పుల్ని తీర్చలేమంటూ న్యూజెర్సీ న్యాయ స్థానంలో చాప్టర్ 11 దివాళా పిటిషన్ దాఖలు చేసింది. వివర్క్ సీఈఓ డేవిడ్ టోల్లే తరుపున ప్రముఖ లా సంస్థ కాడ్వాలాడర్, వికర్షామ్ అండ్ టాఫ్ట్ దివాలా ఫైలింగ్‌ను నమోదు చేసింది. వివర్క్ అమెరికా, కెనడాలలో 10 బిలియన్ల నుంచి 50 బిలియన్ల అప్పులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేకాదు తాము గతంలో చేపట్టిన నాన్ ఆపరేషనల్ లీజింగ్ ఒప్పొందాలను తగ్గించుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించింది. సిలికాన్ వ్యాలీలో సంచలనం అయితే లక్షల కోట్ల కంపెనీ ఎదిగి ఓకానొక దశలో సిలికాన్ వ్యాలీలో సంచలనానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ స్టార్టప్ అప్పుల కుప్పగా మారడానికి కారణం వివర్క్ మాజీ కో-ఫౌండర్,సీఈఓ ఆడమ్ న్యూమాన్ తీసుకున్న మతిలేని నిర్ణయమే కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే? అది ఆగస్ట్ 14 2019, న్యూయార్క్ నగరం. సమయం ఉదయం 7:12 గంటలు. అప్పుడే వివర్క్ ఐపీవోకి వెళుతుందంటూ ఆ సంస్థ సీఈవో ఆడమ్ న్యూమన్ ఐపీవో కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ వెబ్సైట్ట్లో దాఖలు చేశారు. ఓవైపు విజృంభిస్తున్న మాయదారి కరోనా మహమ్మారి. పైగా లాక్డౌన్. ఆపై తినడానికి తిండి లేక సామాన్యుల అవస్థలు. ఆక్సీజన్ అందక ప్రాణాలు పోతున్నాయని గగ్గొలు పెట్టిన ప్రభుత్వం స్పందించలేని దుస్థితి. ఇలాంటి క్లిస్ట పరిస్థితుల్లో సామాన్యులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారా? ప్రపంచాన్ని మారుస్తా కానీ ఆడమ్ న్యూమాన్ మాత్రం రూ. 3. 91 లక్షల కోట్లు కంపెనీ ఐపీవోకి వెళుతుంది. మా లక్ష్యం డబ్బు సంపాదించడం లేదా కార్యాలయ స్థలాన్ని అద్దెకు ఇవ్వడం మాత్రమే కాదు ‘ప్రపంచాన్ని మార్చడం’ అని పేర్కొన్నాడు. ఈ ప్రకటనే.. సముద్రంలో గులకరాయి ఎంతటి అలజడని సృష్టిస్తుందో..ఆడమ్ నిర్ణయంతో అమెరికన్ స్టాక్ మార్కెట్లో తీవ్ర అలజడిని రేపింది. దీంతో దిగ్గజ కంపెనీలు ఆడమ్ నిర్ణయంపై ముక్కున వేలేసుకుంటే.. ఆర్ధిక వేత్తలు వివర్క్ సీఈఓది మతిలేని చర్య అంటూ మండి పడ్డారు. వెనక్కి తగ్గలేదు అయినా, ఆడమ్ వెనక్కి తగ్గలేదు. ఐపీవోకి వెళ్లే ముందు ఆయా కంపెనీలు వాటి స్థితిగతుల గురించి పబ్లిక్‌గా అనౌన్స్ చేస్తాయి. ఆడమ్ సైతం అదే పనిచేశారు. అందులో కంపెనీ 2019 జనవరి నుంచి జూన్ వరకు సుమారు 900 మిలియన్లు నష్టపోగా ఆదాయం 1.54 బిలియన్లని పేర్కొంది. లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉండడంతో షేర్లు భారీగా పతనమయ్యాయి. చేసేది లేక సెప్టెంబరు 17, 2019న, వివర్క్ మాతృ సంస్థ దివి కంపెనీ ఐపీవోని ఏడాది చివరి నాటికి వాయివా వేయాలని నిర్ణయించింది. ఫలితంగా వివర్క్ బుడగ టప్ మని పేలింది. కంపెనీ సైతం విలువ అమాంతం కరిగింది. ఆడమ్ మాత్రం భారీ లాభాల్ని అర్జించారు. ఆయన ఆస్తి రెండింతలైంది. ముందుగా చెప్పినట్లుగానే సెప్టెంబరు 24, 2019 ఐపీవోని నిలిపివేసింది. కో-ఫౌండర్ సీఈఓ ఆడమ్ న్యూమాన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థ నుంచి వెళ్లిపోయారు. అలా.. నాటి నుంచి వివర్క్ పడ్తూ లేస్తూ కొనసాగింది. సాఫ్ట్‌బ్యాంక్ లాంటి దిగ్గజ సంస్థలు ఎంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినా లాభం లేకపోయింది. తాజాగా అప్పులు పెరిగిపోయి వాటిని తీర్చలేక దివాలా తీస్తూ కోర్టును ఆశ్రయించడం స్టార్టప్ పరిశ్రమలో మాయని మచ్చగా నిలిచిపోయింది. మొత్తం 15,724 కంపెనీల దివాలా అమెరికా సంస్థల దివాలా ఫైలింగ్ డేటాను అందించే ఎపిక్ దివాలా (Epiq Bankruptcy) డేటా ప్రకారం.. ఈ ఆగస్టులో మొత్తం 2,328 మొత్తం సంస్థలు దివాలా ఫైలింగ్ చేశాయి. గత ఏడాది జులై 14 శాతం నుంచి ఆగస్ట్ నెలలో 17 శాతం పెరిగినట్లు డేటా హైలెట్ చేసింది. ఇక ఈ ఏడాది జూన్ 30, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 15,724 దివాలాలు దాఖలైనట్లు అమెరికా దివాలా కోర్టు నివేదించింది. ఇది గత సంవత్సరం కంటే 23శాతం పెరిగినట్లు చెప్పింది.