breaking news
Tata Capital
-
టాటా క్యాపిటల్ @ రూ.310–326
ముంబై: టాటా క్యాపిటల్ మెగా పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రంగం సిద్ధమైంది. ఈ ఇష్యూకు రూ.310–326 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. ఐపీఓ ఈ నెల 6న మొదలై 8న ముగుస్తుంది. జూలైలో చేపట్టిన రైట్స్ ఇష్యూతో పోలిస్తే ఐపీఓ షేరు ధర 5 శాతం తక్కువేనని, విస్తృత స్థాయిలో భాగస్వామ్యంతో పాటు మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడమే దీని లక్ష్యమని కంపెనీ ఎండీ, సీఈఓ రాజీవ్ సబర్వాల్ పేర్కొన్నారు. రైట్స్ ఇష్యూ ద్వారా టాటా క్యాపిటల్ షేరుకు రూ.343 చొప్పున రూ.1,750 కోట్లు సమీకరించింది. అతి పెద్ద ఇష్యూ... ఐపీఓ ద్వారా టాటా క్యాపిటల్ రూ.15,512 కోట్లు సమీకరించే అవకాశం ఉంది. మార్కెట్ విలువ రూ.1.38 లక్షల కోట్లుగా నమోదు కావచ్చని అంచనా. దీంతో ఈ ఏడాది మన స్టాక్ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఇది నిలుస్తుంది. ఇష్యూలో భాగంగా టాటా సన్స్ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 23 కోట్ల షేర్లను, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) 3.58 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. కంపెనీ 21 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేస్తోంది. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్‌కు 88.6%, ఐఎఫ్‌సీకి 1.8 శాతం వాటా ఉంది. దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)గా నిలుస్తున్న టాటా క్యాపిటల్ లోన్ బుక్ రూ.2.3 లక్షల కోట్ల పైమాటే. ఇందులో 88 శాతం రుణాలు రిటైల్ ఖాతాదారులు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) ఇచి్చనవే కావడం గమనార్హం. 2023లో నవంబర్‌లో టాటా టెక్నాలజీస్ అరంగేట్రం తర్వాత టాటా గ్రూప్ నుంచి వస్తున్న మరో భారీ ఐపీఓ కానుంది. -
సెబీ చెంతకు 6 కంపెనీలు
కొత్త కేలండర్ ఏడాదిలో సెకండరీ మార్కెట్లను ఓవర్టేక్ చేస్తూ చెలరేగుతున్న ప్రైమరీ మార్కెట్లు ఈ నెల(అక్టోబర్)లోనూ మరింత దూకుడు చూపనున్నాయి. శుక్రవారం(3న) వియ్‌వర్క్ ఇండియా ఐపీవో ప్రారంభంకానుండగా.. వచ్చే వారం దిగ్గజాలు టాటా క్యాపిటల్, ఎల్జీఎల్రక్టానిక్స్ ఐపీవోలు ప్రారంభంకానున్నాయి. ఈ బాటలో మరో 6 కంపెనీలు నిధుల సమీకరణ బాట పట్టాయి. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా 6 కంపెనీలు ఐపీవోకు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. ఈ జాబితాలో విశ్వరాజ్ ఎన్విరాన్మెంట్, గౌడియం ఐవీఎఫ్ అండ్ విమెన్ హెల్త్, కామ్టెల్ నెట్వర్క్స్, శంకేష్ జ్యువెలర్స్, ప్రీమియర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, సీఎస్ఎం టెక్నాలజీస్ చేరాయి. రూ. 2,250 కోట్లపై దృష్టి నీటి వినియోగం, వృధా నీటి నిర్వహణ సంబంధ స ర్వీసులందించే విశ్వరాజ్ ఎన్విరాన్మెంట్ ఐపీవో ద్వారా రూ. 2,250 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్ సంస్థ ప్రీమియర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. మూడు కీలక ప్రాజెక్టులలో పెట్టుబడులకు వెచి్చంచనుంది. కంపెనీ ప్రధానంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగించేందుకు వీలుగా వృధా నీటిని శుద్ధి చేయడం తదితరాలను చేపడుతోంది. 2025 మార్చి31కల్లా రూ. 16,011 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 1,759 కోట్ల ఆదాయం, రూ. 266 కోట్ల నికర లాభం ఆర్జించింది. 19 కొత్త కేంద్రాల ఏర్పాటు ఫెర్టిలిటీ సర్వీసులందించే గౌడియం ఐవీఎఫ్ అండ్ విమెన్ హెల్త్ ఐపీవోలో భాగంగా 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 95 లక్షల షేర్లను ప్రమోటర్ మనికా ఖన్నా విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 50 కోట్లు దేశవ్యాప్తంగా 19 ఐవీఎఫ్ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించనుంది. మరో రూ. 20 కోట్లు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. రీప్రొడక్టివ్ టెక్నాలజీస్‌లో కంపెనీ సేవలు విస్తరించింది. జనవరిలో కంపెనీ ప్రమోటర్లు ఐపీవో ద్వారా 25.31 లక్షల షేర్లు విక్రయించేందుకు ప్రతిపాదించారు. తద్వారా తాజాగా పరిమాణాన్ని పెంచారు. ఈక్విటీ జారీని 1.83 కోట్ల షేర్ల నుంచి తగ్గించారు. కంపెనీ గతేడాది(2024–25) రూ. 71 కోట్ల ఆదాయం, రూ. 19 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇంజినీరింగ్ సంస్థ ఐపీవోలో భాగంగా స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ కంపెనీ కామ్టెల్ నెట్వర్క్స్ రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 750 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ప్రధానంగా రుణ చెల్లింపులకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ తదితర రంగాలకు కీలకమైన ఇంటెగ్రేటెడ్ టెలికమ్యూనికేషన్, సెక్యూరిటీ, సేఫ్టీ సిస్టమ్స్ డిజైనింగ్, బిల్డింగ్, ఇంప్లిమెంటింగ్ చేపడుతోంది. వైర్ తయారీ కేంద్రం ప్రీమియర్ ఇండ్రస్టియల్ కార్పొరేషన్ ఐపీవోలో భాగంగా 2.25 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 54 లక్షల షేర్లను ప్రమోటర్ విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మహారాష్ట్రలోని హోనడ్(ఖాలాపూర్, రాయ్‌గడ్) వద్ద వైర్ తయారీ యూనిట్ ఏర్పాటుతోపాటు.. వాడ(పాల్గర్) తయారీ యూనిట్ విస్తరణకు వెచి్చంచనుంది. కంపెనీ వెల్డింగ్ కన్జూమబుల్స్ పరిశ్రమలో వినియోగించే పౌడర్లు, వైర్ల తయారీలో ఉంది. రుణ చెల్లింపులకు బంగారు ఆభరణ వర్తక కంపెనీ శంకేష్ జ్యువెలర్స్ ఐపీవోలో భాగంగా 3 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో కోటి షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 158 కోట్లు రుణ చెల్లింపులకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు రూ. 38 కోట్లు చొప్పున కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా క్లయింట్ల అవసరాలకు తగిన విధంగా బంగారు ఆభరణాల తయారీని చేపడుతోంది. ప్రభుత్వ సేవలు.. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, ప్రభుత్వ స ర్వీసులు(గోవ్‌టెక్), ఐటీ కన్సల్టింగ్ సర్వీసులందించే సీఎస్ఎం టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 1.29 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా భువనేశ్వర్ కంపెనీ రూ. 150 కోట్లు సమీకరించనుంది. నిధులను వృద్ధి, టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టత, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 1998లో సైబర్‌టెక్ సాఫ్ట్వేర్ అండ్ మల్టిమీడియాగా ప్రారంభమైన కంపెనీ 2014లో సీఎస్ఎం టెక్నాలజీస్‌గా అవతరించింది. ప్రధానంగా ప్రభుత్వాలు, పీఎస్‌యూలకు స ర్వీసులు సమకూర్చే కంపెనీ పలు దేశాలలో అనుబంధ సంస్థలను నిర్వహిస్తోంది. గతేడాది(2024–25) రూ. 199 కోట్ల ఆదాయం, రూ. 14 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
నిధుల వేటలో 4 కంపెనీలు
సెప్టెంబర్‌లో సందడే సందడిగా సాగిన ప్రైమరీ మార్కెట్లు ఈ నెల(అక్టోబర్)లోనూ మరింత దూకుడు చూపనున్నాయి. దిగ్గజాలు టాటా క్యాపిటల్, వియ్‌వర్క్ ఇండియా, ఎల్జీఎల్రక్టానిక్స్ ఐపీవోలు ప్రారంభంకానుండగా.. మరో 4 కంపెనీలు నిధుల సమీకరణ బాట పట్టాయి. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి 2 కంపెనీలు తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. జాబితాలో హైదరాబాద్ కంపెనీలు ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్, విరూపాక్ష ఆర్గానిక్స్ చేరాయి. మరోపక్క సాస్ సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా లిస్టింగ్‌కు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో గోప్యతా మార్గంలో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌కు అప్డేటెడ్గా ఏక్వస్ మరోసారి సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. షేర్ల జారీ, ఆఫర్.. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఇన్ఫ్రా కన్సల్టెన్సీ సేవల సంస్థ ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఐపీవోలో భాగంగా రూ. 202.5 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 67.5 లక్షల షేర్లను విక్రయించనుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 76 కోట్లను రుణాల చెల్లింపునకు, దేశీ అనుబంధ సంస్థ ఎస్ఆర్ఏ ఓఎస్ఎస్లో రూ. 21.9 కోట్లు, విదేశీ అనుబంధ సంస్థలైన ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్‌లో రూ. 34.8 కోట్లు, బ్రిటన్ సంస్థ ఆర్వీ అసోసియేట్స్‌లో రూ. 20.8 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్, డెడికేటెడ్ ఫ్రైట్ రైల్ కారిడార్ మొదలైన ప్రాజెక్టులకు ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ సేవలు అందించింది. ఫార్మా రంగ కంపెనీ ఫార్మాస్యూటికల్ రంగ హైదరాబాద్ కంపెనీ విరూపాక్ష ఆర్గానిక్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 740 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీకరించనున్న నిధులలో రూ. 360 కోట్లు సామర్థ్య విస్తరణపై వెచి్చంచనుంది. మరో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. ఆర్అండ్డీ ఆధారిత ఫార్మా కంపెనీ విరూపాక్ష ప్రధానంగా ఏఐపీలు, ఇంటరీ్మడియేట్స్ను తయారు చేస్తోంది. 2025 మార్చి31కల్లా 54 ప్రొడక్టుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 811 కోట్ల ఆదాయం, రూ. 78 కోట్ల నికర లాభం ఆర్జించింది. హైదరాబాద్‌లో నాలుగు, కర్ణాటకలోని హమ్నాబాద్‌లో రెండు చొప్పున తయారీ యూనిట్లను కలిగి ఉంది. లారస్, న్యూలాండ్, దివీస్ ల్యాబ్స్, ఆర్తి డ్రగ్స్ తదితరాలను ప్రత్యర్ధి సంస్థలుగా భావించవచ్చు.సాస్ సేవలతో.. సాస్ సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా ఐపీవోకు సెబీ అనుమతించింది. జూన్‌లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఇష్యూలో భాగంగా రూ. 430 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.83 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 120 కోట్లు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయాలకు, రూ. 152 కోట్లు ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్ డెవలప్మెంట్కు వెచ్చించనుంది. మిగిలిన నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లకు వినియోగించనుంది. కంపెనీ గతంలో 2021 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసినప్పటికీ అనుమతి లభించకపోవడం గమనార్హం! కంపెనీ ఏఐ ఆధారిత క్లౌడ్‌లో భాగమైన సాఫ్ట్వేర్ ప్రొడక్టులు, సొల్యూషన్లు అందిస్తోంది. గతేడాది(2024–25) రూ. 598 కోట్ల ఆదాయం, రూ. 13 కోట్ల నికర లాభం ఆర్జించింది.లిస్టింగ్‌కు ఏక్వస్ రెడీ కన్జూమర్ డ్యురబుల్ గూడ్స్, ఏరోస్పేస్ పరికరాల కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఏక్వస్ సెబీకి తాజాగా అప్డేటెడ్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీంతో ఐపీవో చేపట్టేందుకు వీలు చిక్కనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 720 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.17 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థలు ఏరోస్ట్రక్చర్స్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా, ఏక్వస్ కన్జూమర్ ప్రొడక్ట్స్ రుణ చెల్లింపులకు, మెషీనరీ, ఎక్విప్మెంట్ కొనుగోలుకి వెచ్చించనుంది. అంతేకాకుండా ఇతర సంస్థల కొనుగోళ్లకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం నిధులను వినియోగించనుంది. కంపెనీ గోప్యతా మార్గంలో సెబీకి జూన్‌లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీంతో ఐపీవోకు వీలుగా మరోసారి అప్డేటెడ్ పత్రాలు అందించింది. కంపెనీలో అమికస్, అమన్సా, స్టెడ్‌వ్యూ క్యాపిటల్‌తోపాటు.. కాటమారన్, స్పర్ట గ్రూప్‌లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ క్లయింట్లలో బోయింగ్, బోయింగ్, బంబార్డియర్, జీకేఎన్ ఏరోస్పేస్, హనీవెల్, ఈటన్ తదితర దిగ్గజాలున్నాయి. -
టాటా క్యాపిటల్ మెగా ఆఫర్!
న్యూఢిల్లీ: అప్పర్‌లేయర్ ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూకి రూ. 310–326 ధరల శ్రేణి ప్రకటించింది. అక్టోబర్ 6న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా మొత్తం 47.58 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 15,512 కోట్లు సమకూర్చుకోనుంది. వెరసి 2025లో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. ఐపీవోలో భాగంగా టాటా గ్రూప్ దిగ్గజం 21 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది.అంతేకాకుండా మరో 23 కోట్ల షేర్లను ప్రమోటర్ టాటా సన్స్ ఆఫర్ చేయనుంది. వీటికి జతగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) సైతం 3.58 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఐపీవో ధర ప్రకారం లిస్టింగ్‌లో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.38 లక్షల కోట్లుగా నమోదయ్యే వీలుంది. అక్టోబర్ 8న ముగియనున్న ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు 3న షేర్లను ఆఫర్ చేయనుంది. ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్‌సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది.ఈక్విటీ జారీ నిధులను రుణాల విడుదలతోపాటు భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. దేశీ ఫైనాన్షియల్ రంగంలోనే టాటా క్యాపిటల్ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నమోదుకానుంది. 2023 నవంబర్‌లో టాటా గ్రూప్ నుంచి టాటా టెక్నాలజీస్ లిస్టయ్యాక, రెండేళ్ల తదుపరి తిరిగి మరో దిగ్గజం ఇదే బాట పట్టడం గమనార్హం! ఫైనాన్షియల్ సరీ్వసులతో టాటా గ్రూప్‌లోని ఫైనాన్షియల్ సరీ్వసుల విభాగం టాటా క్యాపిటల్ తొలుత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి గోప్యతా మార్గంలో ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. జూలైలో సెబీ అనుమతి పొందింది. ఆర్బీఐ నుంచి అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందిన సంస్థ అప్పటినుంచి మూడేళ్లలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కావలసి ఉంది. 2022 సెపె్టంబర్లో టాటా క్యాపిటల్‌కు ఈ గుర్తింపు లభించింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీవో ద్వారా ఈ ఏడాది జూన్‌లో రూ. 12,500 కోట్లు సమీకరించడం తెలిసిందే. బజాజ్ ఫైనాన్స్ 2024 సెప్టెంబర్‌లోనే లిస్టయ్యింది. 2007లో కార్యకలాపాలు ప్రారంభించిన టాటా క్యాపిటల్ ఆదాయం గతేడాది (2024 –25) రూ. 18,175 కోట్ల నుంచి రూ. 28,313 కోట్లకు జంప్‌చేసింది. నికర లాభం రూ. 3,327 కోట్ల నుంచి రూ. 3,655 కోట్లకు ఎగసింది.మార్కెట్‌ను మించుతూ టాటా క్యాపిటల్ మార్కెట్ వృద్ధి (11%)ని మించుతూ 17–18% పురో గతి సాధిస్తోంది. నూతన ప్రొడక్టులను ఆవిష్కరిస్తూ మార్కెట్ వృద్ధికంటే వేగంగా ఎదుగుతోంది. డిజిటల్ సాంకేతికతలపై గత 4–5 ఏళ్లలో రూ. 2,000 కోట్లు వెచ్చించాం.– రాజీవ్ సబర్వాల్, టాటా క్యాపిటల్ ఎండీ, సీఈవోవియ్వర్క్ @ రూ. 615648 ⇒అక్టోబర్ 3–7 మధ్య ఐపీవో ⇒రూ. 3,000 కోట్ల సమీకరణ న్యూఢిల్లీ: కోవర్కింగ్ కార్యాలయ నిర్వాహక కంపెనీ వియ్‌వర్క్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి రూ. 615–648 ధరల శ్రేణి నిర్ణయించింది. అక్టోబర్ 3న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా మొత్తం 4.63 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఎంబసీ బిల్డ్‌కాన్ ఎల్‌ఎల్‌పీతోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్ సంస్థ 1 ఏరియల్ వే టెనెంట్(వియ్‌వర్క్ గ్లోబల్‌లో భాగం) షేర్లను ఆఫర్ చేయనున్నాయి. తద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఐపీవో ధర ప్రకారం కంపెనీ లిస్టింగ్‌లో రూ. 8,685 కోట్ల మార్కెట్ విలువను సాధించే వీలుంది. ఇష్యూ అక్టోబర్ 7న ముగియనుంది. -
టాటా క్యాపిటల్ రోడ్‌షోలు షురూ
ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలను వేగవంతం చేసింది. అంతర్జాతీయంగా ప్రధాన ఫైనాన్షియల్ కేంద్రాలలో ఇన్వెస్టర్ రోడ్‌షోలకు తెరతీసింది. తద్వారా ఈ నెల 22న ప్రారంభంకానున్న ఐపీవోకు దారిని ఏర్పాటు చేసుకుంటోంది. నిజానికి ఆగస్ట్‌లోనే ప్రారంభించిన రోడ్‌షోలకు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పటిష్ట ప్రతిస్పందన లభిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.హాంకాంగ్, సింగపూర్, లండన్, న్యూయార్క్సహా దేశీయంగా కీలక నగరాలలో సీనియర్ మేనేజ్మెంట్ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. కంపెనీకిగల డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో, పటిష్ట ఫైనాన్షియల్స్, డిజిటల్ ఫస్ట్ వృద్ధి వ్యూహాలను రోడ్‌షోలలో ప్రదర్శిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో కంపెనీ విలువ 18 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేశాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ ఐపీవోకు దరఖాస్తు చేసినప్పుడు 11 బిలియన్ డాలర్ల విలువను అంచనా వేసిన సంగతి తెలిసిందే.ఐపీవో వివరాలివీఐపీవోలో భాగంగా టాటా క్యాపిటల్ మొత్తం 47.58 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 21 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్‌సీ 3.58 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా టాటా గ్రూప్ దిగ్గజం 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే యోచనలో ఉంది. నెలాఖరు(30)కల్లా కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌కానున్నట్లు అంచనా. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్‌సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ పెట్టుబడి అవసరాలకుగాను టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. లిస్టింగ్ విజయవంతమైతే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డ్ నెలకొల్పనుంది.ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే..2023 నవంబర్‌లో టాటా టెక్నాలజీస్ లిస్టయ్యాక, తిరిగి టాటా గ్రూప్ నుంచి మరో దిగ్గజం ఐపీవోకు రానుండటం ప్రస్తావించదగ్గ అంశం! 2022 సెప్టెంబర్‌లో అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ ఆర్బీఐ నిబంధనల ప్రకారం 2025 సెపె్టంబర్‌లోగా ఐపీవో చేపట్టవలసి ఉంది. ఇప్పటికే అప్పర్‌లేయర్ ఎన్బీఎఫ్సీలు.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్(హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థ), బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ ఆదాయం రూ. 7,692 కోట్లకు చేరగా.. రూ. 1,041 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
టాటా క్యాపిటల్ ఐపీవో 22న
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ఐపీవోలో భాగంగా మొత్తం 47.58 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 21 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్‌సీ 3.58 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే యోచనలో ఉంది. వెరసి కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లుగా నమోదుకానున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేశాయి. నెలాఖరు(30)కల్లా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానున్నట్లు అంచనా. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్‌సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ పెట్టుబడి అవసరాలకుగాను టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. లిస్టింగ్ విజయవంతమైతే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డ్ నెలకొల్పనుంది. 2023 నవంబర్‌లో టాటా టెక్నాలజీస్ లిస్టయ్యాక, తిరిగి టాటా గ్రూప్ నుంచి మరో దిగ్గజం ఐపీవోకు రానుండటం ప్రస్తావించదగ్గ అంశం! 2022 సెపె్టంబర్లో అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ ఆర్బీఐ నిబంధనల ప్రకారం 2025 సెపె్టంబర్‌లోగా ఐపీవో చేపట్టవలసి ఉంది. ఇప్పటికే అప్పర్‌లేయర్ ఎన్బీఎఫ్సీలు.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్(హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థ), బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. -
ఎన్బీఎఫ్సీ బాహుబలి ఐపీవో!
న్యూఢిల్లీ: అప్పర్‌లేయర్ ఎన్బీఎఫ్సీ.. టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ ద్వారా 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లు(రూ. 94,600 కోట్లు)గా నమోదుకానున్నట్లు తాజాగా అంచనా వేశాయి. ఈ ఇష్యూ పూర్తియితే దేశంలో అతిపెద్ద ఎన్బీఎఫ్సీ ఐపీఓగా రికార్డు సృష్టించనుంది. లిస్టింగ్‌కు వీలుగా టాటా గ్రూప్ దిగ్గజం ఇటీవలే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో మొత్తం 26.58 కోట్ల షేర్లు విక్రయించనుంది. వీటిలో 21 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుండగా.. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. టాటా క్యాపిటల్ మాతృ సంస్థ టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్‌సీ 3.58 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్‌సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. కంపెనీ లిస్టయితే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా నమోదుకానుంది. వెరసి టాటా గ్రూప్ నుంచి రెండేళ్లలో రెండు కంపెనీలు లిస్టింగ్‌ను పొందినట్లవుతుంది. ఇంతక్రితం ఐటీ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ 2023 నవంబర్‌లో ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. పటిష్ట పనితీరు: ఈ ఏడాది తొలి త్రైమాసికం (2025–26, క్యూ1)లో టాటా క్యాపిటల్ కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపై రూ.1,041 కోట్లకు చేరింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ.472 కోట్లు ఆర్జించింది. ఆదా యం రూ. 6,557 కోట్ల నుంచి రూ.7,692 కోట్లకు ఎగసింది. -
ఐపీఓగా టాటా గ్రూప్ కంపెనీ
టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ బాటలో మరో ముందడుగు వేసింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా 200 కోట్ల డాలర్లు(రూ.17,200 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లు(రూ.94,600 కోట్లు)గా మదింపు చేశాయి.ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ మొత్తం 47.58 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 21 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుండగా.. 26.58 కోట్ల షేర్లను కంపెనీ ప్రధాన ప్రమోటర్ టాటా సన్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) ఆఫర్ చేయనున్నాయి. టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్‌సీ 3.58 కోట్ల షేర్లు విక్రయించనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్‌సీకి 1.8 శాతం వాటా ఉంది. ఇష్యూ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 క్యాపిటల్ పటిష్టతకు వినియోగించనుంది. ఇదీ చదవండి: ఆస్తిలో అంబానీనే మించిన 20 ఏళ్ల యువకుడుకంపెనీ ఇప్పటికే ఏప్రిల్‌లో గోప్యతా విధానంలో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జులైలో దీనికి అనుమతి లభించడంతో తుది ప్రాస్పెక్టస్ దాఖలు చేసేలోగా అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేయవలసి ఉంది. దీంతో తాజాగా సెబీకి అప్డేటెడ్ పత్రాలను దాఖలు చేసింది. వెరసి 2023 నవంబర్‌లో టాటా గ్రూప్ ఐటీ దిగ్గజం టాటా టెక్నాలజీస్ లిస్ట్ అయ్యాక తిరిగి మరో దిగ్గజం పబ్లిక్ ఇష్యూకి రానుంది. -
టాటా కంపెనీల దూకుడు.. ఎగసిన లాభాలు
ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 25 శాతం ఎగసి రూ. 1,306 కోట్లను అధిగమించింది. విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక బిజినెస్‌ల పటిష్ట పనితీరు ఇందుకు తోడ్పాటునిచ్చాయి.అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 1,046 కోట్ల లాభం మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 16,464 కోట్ల నుంచి రూ. 17,447 కోట్లకు బలపడింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2.25 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. జులై 7న చెల్లించనుంది.కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 4,280 కోట్ల నుంచి రూ. 4,775 కోట్లకు పుంజుకుంది. మొత్తం ఆదాయం రూ. 63,272 కోట్ల నుంచి రూ. 66,992 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 2 శాతం లాభంతో రూ. 397 వద్ద ముగిసింది.టాటా క్యాపిటల్ లాభం హైజంప్త్వరలో ఐపీవోకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్న టాటా క్యాపిటల్ మార్చి త్రైమాసికానికి రూ.1,000 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.765 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం ఇదే కాలంలో 50 శాతం వృద్ధితో రూ.7,478 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4,998 కోట్లుగా ఉంది.2024–25 ఆర్థిక సంవత్సరంలో టాటా క్యాపిటల్ లాభం రూ.3,665 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2023–24) లాభం రూ.3,327 కోట్లతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. ఆదాయం రూ.18,715 కోట్ల నుంచి రూ.28,313 కోట్లకు చేరుకుంది. గత నెలలో టాటా క్యాపిటల్ సెబీ వద్ద ఐపీవో పత్రాలను దాఖలు చేయడం తెలిసిందే.2 బిలియన్ డాలర్ల నిధులను (రూ.17వేల కోట్లు) సమీకరించాలనుకుంటోంది. సెబీ ఆమోదం లభిస్తే అతిపెద్ద ఐపీవోల్లో ఒకటి కానుంది. టాటా క్యాపిటల్‌లో టాటా సన్స్‌కు 92.83 శాతం వాటా ఉంది. అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్బీఐ నుంచి టాటా క్యాపిటల్ గుర్తింపు కలిగి ఉంది. -
టాటా గ్రూప్ నుంచి మరో ఐపీవో
టాటా గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ టాటా క్యాపిటల్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. అయితే ఇందుకు కంపెనీతో టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీనానికి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అనుమతించవలసి ఉంది. తదుపరి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల(మార్చి) చివరికల్లా విలీనానికి ఎన్సీఎల్టీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు అంచనా. దీంతో 2 బిలియన్ డాలర్ల(రూ.17,000 కోట్లు) విలువైన ఐపీవోకు శ్రీకారం చుట్టనుంది. తద్వారా 11 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా నిలవనున్నట్లు అంచనా. ఆర్బీఐ వద్ద అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూకి ఇప్పటికే సంస్థ బోర్డు అనుమతించింది. ఐపీవోలో భాగంగా 2.3 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రస్తుత వాటాదారులు సైతం కొంతమేర ఈక్విటీని ఆఫర్ చేయనున్నారు.ఏప్రిల్‌లో ఏథర్ ఎనర్జీ ఐపీవోఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ ఏప్రిల్‌లో పబ్లిక్ ఇష్యూకి వచ్చే సన్నాహాలు చేపట్టింది. ఇందుకు వీలుగా కంపెనీ తప్పనిసరిగా మార్పిడికిలోనయ్యే ఫ్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను ఈక్విటీగా మార్పు చేస్తోంది. కంపెనీల రిజిస్టర్ (ఆర్వోసీ) సమాచార ప్రకారం 1.73 సీసీపీఎస్‌ను 24.04 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసేందుకు ఏథర్ బోర్డు తాజాగా అనుమతించింది. సెబీ నిబంధనల ప్రకారం ప్రధాన ప్రాస్పెక్టస్ దాఖలు చేసే ముందుగానే సీసీపీఎస్‌ను ఈక్విటీగా మార్పిడి చేయవలసి ఉంటుంది. వెరసి 2025–26లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తొలి కంపెనీగా ఏథర్ ఎనర్జీ నిలిచే వీలున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?గతేడాది సెప్టెంబర్‌లో ఏథర్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. మహారాష్ట్రలో ఈవీ ద్విచక్ర వాహన తయారీ ప్లాంటు ఏర్పాటు, రుణ చెల్లింపులకుగాను నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు పత్రాలలో పేర్కొంది. ఐపీవోలో భాగంగా రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్ట్‌కానుంది. -
ఎన్బీఎఫ్సీ ఐపీవోల క్యూ
న్యూఢిల్లీ: అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీలపై రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిబంధనల కారణంగా ఇకపై పలు పబ్లిక్ ఇష్యూలకు తెరలేవనుంది. ఈ విభాగంలో వచ్చే వారం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభంకానుంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల వివరాల ప్రకారం కనీసం మరో మూడు కంపెనీలు ఈ జాబితాలో చేరనున్నాయి. వీటిలో టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ఏడాదిలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టింగ్‌కు ప్రయత్నించనున్నాయి.ఆర్బీఐ నిబంధనల ప్రకారం అప్పర్‌లేయర్ నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లు గుర్తింపు పొందిన మూడేళ్లలోగా ఐపీవోలు చేపట్టవలసి ఉంటుంది. ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్లు జోరుమీదుండటంతో నాణ్యతగల బిజినెస్‌లకు డిమాండ్ ఉన్నట్లు ఆనంద్ రాఠీ అడ్వయిజర్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగ డైరెక్టర్ సచిన్ మెహతా పేర్కొన్నారు. దీంతో మంచి విలువలు లభించేందుకు వీలున్నట్లు తెలియజేశారు. ఫలితంగా పలు ఎన్బీఎఫ్సీలు లిస్టింగ్ బాట పట్టనున్నట్లు అంచనా వేశారు. కేవలం ఆర్బీఐ నిబంధనల అమలుకోసమేకాకుండా నిధుల సమీకరణకు సైతం ఐపీవోలను వినయోగించుకోవచ్చని తెలియజేశారు. ఒకసారి లిస్టయితే నిధుల సమీకరణ సులభమవుతుందని వివరించారు. క్యూ ఇలా ఆర్బీఐ అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీ నిబంధనల ప్రకారం చూస్తే దిగ్గజాలు టాటా సన్స్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ఏడాదిలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కావలసి ఉంది. వీటిలో పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనంకానుంది. ఇక టాటా సన్స్ లిస్టింగ్‌ను తప్పించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టాటా సన్స్ లిస్టింగ్ గేమ్‌చేంజర్‌గా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇన్వెస్టర్లు లిస్టింగ్ ద్వారా భారీ లాభాలు అందుకునేందుకు వీలుండటమే దీనికి కారణమని తెలియజేశారు. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అధికస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకోగలదని భావిస్తున్నారు. దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాల హోల్డింగ్ కంపెనీగా నిలుస్తున్న టాటా సన్స్‌కు భారీ డిమాండ్ నెలకొంటుందని అంచనా వేశారు.కీలక పరిణామం ప్రయివేట్ రంగ హోల్డింగ్ దిగ్గజం టాటా సన్స్ లిస్టయితే వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ క్యాపిటల్ మార్కెట్లలో ఇది కీలక పరిణామంగా నిలుస్తుందని డీఏఎం క్యాపిటల్ సీఈవో ధర్మేష్ మెహతా పేర్కొన్నారు. భారత్‌లోనే అత్యంత ప్రముఖ గ్రూప్‌లలో ఒకటైన టాటా సన్స్‌కు దేశ, విదేశాల నుంచి గరిష్ట డిమాండ్ పుడుతుందని తెలియజేశారు.వాటాదారులకు భారీ విలువ చేకూరుతుందని మార్కెట్ నిపుణులు పలువురు అభిప్రాయపడ్డారు. వెరసి కనీసం 5 శాతం వాటాను ఆఫర్ చేస్తే రూ. 55,000 కోట్లకుపైగా నిధులు లభించవచ్చని అంచనా వేశారు. లిక్విడిటీతోపాటు.. ట్రేడింగ్ పరిమాణం సైతం భారీఆ పెరుగుతుందని తెలియజేశారు.లిస్టింగ్‌ను తప్పించుకునే యోచనతో టాటా సన్స్ ఇప్పటికే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ఆర్బీఐకు స్వచ్చందంగా సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆర్బీఐ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరమని నిపుణులు పేర్కొన్నారు. కాగా.. 2018లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనూహ్య పతనానికితోడు.. డీహెచ్ఎఫ్ఎల్ సైతం విఫలంకావడంతో మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. కఠిన లిక్విడిటీ సవాళ్లు ఎదురయ్యాయి. ఫలితంగా 2021 అక్టోబర్‌లో ఆర్బీఐ సవరించిన ఎస్బీఆర్ మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా వ్యవస్థాగత రిస్కులను అడ్డుకోవడం, పాలనను మరింత పటిష్టపరచడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది.ఇవీ నిబంధనలుఎస్బీఆర్ మార్గదర్శకాల ప్రకారం ఎన్బీఎఫ్సీలను నాలుగు విభాగాలు(లేయర్లు)గా విభజించింది. ప్రాథమిక(బేసిక్), మాధ్యమిక(మిడిల్), ఎగువ(అప్పర్), అత్యున్నత(టాప్) లేయర్లుగా ఏర్పాటు చేసింది. ఆయా కంపెనీల పరిమాణం, కార్యకలాపాలు, రిస్క్ స్థాయిల ఆధారంగా వీటికి తెరతీసింది. దీనిలో భాగంగా అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలుగా గుర్తింపు పొందిన మూడేళ్ల కాలంలో స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టయ్యేలా నిబంధనలను సవరించింది. ఇందుకు అనుగుణంగా 2022 సెప్టెంబర్‌లో 16 సంస్థలను ఈ జాబితాలో చేర్చింది. అయితే 2023లో జాబితా నుంచి సంఘ్వీ ఫైనాన్స్‌ను తప్పించింది.వెరసి 15 సంస్థలు అప్పర్లేయర్లో చేరాయి. వీటిలో పిరమల్ క్యాపిటల్, టాటాసన్స్లను మినహాయిస్తే 9 కంపెనీలు ఇప్పటికే లిస్టయినట్లు మెహతా వెల్లడించారు. బజాజ్ హౌసింగ్ ఐపీవో ప్రారంభంకానున్న కారణంగా మిగిలిన మూడు కంపెనీలు ఏడాదిలోగా లిస్ట్‌కావలసి ఉంటుంది. ఈ మూడు సంస్థలు 2025 సెప్టెంబర్‌లోగా పబ్లిక్ ఇష్యూలను చేపట్టవలసి ఉన్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ తెలియజేశారు. -
‘సలామ్’ కొడితే రుణం!
♦ సిబిల్ స్కోర్ కాదు.. నెటిజన్ల లైక్‌లు చాలు ♦ వ్యక్తిగత రుణాలకు టాటా క్యాప్ కొత్త రూటు ♦ సోషల్ మీడియా ఓట్లకు అగ్రాసనం; గరిష్ట పరిమితి రూ.లక్ష ♦ 3లక్షల్లోపు ఆదాయం ఉన్నవారికి చాన్స్ ముంబై: వ్యక్తిగత రుణాలకు టాటా క్యాపిటల్ సోషల్ మీడియా టచ్ ఇచ్చింది. టీవీల్లో డ్యాన్స్, మ్యూజిక్ పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు తమ ప్రదర్శన నచ్చితే ఓటు వేసి గెలిపించాలని వీక్షకులను కోరడం తెలిసిందే. ఇదే మాదిరిగా రుణాలు కావాలనుకున్న వారు కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ఓట్లను గెలవాల్సి ఉంటుంది. ఎన్ని ఓట్లు వచ్చాయనేదాన్ని బట్టి వారికి రూ.లక్ష వరకూ రుణాన్ని టాటా క్యాపిటల్ మంజూరు చేస్తుంది. అదీ కథ. ప్రక్రియ ఇలా... వ్యక్తులు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన, తక్కువ ఆదాయ వర్గాల వారు, వార్షిక ఆదాయం రూ.3 లక్షలు దాటని వారు ఈ రుణాలను పొందొచ్చని టాటా క్యాపిటల్ చెబుతోంది. దరఖాస్తుదారులు రుణం ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్పాలి. అప్పుడు ఆ సమాచారాన్ని టాటా క్యాపిటల్ ఠీఠీఠీ. ఛీౌటజీజజ్టి. జీn అనే వెబ్సైట్లో 3, 4 వారాల పాటు ప్రదర్శిస్తుంది. సోషల్, డిజిటల్ మీడియా వేదికలపై దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచుతుంది. ఈ దరఖాస్తు భవితవ్యాన్ని తేల్చాల్సింది నెటిజన్లే. సంబంధిత దరఖాస్తుదారుడికి తమ మద్దతును ‘సలామ్’ అంటూ తెలియజేస్తే చాలు. అది రుణం ఆశిస్తున్నవారికి ప్లస్ అవుతుంది. ఓ రుణ దరఖాస్తుకు తగినన్ని లైక్స్ లేదా సలామ్‌లు వస్తే అప్పుడు దాన్ని రుణానికి ప్రాథమిక అర్హతగా టాటా క్యాపిటల్ తీసుకుంటుంది. నాణ్యతా సమీక్ష చేపడుతుంది. దరఖాస్తుదారుడితో మాట్లాడి, అతడి రుణ అవసరాలు, చిత్తశుద్ధిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దీనిద్వారా మోసపూరిత దరఖాస్తులను నివారించొచ్చన్నది కంపెనీ యోచన. దరఖాస్తు దారుడికి లాభమేంటి..? రుణం కోసం ఇన్ని పాట్లు అవసరమా...? అనుకునే వారు తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. ఇలా ఎక్కువ సలామ్‌లను గెలుచుకున్న వారికి మార్కెట్లో ఉన్న వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్ల కంటే రెండు నుంచి మూడు శాతం తక్కువకే రూ.లక్ష వరకు రుణాన్ని టాటా క్యాపిటల్ అందజేస్తుంది. మరో ప్రయోజనం ఏంటంటే... రుణం పొందేందుకు సిబిల్ స్కోరు అవసరం లేదు. ఒకరి హామీ కూడా అక్కర్లేదు. టాటా క్యాపిటల్ రిటైల్ బిజినెస్, హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి గోవింద్ శంకరనారాయణన్ దీనిపై స్పందిస్తూ... ‘‘ఈ ప్రయత్నం పరిశ్రమ ప్రయోజనాలకు కూడా ఉపకరిస్తుంది. ఇతర రుణదాతల్లోనూ నమ్మకం ఏర్పడుతుంది. రుణాలకు ఈ గ్రూపులు (తక్కువ ఆదాయ వర్గాలు) కూడా అర్హులేనని అర్థం చేసుకుంటారు’’ అని చెప్పారు. విద్యావసరాలు, ఆరోగ్యం, ఇతర అవసరాల కోసమూ రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చని టాటా క్యాపిటల్ చెబుతోంది. ఉదాహరణకు కిరణ్జోహార్ ఉన్నత విద్య కోసం రూ.88వేలు రుణం కావాలంటూ టాటా క్యాపిటల్‌కు చేసుకున్న దరఖాస్తుకు ఇప్పటి వరకు 96 సలామ్‌లు వచ్చాయి. నాసిక్‌కు చెందిన రూపేష్ బలరావ్ చిన్నప్పుడే పోలియోతో అంగవైకల్యం బారినపడ్డాడు. ఓ జనరల్ స్టోర్ పెట్టుకుని తన కాళ్లపై తాను నిలబడాలని ఆశించాడు. రుణం కావాలని బ్యాంకులను కోరితే తిరస్కరణ ఎదురైంది. ఇప్పుడు ఇతడి కథనాన్ని టాటా క్యాపిటల్ ఆన్లైన్లో ఉంచగా 123 ఓట్లు వచ్చాయి. -
మహిళలకు టాటా ప్రత్యేక హోమ్‌లోన్
ముంబై: టాటా క్యాపిటల్ సంస్థ మహిళల కోసం తక్కువ వడ్డీ రేటుకే రుణాలను ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థల మాదిరి టాటా క్యాపిటల్ కూడా ఈ తరహా రుణాలను అందిస్తోంది. మహిళలకు రూ.40 లక్షల లోపు రుణాలను 10.15 శాతానికే అందిస్తామని కంపెనీ పేర్కొంది. గతంలో ఈ వడ్డీరేటు 10.50 శాతంగా ఉండేదని పేర్కొంది. ఈ పథకం అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన వచ్చే నెల 8 వరకూ అందుబాటులో ఉంటుందని వివరించింది. మహిళలు తాము కలలు గన్న ఇంటిని సొంతం చేసుకోవడం ద్వారా మహిళల ఆర్థిక సాధికారితకు తోడ్పడం తమ లక్ష్యమని కంపెనీ పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు గృహ రుణాలు 10.10% వడ్డీకే అందిస్తోంది. ఇక ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ మహిళల కోసం ప్రత్యేక గృహరుణ పథకాన్ని ఆఫర్ చేస్తోంది.