
షేరు ధరల శ్రేణి రూ. 310–326
అక్టోబర్ 6–8 మధ్య ఐపీవో
రూ. 15,512 కోట్ల సమీకరణ
2025లో అతిపెద్ద ఇష్యూ
న్యూఢిల్లీ: అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూకి రూ. 310–326 ధరల శ్రేణి ప్రకటించింది. అక్టోబర్ 6న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా మొత్తం 47.58 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 15,512 కోట్లు సమకూర్చుకోనుంది. వెరసి 2025లో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. ఐపీవోలో భాగంగా టాటా గ్రూప్ దిగ్గజం 21 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది.
అంతేకాకుండా మరో 23 కోట్ల షేర్లను ప్రమోటర్ టాటా సన్స్ ఆఫర్ చేయనుంది. వీటికి జతగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్‌సీ) సైతం 3.58 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఐపీవో ధర ప్రకారం లిస్టింగ్‌లో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.38 లక్షల కోట్లుగా నమోదయ్యే వీలుంది. అక్టోబర్ 8న ముగియనున్న ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు 3న షేర్లను ఆఫర్ చేయనుంది. ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్‌సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
ఈక్విటీ జారీ నిధులను రుణాల విడుదలతోపాటు భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. దేశీ ఫైనాన్షియల్ రంగంలోనే టాటా క్యాపిటల్ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నమోదుకానుంది. 2023 నవంబర్‌లో టాటా గ్రూప్ నుంచి టాటా టెక్నాలజీస్ లిస్టయ్యాక, రెండేళ్ల తదుపరి తిరిగి మరో దిగ్గజం ఇదే బాట పట్టడం గమనార్హం!
ఫైనాన్షియల్ సరీ్వసులతో
టాటా గ్రూప్‌లోని ఫైనాన్షియల్ సరీ్వసుల విభాగం టాటా క్యాపిటల్ తొలుత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి గోప్యతా మార్గంలో ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. జూలైలో సెబీ అనుమతి పొందింది. ఆర్‌బీఐ నుంచి అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందిన సంస్థ అప్పటినుంచి మూడేళ్లలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కావలసి ఉంది. 2022 సెపె్టంబర్‌లో టాటా క్యాపిటల్‌కు ఈ గుర్తింపు లభించింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీవో ద్వారా ఈ ఏడాది జూన్‌లో రూ. 12,500 కోట్లు సమీకరించడం తెలిసిందే. బజాజ్ ఫైనాన్స్ 2024 సెప్టెంబర్‌లోనే లిస్టయ్యింది. 2007లో కార్యకలాపాలు ప్రారంభించిన టాటా క్యాపిటల్ ఆదాయం గతేడాది (2024 –25) రూ. 18,175 కోట్ల నుంచి రూ. 28,313 కోట్లకు జంప్‌చేసింది. నికర లాభం రూ. 3,327 కోట్ల నుంచి రూ. 3,655 కోట్లకు ఎగసింది.
మార్కెట్‌ను మించుతూ
టాటా క్యాపిటల్ మార్కెట్ వృద్ధి (11%)ని మించుతూ 17–18% పురో గతి సాధిస్తోంది. నూతన ప్రొడక్టులను ఆవిష్కరిస్తూ మార్కెట్ వృద్ధికంటే వేగంగా ఎదుగుతోంది. డిజిటల్ సాంకేతికతలపై గత 4–5 ఏళ్లలో రూ. 2,000 కోట్లు వెచ్చించాం.– రాజీవ్ సబర్వాల్, టాటా క్యాపిటల్ ఎండీ, సీఈవో
వియ్‌వర్క్ @ రూ. 615648
⇒అక్టోబర్ 3–7 మధ్య ఐపీవో
⇒రూ. 3,000 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: కోవర్కింగ్ కార్యాలయ నిర్వాహక కంపెనీ వియ్‌వర్క్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి రూ. 615–648 ధరల శ్రేణి నిర్ణయించింది. అక్టోబర్ 3న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా మొత్తం 4.63 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఎంబసీ బిల్డ్‌కాన్ ఎల్‌ఎల్‌పీతోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్ సంస్థ 1 ఏరియల్ వే టెనెంట్(వియ్‌వర్క్ గ్లోబల్‌లో భాగం) షేర్లను ఆఫర్ చేయనున్నాయి. తద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఐపీవో ధర ప్రకారం కంపెనీ లిస్టింగ్‌లో రూ. 8,685 కోట్ల మార్కెట్ విలువను సాధించే వీలుంది. ఇష్యూ అక్టోబర్ 7న ముగియనుంది.