ఖర్చులకు కళ్లెం వేద్దాం! | Explanation of Lifestyle inflation refers to the increase in expenditures as your income goes up | Sakshi
Sakshi News home page

ఖర్చులకు కళ్లెం వేద్దాం!

Feb 23 2026 5:33 AM | Updated on Feb 23 2026 5:33 AM

Explanation of Lifestyle inflation refers to the increase in expenditures as your income goes up

లైఫ్‌స్టయిల్‌ అప్‌గ్రేడ్‌ కోసం మిడిల్‌క్లాస్‌ పరుగులు

దీంతో ఆదాయానికి మించి పెరిగిపోతున్న ఖర్చులు

సైలెంట్‌గా ఒత్తిడిలోకి జారుకుంటున్న కుటుంబాలు

ఆదాయంలో 20 శాతం పొదుపు తప్పనిసరి

అవసరాలకు 50; లైఫ్‌స్టయిల్‌కు మిగతా 30 శాతం

ఇలా వర్గీకరిస్తే ఖర్చులను నియంత్రించటం సాధ్యమే  

ఒకప్పుడు విలాసం అనుకున్నవన్నీ ఇప్పుడు అవసరాలైపోయాయి. స్మార్ట్‌ఫోన్లు, కార్లు, లాప్‌టాప్‌లు, ఏటా ఒకటిరెండు సార్లు వైద్య పరీక్షలు, విహార యాత్రలు... ఇవన్నీ ఇపుడు జీవితంలో భాగమైపోయాయి. ఇక కొంచెం ఆదాయం పెరిగిందంటే వీటన్నిట్లోనూ ‘బెటర్‌మెంట్‌’ తప్పదనిపిస్తుంది. మెరుగైన ఫోన్లు, ఆధునిక ల్యాప్‌టాప్‌లు, సురక్షితమైన కార్లు, నాణ్యమైన చదువు, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ, డిజిటల్‌ సబ్‌స్క్రిప్షన్లు, విదేశీ విహారాలు ఇవన్నీ అప్‌గ్రేడెడ్‌ వెర్షన్లతో అవసరాలుగా మారి మనముందు కూర్చుంటున్నాయి. ఆదాయం పెరిగినప్పుడు సరే!!. కానీ ఆదాయం తక్కువ ఉన్నా కూడా వీటికోసం పరుగులుపెట్టి ఖర్చులు చేస్తేనే సమస్య. ఈ సమస్య ఇపుడు పెరుగుతోంది. పెద్దదవుతోంది. కుటుంబాలను ఒత్తిడిలోకి నెడుతోంది. మరేం చేయాలి? ఇదిగో ఈ వెల్త్‌ స్టోరీ చూడండి...

మనకు, మన ఆదాయానికి తగ్గట్లుగా జీవన శైలిని పెంచుకోవటం తప్పు కాదు. కానీ పరిమితు లు లేకుండా పెంచుకుంటూ పోతేనే సమస్య. అందుకే లైఫ్‌స్టయిల్‌ను తెలివిగా నియంత్రించుకోవటం తప్పనిసరి. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటం... అవసరాలను స్పష్టంగా వర్గీకరించుకోవటం... స్వీయ పరిమితులు విధించుకోవటం ఎలాగో చూద్దాం. 

ద్రవ్యోల్బణం.. సైలెంట్‌ కిల్లర్‌ 
ఆదాయం పెరుగుతున్నప్పుడు లైఫ్‌స్టయిల్‌పరమైన ద్రవ్యోల్బణం పెరుగుతుంటుంది. ఖర్చు చేయడమనేది నిశ్శబ్దంగా, చాలా వేగంగా పెరిగిపోతుంది. జీతం పెరగ్గానే ఆటోమేటిక్‌గా పెంచుకునేవి కొన్ని ఉంటాయి. అవేంటంటే.. 
→ మరింత పెద్ద ఇల్లు, మరింత ఎక్కువ అద్దె 
→ కారును అప్‌గ్రేడ్‌ చేసుకోవడం లేదా ఈఎంఐలపై గ్యాడ్జెట్లు కొనుగోలు చేయటం. 
→ మరింత తరచుగా బయట తినటం, ఫుడ్‌ డెలివరీ సరీ్వసులను ఆశ్రయించటం. 
→ జిమ్‌తో పాటు అనేక ఓటీటీలు, యాప్‌లు సబ్‌స్క్రయిబ్‌ చెయ్యటం. 

వాస్తవానికి వీటిని విడివిడిగా చూస్తే ఒక్కో దానిపై చేసే ఖర్చు సముచితమైనదిగానే అనిపిస్తుంది. కానీ వాటన్నింటినీ కలిపి చూస్తే మాత్రం మనకు తెలియకుండానే పొదుపు సామర్థ్యం తగ్గిపోతున్న విషయం అర్థమవుతుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువగానే సంపాదిస్తున్నప్పటికీ చాలా కుటుంబాలు, తక్కువగా పొదుపు చేస్తుండటానికి ప్రధాన కారణం ఇదే. 

‘అవసర ఖర్చుల’ భ్రమ .. 
అవసరమనే పేరుతో ఇప్పుడు చేసే చాలా మటుకు ఖర్చులు, నిజంగా అవసరమైనవేనా అంటే సరైన సమాధానం దొరకదు. ఉదాహరణకు స్మార్ట్‌ఫోన్‌ అనేది అవసరం. కానీ ప్రతి సంవత్సరం వేలకు వేలు పోసి దాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకోవడం అవసరమేనా? అలాగే అప్పుడప్పుడు బయట హోటళ్లలో తినడం సాధారణమే. కానీ అది ఎంత తరచుగా జరుగుతోందనేది ముఖ్యం. విహారయాత్రలు ము ఖ్యమే. కానీ ఎంత తరచుగా వెళ్తున్నాం? ఎంత ఖర్చు పెడుతున్నాం? అనేది అత్యంత ప్రధానం. ఖర్చులనేవి సమస్య కాదు. హద్దులు లేకపోవడమే అసలు సవాలు. 

ఏం చేయాలంటే.. 
జీవన విధానానికి పెద్దగా ఇబ్బంది లేకుండానే ఖర్చులను అదుపు చేసుకునేందుకు కొన్ని మార్గాలు ఉంటాయి. అవేంటంటే.. 
→ పరిమితి విధించుకోవడం జీవన వ్యయాలనేవి ఆదాయానికి మించిన వేగంతో పెరగకూడదు. పాటించాల్సిన సింపుల్‌ రూల్‌ ఏమిటంటే, ఆదాయం 10 శాతం పెరిగితే, లైఫ్‌స్టయిల్‌ ఖర్చులు 5–6 శాతానికి మించి పెరగకుండా చూసుకోవాలి. 
→ పొదుపును ఆటోమేట్‌ చేయాలి 
ఖర్చు చేయడానికి ముందు పొదుపు చేయాలి. దీనితో లైఫ్‌స్టయిల్‌ ఖర్చులు ఆటోమేటిక్‌గా దానికి తగ్గట్లు సర్దుకుంటాయి. 
→ ఒక్కొక్కటిగా అప్‌గ్రేడ్‌ ఇల్లు, కారు, గ్యాడ్జెట్లు ఇలాంటి వాటన్నింటినీ ఒకేసారి అప్‌గ్రేడ్‌ చేయడం పెట్టుకోవద్దు. ఒక్కొక్కటిగా చేసుకుంటే కాస్త వెసులుబాటు లభిస్తుంది. 
→ సబ్‌్రస్కిప్షన్లను సరిచూసుకోవాలి.. ఉపయోగించని వాటిని క్యాన్సిల్‌ చేసేయాలి. దీనివల్ల గణనీయంగా ఆదా అవుతుంది.  

మూడు కేటగిరీలు.. 
వృధా ఎక్కడవుతోందో గ్రహించాలంటే మనం చేసే ఖర్చులను తప్పనిసరైనవి, లైఫ్‌స్టయిల్‌ని బట్టి ఉండేవి, లీకేజీలనే మూడు కేటగిరీల కింద విడగొట్టుకోవాలి. వాటిని ఒకసారి విశ్లేíÙంచి చూసుకుంటే, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ కట్టడి చేసుకోవాలనే దానిపై అవగాహన వస్తుంది.  
లైఫ్‌స్టయిల్‌ని బట్టి సరిదిద్దుకునేవి కాస్త స్మార్ట్‌గా వ్యవహరిస్తే ఈ కింది వాటిని కొంత కంట్రోల్‌ చేసుకోవడానికి వీలుంటుంది. 
→ బయట హోటళ్లలో తినడం 
→ విహార యాత్రలు 
→ సబ్‌్రస్కిప్షన్లు ∙అప్‌గ్రేడెడ్‌ గ్యాడ్జెట్లు ∙తరచుగా వాహనాలను అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ ఉండటం

తప్పనిసరైన ఖర్చులు 
ఇలాంటివి జీవిత నాణ్యతను మెరుగుపరుస్తాయి. వీటి విషయంలో రాజీపడే పరిస్థితి ఉండదు. 
→ విద్య 
→ ఆరోగ్య సంరక్షణ 
→ ప్రాథమిక హౌసింగ్‌ 
→ బీమా 
→ నిత్యావసరాలు

లీకేజీలు 
అదనంగా ఎలాంటి ప్రయోజనం లభించకుండా చేసే ఖర్చులు ఈ బకెట్‌ కిందికి వస్తాయి. 
→ ఉపయోగించని సబ్‌స్క్రిప్షన్లు, అడ్డదిడ్డంగా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ 
→ క్రెడిట్‌ కార్డ్‌ బాకీలను రోలోవర్‌ చేస్తుండటం. 
→ ఖర్చు చేస్తున్నామని గ్రహించకుండానే కనీ్వనియెంట్‌గా చేసే వ్యయాలు

రియాలిటీ చెక్‌  
లైఫ్‌స్టయిల్‌కి సంబంధించి అప్‌గ్రేడ్స్‌ చేసుకోవడంలో తప్పేమీ లేదు. కోరుకున్నట్లుగా, బాగా జీవించాలనుకోవడమేమీ తప్పిదం కూడా కాదు. కాకపోతే, అడ్డూ అదుపూ లేకుండా లైఫ్‌స్టయిల్‌ ఖర్చులను పెంచుకోవడమే తప్పు. రేపటి రోజున వచ్చే ఆదాయాన్ని నేడే ఖర్చు చేసేయకుండా జాగ్రత్తపడితేనే ఆర్థికంగా నిశి్చంతగా ఉంటుంది. ఇందుకోసం ఆదాయంలో ఖర్చులకు చేసే కేటాయింపుల విషయంలో పాటించతగిన సింపుల్‌ సూత్రం ఒకటి ఉంది.  
→ 50%– తప్పనిసరి అవసరాలు 
→ 30% – లైఫ్‌స్టయిల్, కోరికలు 
→ 20% – పొదుపు, పెట్టుబడులు. 
లైఫ్‌స్టయిల్‌ ఖర్చులు 40 శాతాన్ని దాటాయంటే, పొదుపు కేటాయింపులు ఆటోమేటిక్‌గా పడిపోతాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement