మీ డబ్బు - మీ నిర్ణయం.. | smart investment and finance tips telugu | Sakshi
Sakshi News home page

మీ డబ్బు - మీ నిర్ణయం..

Jan 12 2026 11:39 AM | Updated on Jan 12 2026 12:12 PM

smart investment and finance tips telugu

సొంత ఇల్లు కొనాలన్నా, మిగిలిన డబ్బును పొదుపు చేయాలన్నా సగటు మనిషికి ఎన్నో సందేహాలు. మార్కెట్లో పెట్టుబడి మార్గాలకు కొదువ లేకపోయినా, ఎక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది? ఎక్కడ రాబడి ఎక్కువగా వస్తుంది? అనేదే అసలు ప్రశ్న. మీ ఆర్థిక భవిష్యత్తును పటిష్టం చేసేలా రియల్టీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి కీలక రంగాలపై కొన్ని కీలక ప్రశ్నలకు నిపుణులు ఇచ్చిన స్పష్టమైన వివరణలు ఇక్కడ చూద్దాం.

రియల్టీ..

ఇల్లు కొనటానికి డౌన్‌పేమెంట్‌ ఎంతవరకూ ఉండాలి? 

సాధారణంగా ఇంటి విలువలో 10–20 శాతాన్ని డౌన్‌పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 80–90 శాతం మొత్తాన్ని బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు రుణంగా అందిస్తుంటాయి. ప్రాపర్టీ విలువ రూ.30 లక్షల లోపు ఉంటే 90 శాతం వరకూ మొత్తాన్ని రుణంగా ఇస్తారు. 10 శాతం డౌన్‌పేమెంట్‌ చెల్లించాలి. ప్రాపర్టీ విలువ రూ.30 నుంచి 75 లక్షల వరకూ ఉంటే 80 శాతం వరకూ రుణాన్ని ఇస్తారు. మిగిలిన 20 శాతం డౌన్‌పేమెంట్‌గా చెల్లించాలి.  రూ.75 లక్షలు దాటిన ఇళ్లకయితే 25 శాతం వరకూ డౌన్‌పేమెంట్‌ అవసరం. మిగిలిన 75 శాతాన్నే రుణంగా ఇస్తారు. ఇక 5–8 శా>తం ఉండే స్టాంప్‌ డ్యూటీ, జీఎస్‌టీ, ఇంటీరియర్‌ ఖర్చులు, లీగల్‌ ఖర్చులు అన్నీ కొనుగోలుదారే భరించాలి.  

బ్యాంకింగ్‌..

స్వల్ప కాలంపాటు సొమ్ము దాచుకోవటానికి సేవింగ్స్‌ ఖాతా  లేక లిక్విడ్‌ ఫండ్సా? 

లిక్విడ్‌ ఫండ్స్‌లో సేవింగ్స్‌ ఖాతా కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది. సేవింగ్స్‌ ఖాతాపై 2–3 శాతం వడ్డీ వస్తే... లిక్విడ్‌ ఫండ్స్‌లో 5–6 శాతం వరకూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రా చేసుకోవటమన్నది సేవింగ్స్‌ ఖాతాలోనే సాధ్యపడుతుంది. లిక్విడ్‌ ఫండ్స్‌లో కనీసం ఒక్కరోజైనా పూర్తిగా ఉంచాలి. ఎక్కువ శాతం ట్యాక్స్‌ రేటు చెల్లించేవారికి సేవింగ్స్‌ ఖాతాకన్నా లిక్విడ్‌ ఫండ్సే బెటర్‌. పూర్తిస్థాయి భద్రతను కోరుకునేవారికి సేవింగ్స్‌ ఖాతా నయం. ఇలా దేని ప్రత్యేకతలు దానికున్నాయి. కనీసం నెలరోజుల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని సేవింగ్స్‌ ఖాతాలో ఉంచుకుని, అంతకు మించిన మొత్తాన్ని లిక్విడ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయటం మంచిది.  

బంగారం  

బంగారానికి హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరా? 

దేశంలో అన్ని నోటిఫైడ్‌ జిల్లాల్లోనూ హాల్‌మార్కింగ్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనిప్రకారం బంగారాన్ని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌’ (బీఐఎస్‌) హాల్‌మార్కింగ్‌ చేయాలి. అంటే ప్రత బంగారు ఆభరణంపై బీఐఎస్‌ లోగో, దాని స్వచ్ఛత (24– 22– 18 క్యారెట్లు..), హాల్‌మార్కింగ్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్, సదరు జ్యుయలర్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ వంటివన్నీ ఉండాలి. స్వల్ప నాన్‌–నోటిఫైడ్‌ జిల్లాలకు మాత్రం ఈ హాల్‌మార్కింగ్‌ నిబంధనలు వర్తించవు. ఇక బ్యాంకులు, ఎంఎంటీసీ విక్రయించే బంగారం కాయిన్లు, బార్లకు అవే హాల్‌మార్కింగ్‌ చేస్తాయి. హాల్‌మార్కింగ్‌ వల్ల బంగారం స్వచ్ఛత ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. ఆ స్వచ్ఛతకు గ్యారంటీ కూడా ఉంటుంది.  

స్టాక్‌ మార్కెట్‌...

రిటైరైన వారికి స్టాక్‌ మార్కెట్లు సురక్షితమేనా? 

సురక్షితమే. కాకపోతే మిగతా వారితో పోలి్చనపుడు రిటైరీలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి అదనపు ఆదాయం ఉండదు. కాబట్టి ఎక్కువ రాబడులకన్నా తమ అసలు భద్రంగా ఉండటం ముఖ్యం. మార్కెట్లలో ఒడదుడుకులు సహజం కనక అవి వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలి. అందుకని తమ రిటైర్మెంట్‌ నిధిలో 15–20 శాతం మాత్రమే స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయటం మంచిది. నెలవారీ ఖర్చుల కోసం కాకుండా దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డివిడెండ్లు ఇచ్చే షేర్లు, లేదా లార్జ్‌క్యాప్‌ షేర్లు లేదా వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసే ఈక్విటీ మ్యూచ్‌వల్‌ ఫండ్లను ఎంచుకోవాలి. ఎక్కువ డబ్బును ఎఫ్‌డీలు, ఆర్‌బీఐ బాండ్లలో పెట్టుకోవాలి.  

మ్యూచువల్‌ ఫండ్స్‌...

సిప్‌లో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్‌ చేయటం మంచిదా..∙ఒకేసారి పెద్ద మొత్తం పెడితే మంచిదా? 

సిప్‌ అనేది అందరికీ వర్తిస్తుంది. ఇక ఏకమొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టడమనేది కొందరికే. మార్కెట్‌ టైమింగ్‌ను చూసుకుని, బాగా రిస్‌్కను తట్టుకోగలిగే వారికే! సిప్‌ వల్ల మార్కెట్‌ టైమింగ్‌ రిస్కు ఉండదు. క్రమశిక్షణ అలవాటు కావటంతో పాటు రుపీ కాస్ట్‌ కూడా యావరేజ్‌ అవుతుంది. కాకపోతే మీ దగ్గర పెద్ద మొత్తం ఉన్నపుడు సిప్‌ చేయటం మొదలుపెడతే ఆ డబ్బును ఇన్వెస్ట్‌ చేయ డానికి చాలా సమయం పడుతుంది. అలాకాకుండా ఏకమొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్‌ చేస్తే మార్కెట్లు కలిసివస్తే రాబడులు కూడా బాగానే ఉంటాయి. కాకపోతే మార్కెట్లు బాగా చౌకగా ఉన్నాయని భావించినపుడు, రిసు్కను తట్టుకోగలమని భావించినపుడు మాత్రమే దీనికి సిద్ధపడాలి.  

ఇన్సూరెన్స్‌

ప్రెగ్నెన్సీ, డెలివరీ ఖర్చులు  ఇన్సూరెన్స్‌లో కవరవుతాయా?

మెటరి్నటీ ఖర్చులకు చాలా బీమా కంపెనీలు ఇపుడు కవరేజీ ఇస్తున్నాయి. పాలసీ తీసుకున్నాక కొంత వెయిటింగ్‌ పీరియడ్‌ తరవాతే ఇవి వర్తిస్తాయి. నార్మల్‌ లేదా సి–సక్షన్‌ డెలివరీ ఖర్చులతో పాటు ప్రీ–పోస్ట్‌ నాటల్‌ వ్యయాలు, కొంతకాలం వరకూ పుట్టిన బిడ్డకు అయ్యే ఖర్చు ఇవన్నీ కవర్‌ అవుతున్నాయి. మెటరి్నటీ కవర్‌ పాలసీ తీసుకున్న 2–4 ఏళ్ల తరువాతే మొదలవుతుంది. ఈ వెయిటింగ్‌ పీరియడ్‌లోపల అయ్యే ఖర్చులకు కవరేజీ ఉండదు. ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప ఐవీఎఫ్, ఐయూఐ వంటి గర్భధారణ ఖర్చులకు బీమా కవరేజీ ఉండదు. అయితే కొన్ని యాజమాన్యాలిచ్చే పాలసీ లు, గ్రూప్‌ పాలసీల్లో మాత్రం వెయిటింగ్‌ పీరియడ్‌ లేకుండానే డెలివరీ కవరేజీ అందిస్తున్నారు.

ఇదీ చదవండి: రిటైర్మెంటుతో.. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement